.
ఒకేరోజు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విడివిడిగా కలిశారు… విడివిడిగా కలవడం ఓ విశేషం కాగా, ఏ అంశంపై కలిశారనే రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి మీడియాలో, పొలిటికల్ సర్కిళ్లలో-
తరువాత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధానమంత్రి మోడీని కలిశాడు… రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్— బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిరణ్ రిజిజూలతో భేటీ వేశాడు…
Ads
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, హోం సెక్రటరీలతో హోం మంత్రి అమిత్ షా సమావేశయ్యాడు… ఈరోజు ఉదయం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు…
అమరనాథ్ యాత్రను ఆపేశారు… కాశ్మీర్‌లో సున్నితమైన ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించి, బలగాలను మొహరిస్తున్నారు… ఏం జరుగుతోంది..? కేంద్రం మరేదైనా కీలక నిర్ణయం తీసుకోబోతోందా..? ముందుగానే రాష్ట్రపతికి ఆ సమాచారం ఇవ్వబడిందా..?
ఇవేవీ రోజువారీ రొటీన్, కాజువల్ సమావేశాలు మాత్రం కావు… ఏం చేయబోతున్నారు..? జమ్ముకు రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చి, కాశ్మీర్‌లో కేంద్ర పాలనా..? అలా విడివిడిగా చేయడానికి వీలుందా..? పహల్గామ్ ఉగ్రదాడి, తరువాత పాకిస్థాన్‌తో సైనిక ఘర్షణ నేపథ్యంలో… కేంద్రం కాశ్మీర్ విషయంలో, దేశసమగ్రత విషయంలో త్వరపడి ఏ నిర్ణయాలూ తీసుకోలేని పరిస్థితి…
కాశ్మీర్ ఈరోజుకూ సమస్యాత్మకమే… నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలకు ఆ ప్రాంతాన్ని అప్పగించే సిట్యుయేషనే వస్తే, అది మరింత ప్రమాదమనే భావన, ఆర్టికల్ 370 ఎత్తివేత తరువాత కొంచెం కొంచెం అదుపులోకి వస్తున్న ఉగ్రనియంత్రణ మళ్లీ గాడితప్పుందనే ఆందోళన బీజేపీ వర్గాల్లో ఉంది… సో, ఈరోజు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీలో ఏదైనా నిర్ణయం వెలువడుతుందేమో చూడాలి..!
.
Update :: జమ్మూ కాశ్మీర్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు…
Share this Article