.
బరువు తగ్గాలి… బీపీ తగ్గాలి… సుగర్ లెవల్స్ తగ్గాలి… ఏం చేయాలి..? చాలామంది ఈమధ్య పాటిస్తున్న పద్ధతి ఐఎఫ్… అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్… Intermittent fasting (IF) … అంటే రోజుకు 16 గంటలపాటు లేదా 18 గంటలపాటు ఏమీ తీసుకోకుండా ఉండటం…
తినాలనుకున్నవి ఆ 8 లేదా 6 గంటల్లో తీసుకోవడం… చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది… రిజల్ట్స్ కూడా ఉంటున్నాయి ఓమేరకు… అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే… సెలబ్రిటీల బుర్రలు ఈ ఆరోగ్య విషయాల్లో కాస్త విజ్ఞతతో పనిచేయాలి అని చెప్పడానికి…
Ads
నర్గీస్ ఫక్రీ… ఈ బాలీవుడ్ తార పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లులో నటించింది… తను చెబుతోంది ఏదో ఇంటర్వ్యూలో…
- ‘‘ఏడాదికి రెండుసార్లు సుదీర్ఘ ఉపవాసం ఉంటాను… 9 రోజుల చొప్పున… నో ఫుడ్, కేవలం నీళ్లు మాత్రమే… దాంతో నా ముఖం వికృతంగా మారుతుంది… తరువాత ముఖంలో గ్లో వస్తుంది… హైప్రొటీన్ ఫుడ్ తీసుకుంటాను, నార్మల్ అయిపోతాను…’’
సమస్య ఏమిటంటే… ఈ సెలబ్రిటీలు ఏవో పిచ్చి కూతలు కూస్తారు… పిచ్చి అభిమానులు పాటిస్తారు… ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు… ‘‘మామూలుగానే నీ ముఖం వికృతంగా ఉంటుంది కదా, కొత్తగా మారేదేముంది’’ అని వ్యాఖ్యానించాడు ఓ నెటిజెన్…
నిజమా, సరే, అది వదిలేస్తే… ఐఎఫ్ వరకూ వోకే… రోజుకు 16 గంటలో, 18 గంటలో ఏమీ తీసుకోకుండా ఉండటం… కష్టపడితే ఆచరించవచ్చు… అదీ సుగర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవాళ్లకు ఇలా చేస్తే సుగర్ లెవల్స్ పడిపోయి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా…
వాళ్లు ఏదో కూస్తారు, పాటిస్తారో లేదో ప్రపంచంలో ఎవడికీ తెలియదు, పాటించినా సరే, ఆ పద్ధతులు అందరికీ పనిచేయాలని లేదు, లేదా కొందరికి ప్రాణాల మీదకు తెస్తాయి, ఆ మట్టి బుర్రలకు అది అర్థం కాదు… వాటిని పబ్లిష్ చేసే మీడియాకు అంతకన్నా అర్థం కాదు…
ఈమె వికృత సలహాలు పాటింనీయమేనా అనడిగితే… ఓ ఎఐ ప్లాట్‌ఫామ్ ఓ సుదీర్ఘ సమాధానం ఇచ్చింది… సంక్షిప్తంగా చెప్పాలంటే…
తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం అనేది సుదీర్ఘ ఉపవాసం… దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదాలు ఉన్నాయి… తక్కువ సమయం ఉపవాసం ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.., ఎక్కువ కాలం ఆహారం లేకుండా ఉండటం వల్ల కండరాలు క్షీణించడం, అవయవాలు దెబ్బతినడం, చివరికి మరణం కూడా సంభవించవచ్చు…
నిజమే... 9 రోజుల ఉపవాసం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు...:
కండరాల క్షీణత (Muscle Wasting), పోషకాహార లోపాలు (Nutrient Deficiencies), అవయవాలు దెబ్బతినడం (Organ Damage), రోగనిరోధక శక్తి బలహీనపడటం (Weakened Immune System), ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు (Electrolyte Imbalances), మానసిక ప్రభావాలు (Psychological Effects), రీ-ఫీడింగ్ సిండ్రోమ్ ప్రమాదం (Risk of Re-feeding Syndrome)….
ముగింపుగా.., తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నందున ఇది అస్సలు సిఫార్సు చేయబడదు… మరి ఆ పిచ్చిది ఎందుకు చెబుతున్నట్టు..? మీడియా ఎందుకు రాస్తున్నట్టు..? అసలు వీళ్లను కదా 9 రోజులపాటు ఎండబెట్టాల్సింది..!!చెప్పేవాడికి వినేవాడు, రాసేవాడికి చదివేవాడు లోకువ..!!
Share this Article