.
కొన్ని వార్తలు చదువుతుంటే కలుక్కుమంటుంది… మనిషిలోని క్రూరత్వం, కృతఘ్నత, కామవాంఛ అన్నీ కనిపించే కేసు ఇది… సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్‌లో కనిపించింది… డిటెయిల్డ్‌గా బాగుంది… ఇతర ఎడిషన్లలోనూ కవర్ చేస్తే బాగుండేది…
నెల్లూరు జిల్లా, కావలి… పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన తండ్రితో కలిసి 16 ఏళ్లుగా ఓ ఫిస్తులా హాస్పిటల్ రన్ చేస్తున్నాడు… భార్య అర్పితా, పేరెంట్స్, పిల్లలతో కలిసి ఉంటాడు… తనకు దూరపు బంధువు నయన్ బిశ్వాస్‌ను చేరదీసి, తన హాస్పిటల్‌లోనే కంపౌండర్‌గా చాన్స్ ఇచ్చాడు…
Ads
అది తాచుపామనీ, పాలుపోస్తున్నాననీ గమనించలేకపోయాడు… 2024 డిసెంబరు 31… కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా శ్రీకాంత్, నయన్, మరో బంధువు కలిసి మందుకొట్టారు, తరువాత ఎవరి గదికి వాళ్లు వెళ్లిపోయారు… నయన్ భిశ్వాస్ హాలులోనే పడుకున్నాడు…
తెల్లారిలేచి చూస్తే శ్రీకాంత్ భార్య అర్పిత లేదు… ఆమె గదిలో రక్తం… వెతకగా వెతకగా ఇంటికి సమీపంలో ఓ మురికి కాలువలో శవంగా కనిపించింది… ఒంటిపై తీవ్ర గాయాలు… లోకల్ పోలీసులు దర్యాప్తు చేస్తే తేలింది ఏమిటంటే..? అర్పితపై కన్నేసిన నయన్ అదేరాత్రి లైంగికదాడికి ప్రయత్నించాడు… ఆమె ఎదురుతిరిగింది…
ఇదంతా ఎక్కడ బయటికొస్తుందోనని ఆమెను చంపేశాడు… ఇదీ కావలి పోలీసులు చెప్పింది… నెల్లూరు కోర్టు వీడి బెయిల్ పిటిషన్ కొట్టేసింది… తరువాత హైకోర్టుకు వెళ్లాడు… అక్కడ కూడా బెయిల్ పిటిషన్ కొట్టేశారు… ఎందుకు..?
చేరదీసి, కొలువు ఇచ్చి, ఆదరిస్తున్న యజమాని పట్ల కృతఘ్నత, ద్రోహం… ఆయన భార్యపై లైంగిక దాడికి యత్నం… ఆమె ప్రతిఘటనతో తలపై దారుణంగా కొట్టి చంపాడు… అక్కడ ఆగలేదు… వాడిలోని మృగం, కాదు కాదు, మృగాలు ఇలా ఎందుకు వ్యవహరిస్తాయి..? వీడొక పిశాచం…
ఆమె మరణించాక, ఆ మృతదేహంతో లైంగిక చర్యకు పాల్పడ్డాడు… ఈ నేర తీవ్రత న్యాయస్థానాన్ని కూడా కదిలించింది… ఛార్జిషీటు దాఖలైంది కదా, బెయిల్ ఇవ్వండి అని వాడి తరఫు న్యాయవాదులు అడిగితే న్యాయమూర్తి తిరస్కరించారు… ఆ నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పి ఆ బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు… సరైన నిర్ణయం, సరైన తీర్పు…
వాడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇదే తీర్పు ఎదురుకావాలని ఆకాంక్షించడమే కాదు, నేరానికి తగిన శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉండాలనీ ఆశిద్దాం..!!
Share this Article