.
రామాయణం… అనేక భాషల్లో… అనేక దేశాల్లో… అనేక కళారూపాల్లో వేల సంవత్సరాలుగా జనానికి ఈ కథ నిత్యనూతనం… అనేక కోణాల్లో కూడా… అనేక బాష్యాలు కూడా…
దక్షిణాదికి, ప్రత్యేకించి తెలుగు వారికి పురాణాల్ని సినిమాలుగా చిత్రీకరించడంలో చాలా నైపుణ్యం ఉందని ప్రతీతి… నిజమే, ప్రతి పాత్రకూ ఓ ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాశస్త్యం ఇస్తాం మనం…
Ads
నిజమే… ఉత్తరాదికి పురాణ కథనాల్లో మెళకువలు తక్కువ అనుకుంటాం… హిందీలో రామాయణ్ పేరిట ఓ అత్యంత భారీ చిత్రాన్ని తీస్తున్నారనే వార్తలు వస్తున్నప్పుడు… కొన్ని విశేషాలనే హైలైట్ అనుకున్నాం… అంతేనా..? ఆది పురుష్ స్థాయిలో ఇంకో నాసిరకం సినిమా చుట్టేస్తారేమో అనే సందేహాలూ కలిగాయి… కానీ..?
మనకు బాగా తెలిసిన సాయి పల్లవి సీత పాత్ర చేస్తుండటం… కేజీఎఫ్‌తో దుమ్మురేపిన యశ్ రావణ పాత్ర పోషించడం ప్లస్ బాలీవుడ్ పాపులర్ స్టార్ రణధీర్ కపూర్ రాముడిగా నటిస్తుండటం… ఇవేనా బజ్ క్రియేటర్స్..? కాదు..!
హాన్స్ జిమ్మెర్ దీనికి సంగీత దర్శకుడు… హాలీవుడ్ ఫేమ్… గ్గాడియేటర్, ఇంటర్‌స్టెల్లార్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి హిట్ చిత్రాలకు తను స్వరప్రాణం పోశాడు… ప్రత్యేకించి బీజీఎం… తోడుగా మన ఏఆర్ రెహమాన్ సరేసరి…
దంగల్ సినిమాతో బాగా పాపులరైన నితిష్ తివారీ దర్శకత్వం… చిత్ర నిర్మాణంలో యశ్ సినిమా సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, నితిన్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ భాగస్వామ్యం… ఇప్పటికి జస్ట్, ఒక్కటే ఫోటో లీక్… అంతే, ఈరోజుకూ చిత్రానికి సంబంధించిన ఒక్క ఫోటో, ఒక్క వీడియో కూడా అదనంగా బయటికి రాలేదు…
షూటింగ్ పూర్తి చేసుకుందట… ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు… ఏ పాత్రలో ఎవరనేది లేదు.., జస్ట్, ఓ ఇంట్రో… అన్ని యుద్దాలకూ ముగింపు కలిపే యుద్ధం పేరిట… ఓ గ్రాఫిక్ ప్రజెంటేషన్ మాత్రమే… అదిరిపోయింది… రామాయణంపై జస్ట్ ఓ ఔట్ లుక్… గ్లింప్స్‌తోనే ఈ రేంజ్ ఆసక్తిని క్రియేట్ చేశారంటే ఇక ఫైనల్ ఔట్‌పుట్ ఇంకెంత బాగుంటుందో అనే ఇంట్రస్టును క్రియేట్ చేయడంలో మాత్రం గ్లింప్స్ సక్సెస్…
Share this Article