.
కొందరు స్త్రీలు బహుముఖ ప్రజ్ఞాశాలులు… భిన్నరంగాల్లో వాళ్ల శ్రమ, అభినివేశం, ఆసక్తి, విజయాలు కొంత ఆశ్చర్యం అనిపించినా అభినందించకుండా ఉండలేం కదా… జన్మతః సంక్రమించే జ్ఞానం, గ్రాస్పింగ్ స్టామినాకు తోడు వాళ్ల శ్రమ, వాళ్ల ఆసక్తి కూడా భిన్నరంగాల్లో ప్రజ్ఞ ప్రదర్శనకు కారణాలు…
కర్నాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ గురించి ఆమధ్య చెప్పుకున్నాం కదా… బహుముఖ ప్రజ్ఙ ఆమెది… సేమ్, మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ ప్రతిభ గురించీ చెప్పుకున్నాం నిన్న… ఇవే సెర్చ చేస్తుంటే ఓ తెలుగు పేరు కనిపించింది… ఇంకా ఆసక్తికరం, అభినందనీయం..,. ఆమె పేరు డాక్టర్ తేజస్విని మనోజ్ఞ…
Ads
1.అచ్చు బాపు బొమ్మలాంటి అందం… ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది, డాక్టర్…. ఇప్పుడూ ప్రాక్టీస్ చేస్తోంది… ఎండీ పీడియాట్రిక్స్…
2. ఆమె మోడల్… మిస్ ఎర్త్ 2019 పోటీలో ప్రపంచ అందగత్తెలతో పోటీపడి మరీ ఇండియాకు పతకం తీసుకొచ్చింది…
3. ఆమె ఎన్సీసీలో చేరి 13 లక్షల మందిలో Best Cadet గా ప్రధానమంత్రి నుండి పతకం అందుకుంది…
4. ఆమె నాట్యగత్తె… శాస్త్రీయ నాట్యం తెలుసు… మాజీ రాష్ట్రపతి కలాం ఎదుట ప్రదర్శన ఇచ్చి కూడా తన అభినందనలు అందుకుంది… దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది… దూరదర్శన్ , భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా గ్రేడెడ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా జాతీయ స్థాయి గుర్తింపు…
5. ఆమె గాయకురాలు… అమ్మ దగ్గరే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న తేజస్విని చక్కగా కీర్తనలు ఆలపిస్తుంది…
6. ఆమె అంతర్జాతీయ యోగా టీచర్… పోలీసులకి కూడా తను యోగా పాఠాలు నేర్పుతుంది…
7. ఆమె పర్యావరణ ప్రేమికురాలు… పచ్చదనం కోసం భూమిని రక్షించమంటూ ప్రచారం చేస్తూ ఎంతోమందిని ప్రభావితం చేస్తోంది…
8. ఆమె మనస్విని… సొసైటీ కన్సర్న్‌డ్, సామాజిక శ్రేయోభిలాషి… వీలు దొరికినప్పుడల్లా ప్రజలకి సేవ చేయడానికి ఊరూవాడా స్టెతస్కోప్ పట్టుకొని తిరిగేస్తుంది…
9. ఆమె షూటర్ కూడా…
10. ఆమె నటి… 2019 ఆంగ్ల చిత్రం గాడ్ ఆఫ్ గాడ్స్ తో అనుబంధం…
….
ఉస్మానియా మెడికల్ కాలేజి నుంచి వైద్య పట్టాను అందుకున్న ఈ తెలుగు తేజం ఎన్సీసీ అన్ని విభాగాల్లో పాల్గొని 2010లో ‘ఆల్ ఇండియా బెస్ట్ క్యాడెట్’గా నిలవడంతో పాటు శ్రీలంకలో నిర్వహించిన సార్క్ దేశాల యువ ప్రతినిధుల సదస్సులో మన దేశం నుంచి యూత్ అఛీవర్‌గా వెళ్లింది…
ఆ మధ్య జరిగిన యమహా ఫాసినో మిస్ దివా-2017 ఆడిషన్స్‌కు వెళ్లింది… అందులో విజేత… అలాగే మిస్ఎర్త్ 2019 గా విజయం సాధించింది… నేటివ్ మహబూబ్‌నగర్ పట్టణం… నాన్న బ్యాంకు ఉద్యోగి కాగా, తల్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి… పాఠశాల స్థాయిలోనే నాట్య ప్రదర్శనలు ఇచ్చేది… ఇప్పటి వరకు 2500 వరకూ ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చింది…
పదో తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో యోగాలో డిప్లొమా చేసింది… కొండాపూర్‌లోని 8వ పోలీస్ బెటాలియన్, యూసుఫ్‌గూడలోని మొదటి పటాలంలో శిక్షణ పొందే పోలీసు సిబ్బందికి ఈ ఏడాది యోగాలో శిక్షణ ఇచ్చింది… చెప్పనే లేదు కదూ… సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుందట… తల్లీ నీకు ఓ వందనం… మనస్పూర్తిగా..!! ప్రస్తుతం ఆమె వయస్సు జస్ట్, 31 ఏళ్లు…
పెళ్లయింది, భర్త డాక్టర్ పవన్ దత్తా ఐఏఎస్… (2022 యూపీఎస్సీ 22వ ర్యాంకర్, తెలుగువాడే… తను కూడా బేసిక్‌గా డాక్టర్… కర్నాటక కేడర్..)
Share this Article