.
తీసేవాడికి చూసేవాడు లోకువ… ఎస్, సినిమాలకు సంబంధించిన నిత్య సత్యం అదే… తాజాగా ఏముందీ అంటారా..?
ప్రసిద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రెయిలర్ రిలీజ్ చేశారు కదా… అది చరిత్రా..? ఫిక్షనా..? తెలియదు… కానీ అప్పుడే మొదలయ్యాయ్…
Ads
‘‘హరిహర వీరమల్లు 1355 లో చనిపోయాడు… చార్మినార్ 1591లో కట్టారు… మరి హరిహర వీరమల్లు చనిపోయాక 200 ఏళ్లకు చార్మినార్ ఎదుట యుద్ధం ఎలా చేశారు..? ఈ సినిమాలో చార్మినార్ ఎందుకు ఉంది’’ అనడిగాడు ఓ నెటిజన్…
రీజనబుల్ క్వశ్చన్ కదా… దీనికి బుద్దా మురళి
పోస్టు ఏమిటంటే..?
‘‘1950 లో పుట్టిన బాబు ఐదువందల ఏళ్ళ క్రితం నాటి హైదరాబాద్ నేనే నిర్మించాను అని మీడియా సమావేశంలో చెబుతుంటే మురిసిపోయి వింటున్నప్పుడు --- 1355 నాటి వీరమల్లు 1591 నాటి చార్మినార్ ముందు ఉంటే అభిమానులు చూడలేరా ?’
రీజనబుల్ ప్రశ్న కదా… అసలే మనకు క్రియేటివ్ ఫ్రీడం ఎక్కువైపోయి చరిత్రను నానా వక్రమార్గాలు పట్టిస్తున్నాం కదా… ఎస్, ప్రభాకర్ జైనీ
అదే అంటున్నాడు…
‘‘అల్లూరి సీతారామరాజును, కొమురం భీమ్ ను జిగ్రీ దోస్తులుగా చూపిస్తే ఏం పీకాం మనం? ఇంకా జాతీయ అవార్డులు ఇప్పించాము, ఆస్కారును కూడా బురిడీ కొట్టించాము. ఇదో లెక్కా?’’
అన్నీ నిజాలే కదా… మనం ఏ చరిత్రను ఎలా వక్రమార్గం పట్టించినా సరే, ఓ సాకు ఉంది కదా… క్రియేటివ్ ఫ్రీడం అని… పేరొందిన చరిత్రాత్మక వ్యక్తుల జీవితాలను ఇష్టారీతిన చిత్రించి, అదే నిజమని జనం మెదళ్లలోకి ఎక్కించడం తప్పు కాదా..?
ఈ మాట అంటేనే మన సినిమా వాళ్లకు కోపం… మా ఇష్టం, ఎవరి చరిత్రనైనా ఏ రీతినైనా చిత్రిస్తాం, జనం మీదకు వదిలేస్తాం అంటారు…
ఆర్ఆర్ఆర్ తెగింపు అదే కదా… నిజమైన చరిత్ర తీయడం చేతకాదు… ఏవేవో పిచ్చి ఎలివేషన్లతో సగటు తెలుగు సినిమా మార్క్‌తో సోకాల్డ్ కమర్షియల్ వాల్యూస్‌తో చిత్రీకరణ… అదేమంటే ఫిక్షన్ అంటారు, మరలాంటప్పుడు చరిత్ర గొప్పవాళ్లుగా గుర్తించిన వాళ్ల జీవితాలపై మీ సొంత వక్ర ముద్రలు దేనికి..? ఈ ప్రశ్నకు జవాబు లేదు, మరీ ఎక్కువ మాట్లాడితే ఆస్కార్‌తో కొడతాం..!! అవునూ, డిప్యూటీ వీరమల్లూ… ఎనీ ఆన్సర్ ఫ్రమ్ యూ..!!
Share this Article