Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…

June 30, 2025 by M S R

.

తెలంగాణ ఉద్యమ సాధన దిశలో సమైక్యవాదం ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఏ వేషాలు వేసినా సరే… కేసీయార్ ఏ ఒక్క క్షణమూ అదుపు తప్పలేదు, ఉద్యమాన్ని అదుపు తప్పనివ్వలేదు… ఒక్క ఆంధ్రుడి మీద గానీ, వ్యాపార సంస్థల మీద గానీ, మీడియా ఆఫీసులపై గానీ ఒక్క రాయీ పడలేదు…

వాళ్లే భయంతో ఇళ్లకు, ఆఫీసులకు పెద్ద పెద్ద నెట్లు పెట్టించుకున్నారు రాళ్ల దెబ్బల్ని కాచుకోవడానికి… ఒక్క ఉద్యమకారుడూ ఒక్క రాయీ విసరలేదు… అది కేసీయార్ ఉద్యమాన్ని నడిపించిన దశలో, దిశలో కనబర్చిన పరిణతి, విజ్ఞత… అందుకే వందల మంది ఆత్మార్పణ చేసుకున్నారే తప్ప, హింసకు తావు లేదప్పుడు… ఒక్క రక్తపు చుక్కా చిందలేదు…

Ads

రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అనివార్యం చేయడం… ఉద్యమలక్ష్యం… రాష్ట్రం వచ్చింది, పార్టీ ఏదని వదిలేస్తే, పాలిస్తున్నది స్వజనమే… కానీ ఇప్పుడెందుకు ఈ మాటలు..? ఈ దాడులు..? ఈ ప్రశ్నలే మళ్లీ చర్చనీయాంశం అవుతున్నాయి… ఉద్యమకాలంలో జాగో బాగో నినాదాలు ఇచ్చినా సరే, రాష్ట్రం సిద్దించాక ఏ ఆంధ్రాతనం మీదా దాడి లేదు, కోపం లేదు… కలుపుకుని వెళ్లే ప్రయత్నాలే తప్ప..!

ఎస్, మహాన్యూస్ కనబర్చింది డర్టీ జర్నలిజమే.,. ఇప్పుడు ఇరుక్కుంటాననే భయంతో కేటీయార్ మీద పెట్టిన తిక్క థంబ్ నెయిళ్లన్నీ యూట్యూబ్ నుంచి తొలగించేశాడు తనే… ఈ సోయి ముందు నుంచే ఉండాలి కదా… లేదు, ఉండదు… ఐతే దానికి మీడియా మీద ప్రత్యక్ష దాడే మార్గమా..? అందరినీ ఆ గాటన కట్టేయడం కరెక్టు కాదు కదా…

ఇది కేసీయార్ కాలం కాదు, కేటీయార్ కాలం… నిజమే… కానీ కోపం, ఆవేశం, దాడులు పరిష్కారాలు కావు, ‘జవాబులు’ చెప్పే మెథడ్స్ ఉంటాయి… కీలెరిగి వాతలు పెట్టే నేర్పు కేసీయార్‌కు తెలుసు… కానీ మాజీ మంత్రులు కూడా నేరుగానే బెదిరిస్తున్నారు…

మరో 2, 3 మీడియాలకూ తప్పదు శాస్తి… మహాన్యూస్‌పై జరిగింది దాడి కాదు, మా నిరసన మాత్రమే… కేటీయార్ జోలికి ఎవరొచ్చినా ఇదే గతి అనే హెచ్చరికలు బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచే వినిపిస్తున్నాయి… మహాన్యూస్ ఆఫీసుపై దాడి బరాబర్ సమర్థనీయమే అనేట్టుగా…

ఫోన్ ట్యాపింగునూ సమర్థిస్తున్నారు… ప్రవీణ్ కుమార్ అయితే ప్రభాకరరావు సచ్చీలుడు, మస్తు అవార్డులు తీసుకున్నాడు గతంలో, పాపం కేన్సర్ పేషెంటును సతాయిస్తున్నారు… ఐపీఎస్ అధికారులూ తిరగబడాలి అంటున్నాడు…

మరో రెండుమూడు సంస్థలకూ తప్పదు ఈ శాస్తి అంటున్నారు కదా… ఉన్న పత్రికల్లో ఈనాడు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వెళ్లదు, రేవంత్ రెడ్డి పట్ల కాస్త సానుకూలత ఉన్నా సరే… నమస్తే కేసీయార్ సొంతం… సాక్షి బీఆర్ఎస్‌కు అనుకూలమే… అంటే కాస్త తెలుగుదేశం వాసనలు అధికంగా ఉన్న టీవీ5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మాత్రమేనా..?

అవి మరీ మహాన్యూస్ బాపతు అత్యంత నాసిరకం, డర్టీ బాపతు కావు… కేటీయార్ మీదో, ఆ కుటుంబం మీదో పిచ్చి కూతలు, చెత్తా రాతలు ఏమీ కనిపించలేదు… పిచ్చి వాగుళ్లు వినిపించే టీవీ5 కూడా పెద్దగా కేసీయార్ మీదకు వెళ్లలేదు… దాని టార్గెట్ ఓన్లీ జగన్…

సరే, ఈ చర్చ ఎలా ఉన్నా… రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం, ముఖ్యమంత్రి పదవి దిశలో కేటీయార్ తన పట్ల యాక్సెప్టన్సీ పెంచుకునే మార్గంలో ఈ అగ్రెషన్ అడ్డంకే తప్ప అనుకూలం కాదు… ఇలాంటి స్థితుల్లో కేసీయార్ కనబరిచే సంయమనం, స్ట్రాటజీ, చతురతే కేటీయార్‌కు కూడా అనుసరణీయం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…
  • కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…
  • కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…
  • కోమటిరెడ్డి అదే చేయగలిగితే… మోడీ, కేసీయార్‌‌లకన్నా తోపు తురుం..!!
  • మొత్తం 5 జంటలు… మరి ఈ ‘ముచ్చటగా ముగ్గురు’ టైటిల్ ఏమిటో…
  • AI ప్లాట్‌ఫామ్స్ … అతివాడకంతో మన బుర్రలు మొద్దుబారుతున్నయ్…
  • గుల్ఫాం ఉప-ద్రవం… తాగినా చస్తారు, తాగకపోయినా చస్తారు…
  • మీ కడుపులు చల్లంగుండ… సన్నబియ్యంతో పాశం చేసుకున్నం సారూ…
  • ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మంచు కన్నప్ప నేర్పిన పాఠం ఏమిటి..?
  • సంగమానంతరం శ్రీవారి నవ్వులు ఆమె తలపై చల్లిన అక్షతలయ్యాయట..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions