‘‘తక్షణం ఆ కన్నన్ అనబడే విచారణ ఖైదీని ఉత్తరప్రదేశ్ నుంచి తరలించండి, ఢిల్లీలో ఎయిమ్స్ లేదా మరే ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ చేర్చండి… ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి మధుర జైలుకు పంపిద్దాం గానీ…’’ ఇదీ సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశం… సంకెళ్లతో మంచానికి పశువులా తన భర్తను కట్టేశారనీ, తిండీతిప్పలు సరిగ్గా లేవనీ, కరోనా సోకినా పట్టించుకునే దిక్కు లేదని కప్పన్ అనే కేరళ జర్నలిస్టు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలుసు కదా… ఎడిటర్స్ గిల్డ్, యూడీఎఫ్ ఎంపీలు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేరళ జర్నలిస్ట్ యూనియన్ ఈ కప్పన్ అక్రమ, అమానవీయ నిర్బంధం మీద కొట్లాడుతున్న సంగతి తెలుసు కదా… ఈరోజు విచారణలో సుప్రీం జారీ చేసిన ఆదేశాలు ఇవే…. ఈ కేసు పూర్వాపరాలు కావాలంటే కింద లింక్ చదవండి….
చీఫ్ జస్టిస్ రమణ ఏం చెప్పబోతున్నట్టు..? ఆ జర్నలిస్టు కేసుపై అందరి దృష్టి…!!
Ads
సుప్రీంకోర్టు బేషరతుగా ముందుగా ఆ జర్నలిస్టును ఢిల్లీ హాస్పిటల్‌కు తరలించాలని చెప్పింది… ప్రస్తుతం తను మధుర మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఉన్నాడు… సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఢిల్లీలో బెడ్ దొరకడం కష్టం’ అని చెప్పినా కోర్టు వినిపించుకోలేదు… కరోనా నెగెటివ్ వచ్చిన ఎవరైనా రోగి ఖాళీ చేస్తే, ఆ బెడ్ కప్పన్‌ను సమకూర్చండి అని సూచించింది… ‘ఆయన డయాబెటిక్, పైగా కరోనా, ఆరోగ్యం ఒకసారి మెరుగుపడ్డాక మళ్లీ మధుర జైలుకు పంపించవచ్చు..’ అని చెప్పింది… యూపీ బయట చికిత్సపై యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేయడానికి ప్రయత్నించినా కోర్టు తోసిపుచ్చింది…
Share this Article