Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీసీ ఛాంపియన్ రేవంత్ రెడ్డి… జాగ్రత్తగా అడుగులన్నీ అటువైపే…

July 11, 2025 by M S R

.

బీసీ ఛాంపియన్… రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్, బీజేపీలపై రాజకీయంగా తిరుగులేని దెబ్బ కొట్టడమే కాదు, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా బీసీల్లోకి బలంగా వెళ్లిపోయాడు… ఇది రియాలిటీ… సిక్స్ హామీల వంటి పథకాలు ఒక కోణం… కానీ సామాజిక సమతుల్యత విషయంలో తీసుకునే రాజకీయ నిర్ణయాలు, ఆ దిశలో వేసే అడుగులే నాయకుడిని నిలబెడతాయి…

రేవంత్ రెడ్డి అడుగుల్లో, ఆలోచనల్లో పకడ్బందీ వ్యూహాలు, పరిణతి కనిపిస్తున్నాయి… మొదట్లో తనను లైట్ తీసుకున్న ప్రత్యర్థి పార్టీలకు వరుస షాకులిస్తున్నాడు… కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా బలోపేతం చేశాయి…

Ads

bc

ఎంతగా అంటే, పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకోగానే… ప్రత్యర్థి పార్టీకి చెందిన కవిత టీమ్ సంబురాలు చేసింది… సరే, మా గెలుపు అని ఆమె క్రెడిట్ తీసుకున్నా సరే, రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఆమోదం చెప్పి, భేష్ అని మెచ్చుకున్నట్టయింది… ఇదుగో బీసీల కోసం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు అని తాము కూడా జనానికి చెప్పినట్టయింది…

bc

ఈ రిజర్వేషన్ల కోసం ముందుగా కులగణన చేసింది ప్రభుత్వం… చివరకు మోడీ కూడా ఈ దిశలో జాతీయ స్థాయి అమలు కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతను క్రియేట్ చేసింది రేవంత్ ప్రభుత్వం… రిజర్వేషన్లకు బిల్లు పాస్ చేసి, ఢిల్లీకి పంపించారు… ఎస్, రాజ్యాంగపరమైన చిక్కులున్నాయి… 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దు అంటోంది సుప్రీంకోర్టు…

ఒక్క తమిళనాడులోనే రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో పెట్టి 50 శాతం దాటి రిజర్వేషన్లను అమలు చేస్తోంది… కానీ ఆనాడున్న రాజకీయ పరిస్థితులు వేరు… కానీ రేవంత్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం దిశలో తన సంకల్పాన్ని బలంగా ఆవిష్కరించినట్టయింది…

సో, ప్రస్తుతానికి పంచాయతీరాజ్ చట్టం-2018లోని ఒక సెక్షన్‌ను సవరిస్తే, ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేయవచ్చుననీ, తద్వారా బీసీల్లోకి ఛాంపియన్‌గా బలంగా వెళ్లవచ్చునని భావించిన ప్రభుత్వం ముందుగా అసెంబ్లీ, మండలి సమావేశాలను ప్రొరోగ్ (నిరవధిక వాయిదా) వేసి, ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం తీసుకుంది…

ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లినా, లీగల్ అడ్డంకులు ఏమైనా వచ్చినా సరే, రేవంత్ సంకల్పాన్ని మాత్రం వ్యతిరేకించలేరు… ఆ కేసులు కూడా పడకుండా కేవియట్ వేయబోతున్నారు… ఇప్పుడు బీఆర్ఎస్ బాధ అదే ఫాఫం… ఒకవైపు దొరవారి బిడ్డ సంబురాలు చేస్తుంటే, కేటీయార్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ మాత్రం అడ్డంగా విమర్శలకు దిగింది… ఇలా…

bc

అయ్యో, అయ్యో… ఘరానా మోసం అట… బీఆర్ఎస్ నాయకులు, మేధావులతో ఈ ఆర్డినెన్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏవేవో ప్రకటనలు ఇప్పించి, పత్రికలో గుప్పించింది… స్థూలంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రక్రియకు ఆలస్యమవుతున్నా.., కేంద్ర ఆమోదం వంటివి అవసరమున్నా… ముందుగా పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ల అమలుకు ఓ సీరియస్ ఎఫర్ట్ పెడుతుంటే ఎందుకు ఈ అభ్యంతరాలు..? ఎందుకు ఈ వ్యతిరేక ప్రచారాలు…

సింపుల్… కాంగ్రెస్, రేవంత్ బీసీల్లో బాగా సానుకూలతను సంపాదిస్తున్నందుకు..? అది రాజకీయంగా తమకు నష్టం కాబట్టి…! సేమ్, బనకచర్లలాగే ఇందులో కూడా బీజేపీకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఫాఫం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తూర్పు సరిహద్దుల్లో ఇండియా సర్జికల్ స్ట్రయిక్స్… ఒక గ్రూపు ఖతం..!!
  • ఈ ‘జర్నలిజం’ ఓ గీత దాటితే… ప్రజలే ‘అదుపు బాధ్యత’ తీసుకుంటారు…
  • తెలంగాణతనానికి కాదు, దొరతనానికి సలాములు కొట్టే గొంతులు
  • వైవిజయ పులుసు టేస్టుకు నాటి ప్రేక్షకలోకం ఫ్లాటయిపోయింది..!!
  • గొప్ప నటుడు… ఆధిపత్య అహంకారాన్ని బాధతో భరించిన ఆర్టిస్టు కూడా…
  • జరిగేదంతా… జర్నలిజంతో ఘర్షణా..? ఏబీఎన్ రాధాకృష్ణతో ఘర్షణా..?
  • ఆ తల్లిది అలుపెరగని పోరాటం… 30 ఏళ్లుగా ఏ మార్గాన్నీ వదల్లేదు…
  • గుడ్ లోకేష్… వర్తమాన ఏపీ బూతు రాజకీయాల్లో నాలుగు మంచిమాటలు…
  • హమ్మయ్య… బీజేపీ మాధవుడు రాత్రికిరాత్రి తెలంగాణను మళ్లీ ఇచ్చేశాడు…
  • ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions