Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యథేచ్ఛగా కాపీ కొడతాడు వాడు… జీఐ ట్యాగ్స్ కూడా ఉల్లంఘించి…

July 11, 2025 by M S R

.

Shankar G ….. Prada అనే ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్, 2025 జూన్‌లో Milan Fashion Week సందర్భంగా “Toe-ring leather sandals” పేరుతో ఒక కొత్త ఫుట్‌వేర్ డిజైన్‌ను విడుదల చేసింది.

toe-ring, చర్మంతో తయారీ, పాత శైలిలో ఫ్లాట్ సోల్స్ మొదలైన లక్షణాలతో వాటి డిజైన్ స్పష్టంగా కోల్హాపురి చెప్పులు (Kolhapuri chappals) అచ్చు గుద్దినట్టు ఉంది.

Ads

అయితే Prada వాటిని ఎక్కడా “Indian” అనీ, “Kolhapuri” అనీ, లేదా “Inspired by Indian artisans” అనీ పేర్కొనలేదు. ఇది పెద్ద విమర్శలకు దారి తీసింది.

సోషల్ మీడియా వేదికగా మన భారతీయులు, ముఖ్యంగా మహారాష్ట్రలోని కోల్హాపూర్ నగర వాసులు, శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, చేనేత కార్మిక సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

Kolhapuri Chappals కి 2019లో GI tag (Geographical Indication tag) లభించింది. ఇది ఒక రకమైన చట్టపరమైన గుర్తింపు, ప్రత్యేక ప్రాంతానికి చెందిన సంప్రదాయ ఉత్పత్తిగా. Prada దీనిని ఉల్లంఘించిందని MACCIA (Maharashtra Chamber of Commerce) మరియు మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి.

బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. అందులో Prada: అసలైన కళాకారులకు క్రెడిట్ ఇవ్వాలని, అధికారిక క్షమాపణ చెప్పాలని, GI చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Prada మొదట స్పందించలేదు కానీ తీవ్ర విమర్శల నేపథ్యంలో వారు “ఈ డిజైన్ traditional Indian handcrafted footwear నుంచి ప్రేరణ పొందింది.” ఒక ప్రకటన ఇచ్చారు…

Prada కాపీ కొట్టిన కొల్హాపురి చెప్పుల ధర: ఈ toe-ring sandals ధర సుమారు ₹1.2 లక్షలు (అంటే $1,200 USD). అదే డిజైన్ గల అసలైన కోల్హాపురి చెప్పులు మార్కెట్‌లో ₹500–₹1,500 మధ్యే ఉంటాయి. విశ్లేషకులు ఈ గొడవ వల్ల కోల్హాపురి చెప్పులకు అంతర్జాతీయంగా గుర్తింపు పెరిగే అవకాశముందని అంటున్నారు…

(ఈ కథనం రాయడానికి కారణం… మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియాకు ఇవెందుకు పట్టవు… ఎంతసేపూ పిచ్చి, బురద రాజకీయ ప్రకటనలు, స్టోరీలు, విమర్శలు, ఖండనలేనా..?)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తూర్పు సరిహద్దుల్లో ఇండియా సర్జికల్ స్ట్రయిక్స్… ఒక గ్రూపు ఖతం..!!
  • ఈ ‘జర్నలిజం’ ఓ గీత దాటితే… ప్రజలే ‘అదుపు బాధ్యత’ తీసుకుంటారు…
  • తెలంగాణతనానికి కాదు, దొరతనానికి సలాములు కొట్టే గొంతులు
  • వైవిజయ పులుసు టేస్టుకు నాటి ప్రేక్షకలోకం ఫ్లాటయిపోయింది..!!
  • గొప్ప నటుడు… ఆధిపత్య అహంకారాన్ని బాధతో భరించిన ఆర్టిస్టు కూడా…
  • జరిగేదంతా… జర్నలిజంతో ఘర్షణా..? ఏబీఎన్ రాధాకృష్ణతో ఘర్షణా..?
  • ఆ తల్లిది అలుపెరగని పోరాటం… 30 ఏళ్లుగా ఏ మార్గాన్నీ వదల్లేదు…
  • గుడ్ లోకేష్… వర్తమాన ఏపీ బూతు రాజకీయాల్లో నాలుగు మంచిమాటలు…
  • హమ్మయ్య… బీజేపీ మాధవుడు రాత్రికిరాత్రి తెలంగాణను మళ్లీ ఇచ్చేశాడు…
  • ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions