.
Pardha Saradhi Potluri ………. చైనా అధ్యక్షుడు జీ జిన్జ్పింగ్ కనపడటం లేదు! చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నాడా అన్నది తెలియరాలేదు!
May 21 నుండి జూన్ 5 వరకూ జీ జింగ్ పింగ్ కనపడలేదు. అధికార కార్యక్రమాలకి హాజరవ్వలేదు! అయితే అనారోగ్యంతో ఉండడం వలన రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఉండవచ్చు అని అనుకున్నారు.
Ads
అయితే ఈ నెల 6, 7 వ తేదీలలో బ్రెజిల్ లో జరగనున్న BRICS సమావేశానికి జీ జింగ్ పింగ్ హాజరు కాబోరని నిర్వాహకులకి తెలపడంతో అనేక ప్రశ్నలు తలెత్తు తున్నాయి!
జీ జింగ్ పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి బ్రిక్స్ సమావేశానికి హాజరువుతూ వస్తున్నాడు కానీ మొదటిసారి బ్రిక్స్ సమావేశానికి గైర్ హాజరువుతున్నాడు!
జీ జింగ్ పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) కి జెనరల్ సెక్రటరీ మరియు సెంట్రల్ మిలిటరీ కమిషన్ ( Central Military Commission-CMC) కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.
చైనాలో అధికార మార్పిడి జరగబోతున్నదా? లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా?
ప్రస్తుతం చైనాలో జెనరల్ ఝాంగ్ యుజియా ( General Zhang Youxia ) నే అధికారం చెలయిస్తున్నాడని తెలుస్తున్నది!
జెనరల్ ఝాంగ్ యుజియా సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి వైస్ చైర్మన్ గా ఉన్నాడు.
జెనరల్ ఝాంగ్ యుజియా 24 మంది సభ్యులు కలిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) మరియు పొలిట్ బ్యూరో సభ్యుడు మరియు సెంట్రల్ కమిటీ లో సీనియర్ మెంబర్స్ మద్దతు జెనరల్ ఝాంగ్ యుజీయకి ఉంది. సెంట్రల్ కమిటీలో సీనియర్ సభ్యులలో చాలా వరకూ మాజీ అధ్యక్షుడు హు జింటావో (HU JINTAO) కి అనుయాయిలు.
సెంట్రల్ కమిటీలో మెజారిటీ సభ్యుల మద్దతు ఝాంగ్ యుజియాకి ఉంది కాబట్టి అధికార మార్పిడి జరిగి ఉండవచ్చనే అనుమానాలకి బలం చేకూరుతున్నది!
సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యులు మాజీ అధ్యక్షుడు అయిన హు జింటావో మద్దతుదారులు అయినందువల్ల జీ జింగ్ పింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు అని వార్తలు వస్తున్నా అసలు కారణం వేరే ఉంది.
చైనాలోని పాఠశాల విద్యార్థులకి జింగ్ పింగ్ పాఠాలు!
చైనాలోని పాఠశాల పుస్తకాలలలో జీ జింగ్ పింగ్ ఆలోచనలు ( Thoughts of Xi Jinping) అనే పేరుతో విద్యార్థులకి పాఠాలు నేర్పుతున్నారు. ఇదే సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యులకి నచ్చలేదు. ఇప్పటికే మావో ఆలోచనలు పేరుతో పాఠాలు నేర్పుతుండగా కొత్తగా జీ జింగ్ పింగ్ ఆలోచనల పేరుతో విద్యార్థులకి పాఠాలు నేర్పడం అనేది సెంట్రల్ కమిటీలోని సీనియర్ సభ్యుల ఆగ్రహానికి కారణం అయ్యింది!
అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుండి జీ జిన్జ్పింగ్ అటు మిలిటరీలో, ఇటు ఆర్ధిక విధానాలకి సంబంధించి తన అనుచరులకే పెద్ద పీట వేస్తూ వచ్చాడు! నిజానికి జింగ్ పింగ్ అనుచరుల కంటే అనుభవము, నాలెడ్జ్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నా వాళ్ళని కాదని కేవలం తన అనుచరులకి కీలక బాధ్యతలు అప్పచెప్పడం సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుల ఆగ్రహానికి మరో కారణమ్!
ప్రస్తుత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని తదుపరి చైనా అధ్యక్షుడిగా జీ జింగ్ పింగ్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాడు గత కొంత కాలంగా! ఇది కూడా సెంట్రల్ కమిటీ సభ్యులకి నచ్చలేదు! వాంగ్ యాంగ్ అంత సమర్థుడైన విదేశాంగ మంత్రి కాదు!
వాంగ్ యాంగ్ వైఫల్యం!
150 km ట్రాఫిక్ బంద్!
నెల రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాని బెదిరిస్తూ 200% టారిఫ్ విధిస్తానని అనడం మీద వాంగ్ యాంగ్ చాలా తేలికగా తీసుకోవడమే కాదు అప్పటికే చైనా పౌర విమానయాన సంస్థలు బోయింగ్ సంస్థకి ఆర్డర్ చేసిన విమానాలు చైనాకి చేరుకుంటే వాటి డెలివరీ తీసుకోకుండా తిరిగి అమెరికాకి పంపించేసాడు వాంగ్ యాంగ్!
మరో వైపు చైనా నుండి దిగుమతి చేసుకుంటే 200% టారిఫ్ కట్టాల్సివస్తుందని అమెరికన్ సంస్థలు అప్పటికే తాము ఇచ్చిన ఆర్డర్స్ ని రద్దు చేసాయి! దాంతో షాన్ఘయ్ పోర్టులో అప్పటికే అమెరికాకి వెళ్ళాల్సిన కార్గో షిప్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి!
మరోవైపు చైనా ఫాక్టరీల నుండి సరుకులు లోడ్ తో వచ్చిన ట్రక్కులు పోర్టులో ఖాళీ లేనందువలన అన్లోడింగ్ చేయడానికి వీలులేక పోర్టు బయట నిలిచిపోయాయి. మూడో రోజుకి పోర్టు నుండి 150 km వరకూ ట్రక్కులు నిలిచిపోయాయి!
ఎవరికీ సమాచారం లేదు షాన్ఘయ్ పోర్టులో సరుకులు ఎందుకు అన్ లోడ్ అవ్వడం లేదో! కనీసం ఎగుమతి కోసం నిర్దేశించిన ఫాక్టరీలకి సమాచారం లేకపోవడంతో వాళ్లు ట్రక్కులమీద లోడింగ్ చేయడం ఆపలేదు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది నేషనల్ హై వే మీద!
ఇక్కడ అమెరికా ఒక గేమ్ ప్లే చేసింది… మూడు రోజులు ఎగుమతులు ఆపితే చైనాలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలన్నదే ఆ గేమ్ ప్లాన్! ఒక రోజు ఎగుమతులు ఆపితే 150 km ట్రాఫిక్ జామ్ ఏర్పడితే అదే నెల రోజులు అమెరికా తన దిగుమతులు ఆపితే?
ఎగుమతుల మీద విపరీతంగా ఆధారపడ్డ చైనా నెల రోజులు ఉత్పత్తి ఆగిపోతే తట్టుకోలేదు! కానీ మూడురోజులకే ఫాక్టరీలలో ఉత్పత్తి ఆగిపోయింది!
So! ఈ పరిస్థితి రాకుండా ఆపవచ్చు కానీ వాంగ్ యాంగ్ నిర్వాకం వల్ల చైనాలోని లూప్ హో ల్స్ బయటపడ్డాయి!
ఒకేసారి చైనా, భారత్ లకి టారిఫ్ విషయంలో ట్రంప్ హెచ్చరికలు చేసినా మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చేసిన వ్యాఖ్య ఇక్కడ ప్రస్థావనార్హం.
జై శంకర్ గారు అన్నది: అన్ని దేశాలు అమెరికాకి భయపడతాయి కానీ భారతదేశం భయపడదు!
కానీ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ మాత్రం అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్ విమానాలని వెనక్కి తిప్పి పంపాడు! ఇది షాన్ఘయ్ పోర్టులో ఏర్పడిన ప్రతిష్టంభనకి ప్రతీకారంగా తీసుకున్న చర్య!
మన విదేశాంగ మంత్రి జై శంకర్ ఒక డిప్లొమాట్ నుండి విదేశాంగ శాఖ మంత్రిగా ఎదిగారు!
వాంగ్ యాంగ్ ఒక టెక్నోక్రాట్! అతనికి డిప్లొమసి అంటే ఏమిటో తెలియదు కాబట్టి అనుభవం లేదు!
జీ జింగ్ పింగ్ కీలక స్థానాలలో నియమించిన వారు అందరూ టెక్నాక్రాట్ లే! ఎందుకంటే వాళ్లు అందరూ జింగ్ పింగ్ కి అనుచరులు, విశ్వాసపాత్రులు కనుక. చైనా సెంట్రల్ కమిటీ సభ్యులు విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ ని ఇష్టపడడం లేదు, ఎందుకంటే అతను కేవలం టెక్నోక్రాట్ మాత్రమే!
So! తన తరువాత వాంగ్ యాంగ్ ని అధ్యక్ష పదవిలో కూర్చోపెట్టాలానే ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టిన సెంట్రల్ కమిటీ సభ్యులు జీ జింగ్ పింగ్ కి ఉద్వాసన పలికి ఉండవచ్చు. ఎందుకంటే చైనాలో అధ్యక్షుడికంటే సెంట్రల్ కమిటీ అత్యంత శక్తివoతమైనది.
జీ జింగ్ పింగ్ రెండు వారాలపాటు కనపడక పోయినా చైనా మీడియా ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్ ఎలాంటి వార్తని ప్రచురించలేదు అంటే సెంట్రల్ కమిటీ ఆదేశాలు ఉండి ఉంటాయి!
జీ జింగ్ పింగ్ కి సన్నిహితులు అయిన సైనిక జనరేల్స్ ని ఒక్కొక్కరిని పక్కకి తప్పిస్తూ వాళ్ళ స్థానంలో జీ జిన్జ్పింగ్ కి అనుకూలంగా ఉండకుండా తటస్థంగా ఉండేవారిని నియమిస్తున్నది సెంట్రల్ కమిటీ. ఇప్పటికే జీ జింగ్ పింగ్ నియమించిన సైనిక జనరల్స్ లో చాలామందిని తప్పించగా కొద్ది మంది అనుచరులు మాత్రమే తమ పదవులలో కొనసాగుతున్నారు.
మరోవైపు పాఠశాల పుస్తకాలలో జీ జింగ్ పింగ్ ఆలోచనలు, సిద్ధాంతాల అంశాలని తీసేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
అయితే ఈ పరిణామాలు జీ జింగ్ పింగ్ కి తెలియవు అని కాదు కానీ సెంట్రల్ కమిటీ నిర్ణయాలని ఏ అధ్యక్షుడు కూడా వ్యతిరేకంచలేడు చరిత్రలో.
ఈ నెల 6, 7 వ తేదీలలో బ్రెజిల్ లో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి జీ జింగ్ పింగ్ హాజరు కాబోడు అని ప్రకటించినా అది హడావిడిగా షెడ్యూల్ నిర్ణయించారని ఆరోపించింది చైనా.
భారత ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు కానీ బ్రిక్స్ సమావేశానికి హాజరవుతుండడంతో తడబడిన చైనా లీ కయాంగ్ ( Li Qiang) హాజరవుతారని ప్రకటించింది!
లీ కయంగ్ చైనా ప్రీమియర్ లీడర్ ( చైనా ప్రధాని)!
లీ కయాంగ్ ని మార్చి, 2023 లో జీ జింగ్ పింగ్ ప్రధానిగా నియమించాడు. అంటే 2023 లోనే జీ జింగ్ పింగ్ కి ఉద్వాసన పలకడానికి నిర్ణయం జరిగిపోయిందన్న మాట!
2023 లో భారత్ లో జరిగిన G20 సమావేశాలకి జింగ్ పింగ్ కి బదులుగా లీ కయాంగ్ హాజరయ్యాడు కానీ జిన్జ్పింగ్ కి మోడీ అధ్యక్షతన జరుగుతున్న G20 సదస్సుకి రావడం ఇష్టంలేక లీ కయాంగ్ ని పంపించాడని అనుకున్నారు కానీ అది వాస్తవం కాదని ఇప్పుడర్ధమవుతున్నది! బ్రెజిల్ లో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి కూడా జింగ్ పింగ్ హాజరవడం లేదు అంటే సెంట్రల్ కమిటీ జిన్జ్పింగ్ ని పక్కనపెట్టేసినట్లే!
*******************
KARMA RETURNS!
కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు!
జీ జింగ్ పింగ్ అధికారంలోకి రావడానికి ముందు చైనా అధ్యక్షుడిగా పని చేసిన హు జింటావో ( Hu Jintao ) ని ఘోరంగా అందరూ చూస్తుండగానే అవమానించాడు జిన్జ్పింగ్!
అది 2022, చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం జరుగుతున్న వేళ అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ పక్క సీటులో మాజీ అధ్యక్షుడు హు జింటావో కూర్చున్నాడు ప్రోటోకాల్ ప్రకారం! సమావేశంలో ఎవరికీ వారు బిజీగా ఉన్న సమయంలో మాజీ అధ్యక్షుడు హు జింటావో అస్వస్థతకి గురయ్యాడు. తన సీటులోంచి లేవడానికి ప్రయత్నించి లేవలేకపోతున్న సమయంలో పక్కనే ఉన్న జింగ్ పింగ్ సహాయం చేయకపోగా అసహనంగా ఉండిపోయాడు తప్పితే కనీసం గార్డులని పిలిచి హాస్పిటల్ కి తీసుకెళ్లమని కూడా చెప్పలేదు.
చివరికి ఒక సహాయకుడు వచ్చి హు జింటావో ని సీట్లోనుండి పైకి లేపి హాల్ నుండి బయటికి తీసుకెళ్లే క్రమంలో హు జింటావో జిన్జ్పింగ్ తో మాట్లాడాలని ప్రయత్నించగా జింగ్ పింగ్ ప్రతిస్పందించకుండా ఉండిపోయాడు! ఇది లైవ్ లో కెమెరాలలో రికార్డ్ అయింది, ప్రపంచం మొత్తం చూసింది! అయితే చైనాలో ఎక్కడా ఆ క్లిప్పింగ్స్ కనపడకుండా నిషేధం విధించాడు జిన్జ్పింగ్ కానీ చైనాలో తప్ప మిగతా దేశాలలో ఆ దృశ్యం అందుబాటులో ఉంది ఇప్పటికీ!
గత జూన్ నెల మొదటివారంలో బేలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషింకో చైనా పర్యటనకి వచ్చినపుడు రెడ్ కార్పేట్ స్వాగతాలు, పెద్ద హాల్ లో సెట్టింగ్ వేసి, అక్కడ సమావేశాలు లాంటి ఆర్భాటాలు ఏవి కనిపించలేదు! ఈ విషయాన్ని బేలారస్ దేశపు ప్రెస్ బయటపెట్టింది! అలాగే ఆ సమావేశంలో పాల్గొన్న జింగ్ పింగ్ అలిసిపోయినట్లుగా, అసహనంగా కనిపించాడు.
అంటే జింగ్ పింగ్ అధికారాల మీద సెంట్రల్ కమిటీ కోత పెట్టి చాలకాలం అయ్యిందన్నమాట!
సెంట్రల్ కమిటీలో ఉన్న సీనియర్ సభ్యులలో అధిక భాగం హు జింటావో కి విధేయులు కాబట్టి మాజీ అధ్యక్షుడికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారు ఇప్పుడు!
సెంట్రల్ కమిటీ ఎప్పుడూ అధ్యక్షుడిని రాజీనామా చేయమని అడగదు కానీ అధికారాల మీద కత్తెర వేస్తుంది చేసింది చాలు ఇక దిగిపొమ్మని!
*****************
మరో గల్వాన్ ఉదంతం జరుగుతుంది!
Yes! చైనాలో అంతర్గత రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా ప్రజలలో ఆర్ధిక పరమైన ఆశాంతి నెలకొన్నప్పుడు బయట దేశాలలో అలజడి సృష్టించి ప్రజల దృష్టిని మరల్చడం అలవాటు!
ఇప్పటికే ఆ పని మొదలుపెట్టారు!
చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్ కి సైనిక ఇంచార్జ్ ని మార్చేశారు. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ పరిధిలోనే లడాక్, అరుణాచల్ ప్రదేశ్ లు ఉన్నాయి.
ఈసారి అరుణాచల్ ప్రదేశ్ లో చొరబాటుకి ప్రయత్నించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి! బహుశా వచ్చే శీతాకాలంలోనే ఇది జరగవచ్చు లేదా లడాక్, అరుణాచల్ ప్రదేశ్ లలో ఏక కాలంలో చొరబాటుకి ప్రయత్నించవచ్చు!
కోవిడ్ సమయంలో గాల్వాన్ లోయలో చొరబాటుకి ప్రయత్నించి రెండేళ్ల పాటు ఉద్రిక్తతని కొనసాగించినట్లుగానే ఈ సారి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చేయవచ్చు కానీ నష్టం ఇరువైపులా భారీగా ఉండే అవకాశం ఉంది! ప్రస్తుత విదేశాంగ మంత్రి వాంగ్ యాంగ్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పవచ్చు సెంట్రల్ కమిటీ!
Share this Article