.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు..? ఈ చర్చ చాన్నాళ్లుగా ఉంది… కొన్నిసార్లు మన తెలుగువాళ్లే అభిమానంతో కిషన్ రెడ్డి పేరును కూడా ప్రచారంలోకి తెచ్చారు… మోడీ సమకాలీనుడు, కలిసి పనిచేసినవాళ్లు, సంఘ్ నేపథ్యం నుంచి ఎదిగాడు
కాబట్టి, పార్టీ అవసరాలు- దక్షిణాన వ్యాప్తి కోణంలో పరిశీలించదగిన పేరే… కానీ..?
హఠాత్తుగా మహిళా అధ్యక్షురాలు అనే ప్రచారం జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది… 2020 నుంచీ జేపీ నడ్డాయే చీఫ్… పేరుకు… నిజానికి అమిత్ షా, మోడీయే నడిపిస్తున్నారు… నడ్డా ప్లేసులో ఎవరనే చర్చను కొత్త మలుపు తిప్పింది మీడియా… లీకులిచ్చింది కూడా బీజేపీయే…
Ads
ప్రధానంగా మూడు పేర్లనే ప్రచారంలోకి తీసుకొచ్చారు… 1) ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2) ఎంపీ పురంధేశ్వరి 3) బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్… ఐతే వీరిలో ఎవరికి చాన్స్ అనే ఊహాగానాలతోపాటు ఎవరు బెటర్ అనే చర్చ కూడా నడుస్తోంది మీడియాలో…
నిర్మల సీతారామన్… చాన్నాళ్లుగా ఆర్థిక మంత్రి… ఉన్నత విద్యావంతురాలు, తమిళ బ్రాహ్మణ మూలాలు… తెలుగింటి కోడలు… ఐతే తను మంచి వక్త కాదు… ఇన్నాళ్ల అనుభవం కారణంగా ఆమెను ఆర్థిక మంత్రిగానే కొనసాగించడం మేలనేది ఒక అభిప్రాయం… ఆమెను పార్టీ అధ్యక్షురాలిని చేసి, ఆమె ప్లేసులో మరో ఆర్థిక మంత్రిని తీసుకుంటే రెండు పోస్టులకూ నష్టమే అనేది పార్టీ శ్రేణుల్లోనే ఓ భావన ఉంది… ఆమెకు సంఘ్ బాసటగా ఉండకపోవచ్చు… ఆమెకూ మంత్రిగా కొనసాగడంపైనే ఇష్టమట…
పురంధేశ్వరి బాగా మాట్లాడగలదు… రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించిన అనుభవం ఉంది… కానీ సంఘ్ నేపథ్యం లేదు… మొదట్లో టీడీపీ, తరువాత కాంగ్రెస్… ఆ తరువాతే బీజేపీలోకి… ఏపీలో మాధవ్, తెలంగాణలో రామచంద్రరావు ఎంపికలు జరిగిన తీరు పరిశీలిస్తే… ప్రధానంగా సంఘ్ నేపథ్యం నుంచి ఎమర్జయినవాళ్లకే బీజేపీ ప్రయారిటీ ఇస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది… సో, సంఘ్ పురంధేశ్వరి పేరు పట్ల పెద్ద సానుకూలత వ్యక్తం చేయకపోవచ్చుననే విశ్లేషణ వినిపిస్తోంది…
వనతి శ్రీనివాసన్… ఏపీలో బీజేపీ ఎంతో, తమిళనాడులో బీజేపీ కూడా అంతే… అంతంతమాత్రం ఉనికి, కానీ ఈమె లాయర్ (మాస్టర్స్ చేసింది, మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్), 55 ఏళ్లు… 1993 నుంచీ బీజేపీలోనే వర్క్ చేస్తోంది… మాట్లాడగలదు… ప్రస్తుతం జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు…
మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్‌ను అలవోకగా ఓడించింది గత ఎన్నికల్లో… సంఘ్‌కు ఇష్టురాలు… ప్రత్యేక కొంగునాడు రాష్ట్ర సాధనకు మద్దతుదారు… ముగ్గురూ దక్షిణ నేతలే… కానీ వనతికి సంఘ్ ఆశీస్సులు అనే విశ్లేషణ మీడియాలో వస్తోంది…
Share this Article