.
Ashok Pothraj
……. ఆ హీరో తెరమీదకి వచ్చినప్పుడల్లా గుర్ర్ గుర్ర్ మంటూ చేసే శభ్దమేదైతే ఉందో అది నా చెవులను శానా ఇరిటేట్ చేసింది.
ఇకపోతే సినిమాలో ఎలివెషన్స్ మామూలుగా లేవు.. ఆ డైరెట్టరు బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంటు అనుకుంటా… ప్రతీ ఫైటూ ఒక “అఖండ”మే..!!
Ads
ఒకరు కత్తి ఐతే ఇంకొకరు సుత్తి, మరొకరు ఎపుడు పేలుతాడో తెలీని ఆటంబాంబు.. వీళ్లకు తోడు కళ్లు భైర్లు కమ్మే విరోచిత పోరాటాలు,
గుండాగాళ్లు అమాంతంగా గాల్లోకి ఎగరడాలు, కత్తులు, శూలాలు వచ్చి సరుక్కున బాడీలో దిగడాలు చూస్తే “వామ్మో వారి నియమ్మా భడవో ఇదేందయ్యా ఇదీ” అనే కామెడీ సీన్ గుర్తొస్తుంది..
గింతదానికి అందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే ఒడిసే ముచ్చటనే లాగి.. లాగి.. బోల్ట్ స్క్రీన్ ప్లేతో కట్స్ కట్స్ తో మేకింగ్ చేసి జనాల మీదకి వదిలేసారు.
కానీ.. ఈ సినిమా గొప్పతనం కెమెరా, ఆర్టు, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లను ఖచ్చితంగా మెచ్చుకోకుండా ఉండలేం.. నేనైతే మధ్యలోనే సినిమా ఆపి “రేయ్ పోరారేయ్ ” అని తనివితీరా నవ్వి మళ్లీ కంటిన్యూ చేసాను.
ఎక్కువ ఎలివేషన్‌లు… తక్కువ ఇంటెన్సిటీ ఉన్న సినిమా ఇది. అవమానంలోంచి పుట్టిన తిరుగుబాటునీ, బలహీనతలోంచి పుట్టిన ధైర్యాన్ని స్వచ్ఛంగా చూపలేక పోవడం డైరెట్టర్ డీఫాల్ట్.
ఔను, అసలు విషయం మరిచాను, ఈ సినిమా తమిళంలో వచ్చిన “గరుడన్” రీమేకట.. ఐతే అక్కడ భారీ హిట్ సాధించిదట. దీన్నే మనోళ్లు రీమేక్ పేరిట చెడగొట్టారని అర్థమైంది. అలాగే రా స్క్రిప్ట్ తో తీసి ఉంటే బాగుండేది.
చూద్దామంటే మాస్ సినిమాలే లేని ఈరోజుల్లో ఇట్లాంటి ముగ్గురు మొనగాళ్ల సినిమా అతిగా బాగానే ఉందేమో అనిపించింది. మాస్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుందమో మరి. పర్వాలేదు, సోసోగా ఈ వీకెండ్ కి జీ5 ఓటిటీలో చూసేయండి… #Bhairavam #ZEE5 #telugucinema #tollywood #OTT #NewArrival #tranding #tollywood #fbpost2025
Share this Article