.
చంద్రబాబు ప్రభుత్వం ఎడాపెడా భూపందేరం సాగిస్తోంది… అడ్డికిపావుశేరు కాదు, ఉచితమే… పేరుకు లీజు అంటారా..? రూపాయికి ఎకరం అంటారా మీ ఇష్టం… ప్రతి భూకేటాయింపు వెనుక ఓ బాగోతం ఉంటుందని అందరికీ తెలిసిందే…
అమరావతిలో ఇంకా వేల ఎకరాలు సేకరిస్తాడుట… క్వాంటమ్ వ్యాలీలోకి వచ్చే సంస్థలకు భూమి ఇవ్వడం వరకూ వోకే… అది ఏపీ డెవలప్‌మెంట్‌కు కొత్త దశను, కొత్త దిశను చూపిస్తుంది కాబట్టి… కానీ విశాఖలో, విజయవాడలో ఎడాపెడా ధారాదత్తం చేయడం ఏమిటి..?
Ads
అదేమంటే..? పెట్టుబడులు, ఉపాధి కల్పన అనడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది… నిజంగా ఒక్కసారి ఆలోచించండి… విజయవాడలో మాల్స్ లేవా..? మరెందుకు లులూ వాడికి అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాల్ని అప్పగించేయడం..!
ఇప్పటికిప్పుడు అక్కడ మాల్ కట్టకపోతే విజయవాడకో, అమరావతికో, ఏపీకో ఏమైనా నష్టమా..? బోలెడు మంది స్థానిక వ్యాపారులున్నారు… పోనీ, వేరే కంపెనీల ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టు పిలిచి, బిడ్డింగ్ పెట్టావా..? లేదు… లులూ అనగానే అత్యంత ఆత్మీయుడు, అప్పగించేయడమేనా..? ఇదేం పంపిణీ..?
నిజమైన ప్రజాపాలకుడు ఏం చేస్తాడు..? అదే ఆర్టీసీ భూమిని తాకట్టు పెట్టి, రుణం తీసుకుని, ఆర్టీసీకే ఓ పెద్ద భవనం కట్టిస్తాడు… అందులో మాల్ ఎవరు పెడతారనేది వేరే విషయం… అది ఆర్టీసీకి రవాణేతర ఆదాయం… ఇప్పుడది అవసరం… పైగా వందల కోట్ల ప్రాపర్టీని ఆర్టీసీకి క్రియేట్ చేయడం… అవన్నీ వదిలేసి, అప్పనంగా ఎందుకు రాసిచ్చేస్తున్నట్టు..?
లులూ వాడు వ్యాపారి… ఇప్పుడు తనకు అప్పగించిన ఆస్తి (99 ఏళ్ల లీజు అట) విలువకన్నా తను పెట్టే పెట్టుబడి తక్కువ… అంతెందుకు..? అదే ల్యాండ్ ఏ బ్యాంకు వాడికి తనఖా పెట్టినా ఈజీగా రుణం ఇస్తాడు… ఆర్టీసీ ఆస్తుల్ని ఇలా ఎవరికో ధారాదత్తం చేసి, అబ్బే, మాకు ఆర్టీసీ కూడా ముఖ్యమే అని చెప్పడానికి ఇంకెక్కడో ప్రత్యామ్నాయ స్థలం ఇస్తారట…
అత్యంత విలువైన భూమిని ఎవరి వ్యాపారానికో ఇవ్వడం ఏమిటి..? ఆర్టీసీకి ఇంకెక్కడో ఆ భూమికి బదులు మరో భూమిని ఇవ్వడం ఏమిటి..? ఇష్టారాజ్యం..!
గతంలో కూడా విశాఖలో ఇదే లులూ గ్రూపుకి 11 ఎకరాల స్థలం ఇచ్చినట్టు గుర్తు… తను అడగడం, బాబు రాసిచ్చేయడం… ఈ బంధమేమిటో ఎవరికీ అర్థం కాదు… పోనీ, లులూ ఏమైనా ఫ్యాక్టరీ పెడతాడా..? ఐటీ కంపెనీయా…? వేలాది మందికి ఉపాధి వస్తుందా..? ఖజానాకు కోట్లకొద్దీ ట్యాక్స్ వస్తుందా..? ఏమీ ఉండదు… పెద్ద దుకాణం అది… అంతే…
విశాఖలోనూ గతంలో ఇదే తంతు అట… లులూకి ఇచ్చిన 11 ఎకరాల సీఎంఆర్ స్థలానికి బదులుగా ఇంకెక్కడో ఆల్టర్నేట్ స్థలాల్ని కేటాయించారట… జగన్ వచ్చాక లులూ డీల్ రద్దు చేసింది, మరి ఆ ప్రత్యామ్నాయ స్థలాలు ఎవరి పాలయ్యాయి..? మళ్లీ ఇదో బాగోతం… అవునూ, లులూకు చంద్రబాబుకు నడుమ ఇంత గాఢమైన బంధం ఏమిటబ్బా..!!
Share this Article