Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…

June 6, 2025 by M S R

.

ట్రంప్, ఎలన్ మస్క్… ఇద్దరూ బిలియనీర్లు, స్వతహాగా వ్యాపారులు… మస్క్ సాహసి, ప్రయోగశీలి… ట్రంప్ మీద ఎన్నెన్నో ఆరోపణలు ప్లస్ నోటిదూల… కానీ ఇద్దరూ స్నేహితులు… ట్రంపు గెలుపు కోసం కోట్లను ఖర్చుపెట్టాడు మస్క్…

అఫ్‌కోర్స్, వ్యాపారి ఏ ప్రయోజనం లేనిదే పైసా ఖర్చు చేయడు కదా… ట్రంపు అధికారంలో దాదాపు భాగస్వామి అయ్యాడు… కానీ ట్రంపు ట్రంపే కదా… బేమాన్… ఏదో బిల్లు తెచ్చాడు, అది మస్క్ టెస్లా కార్లకు విఘాతం… అసలే చైనా ఈవీ బీవైడీ కార్ల నుంచి గట్టి పోటీ… ఈ స్థితిలో ట్రంపు బిల్లు మస్క్‌కు మస్తు షాక్…

Ads

శృతి తప్పింది… స్నేహం చెడింది… ట్రంపు ఇచ్చిన అదేదో పోస్టుకు దండం పెట్టి బయటికి వచ్చేశాడు మస్క్… అన్ని ప్రభుత్వ కంట్రాక్టులకు గుడ్ బై చెప్పాడు… స్పేస్ ఎక్స్ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది… టెస్లా షేర్ ఏకంగా 18 శాతం పడిపోయింది…

సో, మస్క్ ఆగలేదు… ట్రంపు మీద కడుపులో రగిలిపోతోంది… తాజాగా ఓ బాంబ్ వేశాడు… అదేమిటంటే … ‘‘ట్రంపు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాడు, అందుకే ఆ రిపోర్టు బయటికి రావడం లేదు, సో, తనను అభిశంసించాలి, దించాలి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిని చేయాలి’’ అంటున్నాడు…

ఈ ఇద్దరి నడుమ చేదుగా మారిన పరిణామాలు ఇప్పుడు అమెరికాలో బాగా చర్చనీయాంశాలు… రాసిపెట్టుకొండి, భవిష్యత్తులో ఇదే నిజం బయటికి రానుంది’’ అనీ ముక్తాయించాడు మస్క్…

ఇలా వాళ్లిద్దరి గత 9 నెలల జాన్‌జిగ్రీ దోస్తీ కాస్తా ఇప్పుడు ఎక్స్‌ప్లోజివ్ వైరంగా మారిపోయింది… టైమ్.,. ఆ టెస్లా వ్యతిరేక బిల్లు తరువాత ఏం జరుగుతుందో ట్రంపుకి తెలుసు… ఐనా వెనక్కి తగ్గలేదు, సరికదా ఏదో మీడియా బ్రీఫింగులో ‘‘ఇప్పటివరకు మస్క్ నన్ను వ్యక్తిగతంగా ఏమీ నిందించలేదు, కానీ తను ఊరుకోడు, తప్పదు’’ అన్నాడు…

‘‘నేను లేకపోతే ట్రంపుకి గెలుపే రాకపోయేది… కృతఘ్నుడు’’ అంటున్నాడు మస్క్… ఇవన్నీ వోకే, కానీ ట్రంపు పేరుంది కాబట్టే ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బయటికి రానివ్వడం లేదంటున్నాడు కదా… అదేమిటి..? అంత ఎక్స్‌ప్లోజివ్ రిపోర్టా..? అసలు ఏమిటి ఈ ఫైల్స్..? ఇదీ ఆసక్తికరం…


జెఫ్రీ ఎప్‌స్టీన్, ఒక బాలల లైంగిక నేరస్తుడు, ట్రాఫికర్.., అనేక మంది యువతులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు… అతను అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల లైంగిక సంతృప్తి కోసం మైనర్లను ట్రాఫిక్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి… అంతేకాకుండా, ఎప్‌స్టీన్ తన ప్రైవేట్ కరీబియన్ ద్వీపంలోనూ న్యూయార్క్, ఫ్లోరిడా, న్యూ మెక్సికోలోని ఇళ్లలో తనకు, తన అతిథులకు లైంగిక సేవలు అందించమని బలవంతం చేశాడని డజన్ల కొద్దీ మహిళలు ఆరోపించారు…

న్యూయార్క్ నగరంలో పుట్టి పెరిగిన ఎప్‌స్టీన్, డాల్టన్ స్కూల్‌లో టీచర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. 1976లో ఆ స్కూల్ నుండి తొలగించబడిన తర్వాత, అతను బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోకి ప్రవేశించాడు, అక్కడ అనేక పదవులు నిర్వహించిన తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

ఎప్‌స్టీన్ వేగంగా ఎదిగాడు, ఒక ఉన్నత సామాజిక వర్గాన్ని సృష్టించుకున్నాడు, అనేక మంది యువతులను,  పిల్లలను సమీకరించాడు, వీరిని అతను, అతని సహచరులు లైంగికంగా వేధించారు.

2005లో, ఎప్‌స్టీన్ తన 14 ఏళ్ల కుమార్తెను లైంగికంగా వేధించాడని ఒకమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఫ్లోరిడా పోలీసులు అతనిపై విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ఎప్‌స్టీన్ 36 మంది బాలికలను, అదీ 14 ఏళ్ల వయస్సులోపు ఉన్నవారిని లైంగికంగా వేధించినట్లు తేలింది. అతను రెండు ఆరోపణలపై ఒప్పుకొని 2008లో దోషిగా నిర్ధారించబడ్డాడు.

వలం రెండు నేరాలపై మాత్రమే విచారణలు జరిగి, అతను కేవలం 13 నెలల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు… సంవత్సరాల తర్వాత, జూలై 2019లో, అతను న్యూయార్క్ , ఫ్లోరిడాలో మైనర్ల  ట్రాఫికింగ్ ఆరోపణలపై మళ్లీ అరెస్టు చేయబడ్డాడు…

విచారణ సమయంలోనే, ఈ సీరియల్, సీరియస్ నేరగాడు ఆగస్టులో యుఎస్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు, అతని చీకటి రహస్యాలు విచారణలో బయటపడిన కొద్ది సమయంలోనే… దీంతో అతనిపై,  అతనితో సంబంధం ఉన్నవారిపై అన్ని చట్టపరమైన కార్యకలాపాలను ఆపివేసింది…

ఎప్‌స్టీన్ ఫైల్స్

జెఫ్రీ ఎప్‌స్టీన్ విచారణలో కనుగొనబడిన పత్రాలు, కాంటాక్ట్ లిస్ట్‌లు, కాల్ రికార్డులు, చాట్‌లు, వీడియోలు, అతని సహచరులు, క్లయింట్ల పేర్లు, ఇతర విచారణ డేటాతో సహా ఎప్‌స్టీన్ ఫైల్స్‌గా పిలువబడతాయి. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం ఎప్‌స్టీన్ విచారణను, ఎప్‌స్టీన్ సంబంధిత పత్రాల ఆంతరంగిక సమీక్షలను గుర్తించింది. అయితే, ఇప్పటివరకు కొన్ని రికార్డులు మాత్రమే విడుదల చేయబడ్డాయి…

ఫిబ్రవరి 2025లో, యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు సంబంధించిన ఒక పత్రం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్, నటుడు అలెక్ బాల్డ్‌విన్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ హార్వే వైన్‌స్టీన్‌లు ఎప్‌స్టీన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అసంఖ్యాక సెలబ్రిటీలలో ఉన్నారని వెల్లడించింది… కానీ ఈ వ్యక్తుల ప్రమేయం గురించి విచారణ ఏమి వెల్లడించిందనేది మాత్రం ఇంకా ప్రజలకు తెలియదు…

జస్టిస్ డిపార్ట్‌మెంట్ పత్రంలో మాజీ న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రోలింగ్ స్టోన్స్ ఫ్రంట్‌మ్యాన్ మిక్ జాగర్, మ్యూజిషియన్ కోర్ట్నీ లవ్ వంటి ఇతర అగ్రశ్రేణి పేర్లు కూడా ఉన్నాయి…

ఇతరులలో సూపర్ మోడల్ నవోమి కాంప్‌బెల్, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ తల్లి ఎథెల్ కెన్నెడీ, మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, దివంగత సెనేటర్ టెడ్ కెన్నెడీ, లాయర్ అలన్ డెర్షోవిట్జ్, నటులు డస్టిన్ హాఫ్‌మన్ మరియు రాల్ఫ్ ఫియన్స్ ఉన్నారు.

ఈ జాబితాలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క మాజీ భార్య ఇవానా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్ పేర్లు కూడా ఉన్నాయి.

తాజా పత్రాల ప్రకారం.., ఎప్‌స్టీన్ ఫ్లైట్ లాగ్‌లలో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, కెవిన్ స్పేసీ, నవోమి కాంప్‌బెల్, ప్రిన్స్ ఆండ్రూ, టామీ క్విన్, డిడియర్, మార్క్ మిడిల్టన్, షారన్ రేనాల్డ్స్, ఆండీ స్టీవర్ట్, మరియా శ్రీవర్, మాట్ గ్రోప్, బాబ్ వెండీ, ఎమ్మీ టేలర్, జీన్ లూక్ బ్రూనెల్, లారీ సమ్మర్స్, గ్లెన్ డుబిన్, అలన్ డెర్షోవిట్జ్, అలన్ గ్రీన్‌బర్గ్, సోఫీ బిడిల్, ఇరా జుకర్‌మన్, ఘిస్లైన్ మాక్స్‌వెల్, ఎవా ఆండర్సన్, జోన్ అలెస్సీ పేర్లు ఉన్నాయి.

అయితే, కాంటాక్ట్ లిస్ట్ తప్ప, విచారణకు సంబంధించి ఇంకా ఎక్కువ సమాచారం ప్రజలకు వెల్లడి కాలేదు. ఎలాన్ మస్క్ చెబుతున్న ప్రకారం.., దీనికి “అసలు కారణం” ఏమిటంటే, ప్రస్తుత యుఎస్ ప్రెసిడెంట్ పేరు ఈ ఫైండింగ్స్‌లో ఉండటమే… మస్క్ తన వాదనకు ఎటువంటి ఆధారాలు అందించనప్పటికీ, “సత్యం చివరకు బయటకు వస్తుంది” అని రాశాడు తన ట్వీట్‌లో…. వామ్మో, అమెరికా పెద్ద తలకాయల్లో ఎవరూ శుద్ధపూసలు లేనట్టుంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ కరువు… కానీ గీతదాటితే మెలోడ్రామాతో సినిమా మటాషే…
  • విద్వేష ప్రసంగాలపై ఉక్కుపాదం… సిద్ధరామయ్య బాటలో రేవంత్ రెడ్డి…
  • హైదరాబాదులో మెరిసిన మోనాలిసా..! అంతా విధి మాయ… ఇంట్రస్టింగ్ ఏమిటంటే..?!
  • రేవంత్ రెడ్డి బాణాలు గట్టిగానే తగిలాయి… కారులో ముసలం మొదలైంది…
  • త్రోబ్యాక్… అప్పట్లోనే సెన్సేషన్… బికినీ షూట్ వెనుక రాధ “స్ట్రగుల్”!
  • అదరహో ‘దహిబరా ఆలూదమ్’… కటక్ స్ట్రీట్ ఫుడ్‌కు టేస్టీ అవార్డు…
  • రఘుపతి రాఘవ రాజారాం… గాంధీమార్గం స్పూర్తితో ఓ నవభారతం…
  • ఛావా, పుష్ప2 బలాదూర్… ‘ధురంధర్’ అన్ని రికార్డులూ పగలగొడుతున్నాడు…
  • Bhavana… ఈ కుళ్లు వ్యవస్థతో పోరాడుతున్నఓ రియల్ స్టార్…
  • మాయాబజార్… మరికొన్ని చెప్పుకునే సంగతులిలా మిగిలిపోయాయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions