.వారం రోజులే గడువు… కేరళ నర్స్ నిమిషా ప్రియకు యెమెన్ దేశం మరణశిక్షను అమలు చేయనుంది… అసలు ఎవరామె..? ఏమిటీ కేసు..? అసలు మరణశిక్షను ఎలా అమలు చేస్తుంది ఆ దేశం..?కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం లక్షల మంది వెళ్తూనే ఉంటారు… వారిలో వందలాది మంది నర్సులు కూడా… పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా కూడా 2008లో యెమెన్ వెళ్లింది… 2011లో టామీ థామస్ ఓ భారతీయుడిని (ఎలక్ట్రిషియన్) పెళ్లి చేసుకుంది… కానీ ఏవో ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో భర్త, కుమార్తె ఇండియాకు తిరిగి వచ్చేశారు…ఆ దేశంలో అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభాల కారణంగా తిరిగి వాళ్లు యెమెన్ వెళ్లలేదు, ఆమె అక్కడ చిక్కుపడిపోయింది… ఈమె ఓ క్లినిక్ తెరిచింది… దానికి స్థానిక భాగస్వామి తప్పనిసరి కావడంతో మహది అనే స్థానికుడితో (టెక్స్ టైల్ వ్యాపారి) భాగస్వామ్యం కుదిరింది…మొదట్లో తను బాగానే ఉండేవాడు… నిమిష కూతురి బాప్టిజం కోసం తను కేరళకు కూడా వచ్చి వెళ్లాడు… తరువాత విభేదాలు నెలకొన్నాయి… స్థానిక బలం… శారీరిక, మానసిక వేధింపులు ఎక్కువ కావడంతో ఫిర్యాదు చేసింది 2016లో…అతను జైలు నుంచి వచ్చాక ఇంకా వేధింపులు పెరిగాయి, నిమిష పాస్‌పోర్టు కూడా అతని దగ్గరే ఉంది… మత్తుమందు ఇచ్చి ఆ పాస్‌పోర్టు తీసుకోవాలని అనుకుంది… ఒకరిద్దరు సహకరించారు ఆమెకు… కానీ డోస్ ఎక్కువై అతను మరణించాడు… 2017లో ఆమెను ‘సుప్రీం జుడిషియల్ కౌన్సిల్’ దోషిగా తేల్చింది… అధ్యక్షుడి ఆమోదం ఇప్పుడు పడింది కాబట్టి ఇక మరణశిక్షకు తేదీ ఖరారు చేశారు… ఇదీ కేసు…
మార్గాలు లేవా..?
ఉన్నాయి… బాధితుడి కుటుంబం గనుక పరిహారం తీసుకుని క్షమిస్తే మరణశిక్ష నుంచి తప్పించే మార్గం ఉంది… ‘బ్లడ్ మనీ’గా వ్యవహరించే ఆ డబ్బు కావాలి… వాళ్లు ఎంత అడుగుతారో తెలియదు… కొచ్చిలో పనిచేసే ఆమె తల్లి ప్రేమకుమారి (ఇళ్లల్లో పనిచేస్తుంది) కేరళ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తులు పెట్టుకుంది… జైలులో ఉన్న కూతురి వద్దకూ వెళ్లింది… ప్రవాస భారతీయులు కొంత సాయం చేస్తున్నారు…అధికారిక దౌత్యసంబంధాలు లేవు మనకు ఆ దేశంతో… అది హౌతీల పాలనలో ఉంది… ఐనా విదేశాంగ శాఖ స్థానిక భారతీయులతో కలిసి ప్రయత్నాలు చేస్తూనే ఉంది… ముందస్తు చర్చల కోసం అమీర్ అనే స్థానిక న్యాయవాదికి దాదాపు 19,871 డాలర్లను చెల్లించింది… అది మధ్యలోనే ఆగిపోయింది… చర్చలకు ముందే మొత్తం 40 వేల డాలర్లను చెల్లించాలని ఆయన పట్టుబడుతున్నాడు…సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్… క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బు సమీకరిస్తూనే ఉంది… ఈలోపు మరణశిక్ష తేదీ కూడా ఖరారైంది… ఇప్పుడు సమయం తక్కువగా ఉంది… ఇదీ సమస్య… అన్నీ అనుకూలించి, నిమిషా ప్రియ మరణశిక్ష నుంచి తప్పించుకుంటుందనే ఆశిద్దాం… ఆమె నిజానికి తనే బాధితురాలు కాబట్టి…మరణశిక్ష ఎలా..?
మరణశిక్షను రకరకాలుగా అమలు చేస్తారు కదా… ఇండియాలో ఉరి తీస్తారు… కొన్ని దేశాల్లో విషం ఇంజక్ట్ చేస్తారు… యెమెన్‌లో రాళ్లతో కొట్టడం, తల తీసేయడం వంటివీ అనుమతించబడిన శిక్షలే… కానీ ఇప్పుడు అమల్లో ఉన్న విధానం ప్రకారం… నేలపై లేదా బ్లాంకెట్‌పై బొక్కబోర్లా పడుకోబెడతారు… ఆటోమేటిక్ రైఫిల్‌తో గుండె ఉన్న ప్రాంతాల్లో కాలుస్తారు, కొన్ని షాట్లు… మే గాడ్ సేవ్ నిమిష ప్రియ..!!.ఎవరో సుప్రీమ్ కోర్టులో వేశారు పిటిషన్, కానీ ఇండియా సుప్రీమ్ ఏం చెప్పగలదు..? మహా ఐతే, భారత విదేశాంగ శాఖను ఇన్వాల్వ్ కావాలని చెప్పడం తప్ప..! ఆల్రెడీ అది ఆ పనిలోనే ఉంది… అసలు ఇన్నాళ్ళూ జరిగిన జాప్యమే ఆమెకు అసలు శిక్ష…!
Share this Article