.
ఇవే మరి తగ్గించుకుంటే మంచిది… ప్రకాష్ రాజ్ పలికిన ఈ డైలాగ్ పదే పదే రీల్స్, టీవీ షోలు, మీమ్స్, షార్ట్స్‌లలో వినిపిస్తూ ఉంటుంది… కానీ ఏ సినిమా సెలబ్రిటీ దాన్ని పాటించడు…
అసలు బహిరంగ వేదిక ఎక్కితే చాలు, వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాదు… సోయి ఉండదు… నాలుక మీద అదుపు ఉండదు… కొన్నాళ్లుగా అనేక ఉదాహరణలు విన్నాం, చదివాం, చూశాం… వీళ్లెవర్రా బాబూ అని నవ్వుకున్నాం కూడా…
Ads
సందర్భానికి తగినట్టుగా… సూటిగా… సంక్షిప్తంగా… ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ… సినిమా సెలబ్రిటీల దగ్గర లేనిదే అది… తాజాగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా సేమ్ సేమ్…
విజయ్ దేవరకొండ హీరోగా కింగ్‌డమ్ సినిమా వస్తోంది కదా… నిర్మాత నాగవంశీ… తనూ సేమ్ సేమ్… నేనేం తక్కువ తిన్నాను అన్నట్టుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా సేమ్ తన మాటల తీట బయటపెట్టుకున్నాడు సినిమా ప్రమోషన్లలో…
‘‘నా మొదటి సినిమా మళ్ళీ రావా… మొదట కథానాయకుడిగా గౌతమ్ విజయ్‌ని అనుకున్నాం… కథ విజయ్‌కి చెప్పినప్పుడు రెండు సమోసాలు తిని, నాకేమి ఎక్కట్లేదు బాస్.. నేను వెళుతున్నాను అంటూ విజయ్ వెళ్లిపోయాడు… దాంతో ఆ సినిమాను సుమంత్‌తో తీశాను… ఈ చిత్రం మంచి హిట్… ఒకరోజు విజయ్ నాకు తనే కాల్ చేసి మనం సినిమా చేద్దాం, ఏ కథ ఉన్నా వోకే అని చెప్పాడు… అలా కింగ్‌డమ్ తెరకెక్కింది…’’
అంటే, ఏమని చెప్పాలనుకున్నాడు… విజయ్‌కు కథ జడ్జిమెంట్ తెలియదు, నేనేమో తోపును, చివరకు విజయే నాకు కాల్ చేసి, అడిగితే, ఈ సినిమా అంగీకరించాను అని చెబుతున్నాడు… అహం, ఎక్కువైంది… విజయ్ నా గొప్పతనం తెలుసుకుని, అడిగితేనే ఈ సినిమా చేశాను అని చెప్పుకోవడం అతి… స్వోత్కర్ష అంటారు తెలుగులో…
నిజంగా మళ్లీ రావా అనే సినిమా హిట్టయిందా..? ఏమో తనకే తెలియాలి… అసలు సుమంత్‌కు ఇదీ నా సినిమా అని చెప్పుకునే సినిమాలూ ఉన్నాయా..? సరే, ఉన్నాయీ, తిప్పి తిప్పి కొడితే ఈ తిన్ననూరి తీసిందే రెండు సినిమాలు… మళ్లీరావా ప్లస్ జెర్సీ… జెర్సీనే హిందీలో రీమేక్ చేసినట్టున్నారు… ఈ రెండు సినిమాలకే విజయ్ దేవరకొండ బాబ్బాబూ, ప్లీజ్, నువ్వు ఏ కథ చెప్పినా సరే వోకే బాసూ అని బతిమిలాడాడా..?
విజయ్ దేవరకొండ సిట్యుయేషన్ మరీ అంత దిగజారిపోయిందా ఫాఫం… వాట్ రౌడీ హీరో… అయిదారు సినిమాలు వరుసగా దొబ్బేస్తే మరీ ఇలా మారిపోవాలా..? ఫోన్లు చేస్తూ దర్శకులను చాన్సులు ఇమ్మని అడుగుతున్నావా..?
వాట్ రష్మికా, నీ హీరో ఇలా అయ్యాడేమిటి మరీ..!! అన్నట్టు… నాకు గరల్ ఫ్రెండ్‌తో గడిపే సమయం కూడా చిక్కడం లేదంటాడు తను, నువ్వేమో ఇంటికి పోయే తీరిక కూడా లేదంటావు… వాటీజ్ దిస్..?!
Share this Article