.
ఒక వార్త ఆసక్తికరంగా అనిపించింది… అదేమిటంటే… దర్శకుడు వంగా సందీప్ రెడ్డికి ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా తీయాలని ఉందట… అందులో అసలు మేల్ లీడ్ యాక్టర్ ఉండకూడదట… ఆ ఫిమేల్ లీడ్ రోల్‌కు సాయిపల్లవి అయితే బాగుంటుందట…
తన సినిమాల్లో హీరోయిన్లు లేదా ఫిమేల్ ఇంపార్టెంట్ రోల్స్ బోల్డ్… కాదు, వైల్డ్… హీరోలు అయితే ఇక చెప్పనక్కర్లేదు… వైల్డ్ యానిమల్స్, మెంటల్ కేసులు… అరాచకంగా ఉంటుంది వాళ్ల కేరక్టరైజేషన్… తను మొదట తీసిన అర్జున్‌రెడ్డి గానీ, తరువాత యానిమల్ గానీ సేమ్… యానిమల్ ఇంకాస్త ఎక్కువ ఘాటు… (కబీర్ సింగ్ అర్జున్ రెడ్డికి రీమేక్)…
Ads
తృప్తి డిమ్రి బోల్డ్‌నెస్ వోకే, రష్మికతో కూడా దాదాపు అలాగే నటింపజేశాడు… అసలు మొదట్లో అర్జున్‌రెడ్డి స్క్రిప్టు, వంగా సందీప్ రెడ్డి నరేషన్ విని, చదివి ఎవ్వరూ సాహసించకపోతే, తనే సొంతంగా భద్రకాళి (తన స్వస్థలం వరంగల్) ఫిల్మ్స్ పేరిట సొంతంగా సినిమా తీశాడు…
సరే, సినిమా బ్లాక్ బస్టర్… అదేసమయంలో ప్రధాన పాత్రపై, కథ ప్రజెంటేషన్ తీరుపై బోలెడు విమర్శలు… ఇక యానిమల్ సినిమా మీదనైతే మరీ ఎక్కువ… తన ఫోకస్ అంతా లీడ్ రోల్స్ ఇంటెన్స్ కేరక్టరైజేషన్ మీద ఉంటుంది… సో, తను ఒకవేళ ఫుల్లు ఫిమేల్ సెంట్రిక్ సినిమా తీసినా, అందులో ఫిమేల్ లీడ్ రోల్ కూడా అరాచకంగానే ఉంటుందేమో…
అలా అనిపించడం సహజం కూడా… తనకు ఓ వైల్డ్ ఫిమేల్ యానిమల్ కావాలంటే సాయిపల్లవి ఏమాత్రం అక్కరకు రాదు… ఆమె ప్రస్తుత ఇమేజ్ రీత్యా సాధుజంతువు… ఆ పాత్రలు, ఆ కేరక్టరైజేషన్, ఆ బోల్డ్‌నెస్ తనకు నప్పదు, తను నచ్చదు… ఏదైనా మంచి కాజ్ మీద ఫైట్ చేసే ఫిమేల్ లీడ్ రోల్ గనుక సంకల్పిస్తే, ఒప్పుకుంటుందేమో, అలాంటి పాత్ర వంగా క్రియేట్ చేయగలడు… కానీ తన పాత కథల తీరు చూస్తే తనకు సాత్విక పాత్రలు నచ్చవనీ, వాటి జోలికి వెళ్లడనీ అనుకోవాల్సిందే…
ఎటొచ్చీ తనకు మరో తృప్తి డిమ్రి లేదా మరో రష్మిక మంధాన కావాలంటే మాత్రం సాయిపల్లవి అస్సలు సూట్ కాదు… ఒకవైపు ప్రిస్టేజియస్ రామాయణలో సీత పాత్ర చేస్తూ… ఆ పాత్రకు వేయి శాతం కంట్రాస్టుగా ఉండే సందీప్ రెడ్డి మార్క్ పాత్ర చేయడం కూడా ఆమె కెరీర్ కోణంలో సరికాదు…
ఆమె చేసిన గార్గి, విరాటపర్వం కూడా ఫిమేల్ లీడ్ సెంట్రికే… ఐనా సరే, అవి సక్సెస్ కాలేదు… వాటి తరువాత ఆమెకు సౌత్‌లో సినిమాల్లేవు… మరీ యానిమల్ మార్క్ బోల్డ్ పాత్రలైతే మాత్రం సాయిపల్లవి ఫిజిక్, పర్సనాలిటీ కూడా సూట్ కావు… సో, సందీపుడికి సాత్వికం పడదు, అలా లేకపోతే సాయిపల్లవికీ పడదు… సో, ఇద్దరికీ పడదు, శృతి కలవదు..!!
Share this Article