.
ఈ విషయంలో కేటీయార్ టీమ్‌ను మెచ్చుకోవాలి… సరైన సమయంలో సరైన స్పందన… తెలంగాణ కోణంలో… తెలంగాణ బీజేపీ బిక్కచచ్చిపోయింది దీనికి సమాధానం చెప్పలేక… కాంగ్రెస్ సోషల్ టీమ్స్‌కు ఇలాంటి టైమ్‌లీ స్పందన ఉండదు…
బీజేపీ ఏపీ విభాగం కొత్త అధ్యక్షుడు మాధవ్ టీడీపీ వారసనేత లోకేష్‌ను కలిశాడు… ఓ పెద్ద చిత్రపటం ఇచ్చాడు… అందులో తెలంగాణ ఉనికి లేదు, పేరు లేదు… వాళ్లూ వాళ్లూ గతంలో ఎంత తిట్టిపోసుకున్నా ఇప్పుడు దోస్తులు కాబట్టి కలుస్తారు, కానుకలు ఇచ్చుకుంటారు… వోకే…
Ads
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంటేనే మొదటి నుంచీ వ్యతిరేకతను కనబరిచే టీడీపీ సంగతి పక్కన పెడదాం… మరి బీజేపికి..? ఒక రాష్ట్ర విభాగం అధ్యక్షుడు అంత అనాలోచితంగా ఆ చిత్రపటాన్ని ఎలా బహుకరించాడు..? దీన్ని తెలంగాణ బీజేపీ ఎలా స్వీకరించాలి..? ఎలా స్పందించాలి..?
కేటీయార్ ఓ ట్వీట్ కొట్టాడు నరేంద్ర మోడీకి..? బాగుంది సూటిగా…
‘‘మా సాంస్కృతిక ఉనికి కోసం, చరిత్రలో మాకు సరైన స్థానం కోసం, మా భౌగోళిక గుర్తింపు కోసం తరాలుగా పోరాడుతున్నాం…
కానీ, ఈరోజు మీ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మా చరిత్రను, మా ఉనికిని, మా పోరాటాన్ని ఏమాత్రం గుర్తించనట్టుగా, మాపట్ల ప్రదర్శించిన చిన్నచూపు ఈ చిత్రపటం… ఇది ఖచ్చితంగా తెలంగాణ పట్ల, తెలంగాణ జనం పట్ల కనబరిచిన అగౌరవం…
మా అమరవీరుల పోరాటాలు, త్యాగాలు, మా చరిత్ర పట్ల అమర్యాద… మా చరిత్రను ఇలా చెరిపేస్తే ఇక మా చరిత్ర ఏం కావాలి..? పోనీ, దీని వెనుక మీ పార్టీ కొత్త ప్లాన్, పొలిటికల్ ఎజెండా ఉందా మీరే క్లారిఫై చేయండి… ఒకవేళ అనాలోచితంగా, అనుకోకుండా జరిగిన పొరపాటు అని అంగీకరించే పక్షంలో మీ పార్టీ నేతల నుంచి క్షమాపణలు చెప్పించండి… మా తెలంగాణ సమాజానికి…’’
నిజానికి ఆ చిత్రపటం అప్పుడెప్పుడో సంఘ్ పరివార్ క్రియేట్ చేసిన అఖండ భారత్ వంటి అదేదో అస్పష్ట భావనకు ప్రతీక… 20వ శతాబ్దపు మొదట్లో భారత్ ఇలా సాంస్కృతికంగా ఇంత బలంగా ఉండేదని చెప్పడానికి క్రియేట్ చేశారు… రకరకాల హిందీ, సంస్కృత పేర్లతో… గంగా సాగర్, హిందూ మహాసాగర్ వంటి పేర్లతో…
అయితే దాన్ని ఇప్పుడు ఒక ప్రభుత్వ భాగస్వామి మరొక ప్రభుత్వ భాగస్వామికి యథాతథంగా బహూకరించడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గుర్తించని తెంపరితనమే అవుతుంది… ఎవరో ఎవరికో ఏదో బహుమతి ఇస్తే ఏముందిలే అనుకోవడానికి లేదు… అది బహుళ ప్రచారంలోకి వచ్చేసిన వార్తాచిత్రం కాబట్టి, తెలంగాణ పట్ల ఓరకమైన చిన్నచూపుగా కనిపిస్తుంది కాబట్టి… కేటీయార్ ట్వీట్‌కు, డిమాండ్‌కు విలువ ఉంది… బండి సంజయ్ నోరు పెగలడం లేదెందుకో..!!
Share this Article