.
త్వరలో స్నాక్స్ పాకెట్లపై 'ఆయిల్, షుగర్ హెచ్చరికలు'...: గులాబ్ జామ్, సమోసా, జలేబిలపై కూడా...!
గుట్కా, సిగరెట్లు, బీడీలు, మందు సీసాలపై ఉన్నట్టే… మీకు ఇష్టమైన జలేబి, సమోసా లేదా ఛాయ్ బిస్కెట్లపై కూడా త్వరలో ఆరోగ్య హెచ్చరికలు కనిపించవచ్చు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Ads
దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు (వాటిలో AIIMS నాగ్‌పూర్ కూడా ఉంది) వాటి క్యాంటీన్లు, పబ్లిక్ ఏరియాలలో “ఆయిల్ అండ్ షుగర్ బోర్డులను” ఏర్పాటు చేయాలని ఆదేశించింది… ఇది జంక్ ఫుడ్‌ను పొగాకు వలె సీరియస్‌గా పరిగణించే దిశగా వేసిన మొదటి అడుగు…
దాగి ఉన్న కొవ్వు, చక్కెర వివరాలు బహిర్గతం!
ఈ బోర్డులు రంగుల పోస్టర్ల రూపంలో ఉంటాయి. ఇవి రోజువారీ స్నాక్స్‌లో ఎంత కొవ్వు (hidden fat), చక్కెర (sugar) దాగి ఉన్నాయో స్పష్టంగా తెలియజేస్తాయి… లడ్డూ, వడ పావ్, పకోడా, కచోరీ వంటి మన సాంస్కృతిక ఆహారాలపై కూడా ఈ పరిశీలన ఉంటుంది…
2050 నాటికి ఊబకాయంలో భారత్ రెండో స్థానం!
ప్రభుత్వం అంతర్గత నివేదిక ఒకటి దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది… 2050 నాటికి 44.9 కోట్లకు పైగా భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు…
ఇది అమెరికా తర్వాత భారత్‌ను ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఊబకాయ కేంద్రంగా నిలుపుతుంది. ఇప్పటికే, పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక బరువుతో ఉన్నారు. అనారోగ్యకరమైన ఆహారం, తక్కువ శారీరక శ్రమ కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తుంది…
అవగాహనే లక్ష్యం, నిషేధం కాదు!
“ఇది ఆహారాన్ని నిషేధించడం గురించి కాదు” అని సీనియర్ డయాబెటాలజిస్ట్ సునీల్ గుప్తా అంటున్నాడు… “ఒక గులాబ్ జామున్‌లో ఐదు టీస్పూన్ల చక్కెర ఉండవచ్చని ప్రజలకు తెలిస్తే, వారు రెండోసారి తినడానికి ఆలోచిచిస్తారు కదా…” అంటాడు తను…
మధుమేహం, గుండె జబ్బులు,, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు (non-communicable diseases) ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది… ఈ కొత్త నిబంధనలు ఆ వ్యాధులపై పోరాటంలో భాగంమేనని వైద్యులు, ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు…
నాగ్‌పూర్ ఈ మార్పును అమలు చేస్తున్న మొదటి నగరాలలో ఒకటిగా నిలుస్తుంది… నిషేధాలు కాకుండా, స్పష్టమైన, దృశ్యమాన హెచ్చరికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం… ప్రతి ఆకర్షణీయమైన స్నాక్ పక్కన ఒక రంగుల బోర్డు కనిపిస్తుంది… “తెలివిగా తినండి. మీ భవిష్యత్తు మిమ్మల్ని అభినందిస్తుంది” అని …!!
నిజానికి ఈ హెచ్చరిక బోర్డులు కాదు… పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే ఓ పాఠంగా చేర్చండి, ఎక్కువ ఫలితం ఉంటుంది… కానీ ఎవడికి పట్టింది..!?
Share this Article