.
నిజమే, దేశంలో వైద్యరంగంలో ఉన్నంత దోపిడీ మరే రంగంలోనూ లేదని మన అనుభవం… కోట్ల ఉదాహరణలు… నూటికో కోటికో ఒక్కరు ప్రజావైద్యులు… కార్పొరేట్ హాస్పిటళ్ల సంగతి తెలిసిందే కదా…
కన్సల్టేషన్, డయాగ్నయిజ్, సర్జరీలు, ఫార్మా, వేక్సిన్ల దగ్గర నుంచి ప్రతిదీ దందాయే… కానీ ఈ నాణేనికి మరో కోణం ఏమిటంటే..? ఇంత విశృంఖలత్వం కూడా విదేశాల నుంచి లక్షల మంది రోగులను ఆకర్షిస్తోంది… నిజమో, నిష్ఠురమో, తప్పో ఒప్పో… ఒళ్లు బాగు చేసుకుని వెళ్తున్నారు… నిజం… సరోగసీ, ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్లు కూడా…
Ads
అల్లోపతి మాత్రమే కాదు… యోగ, ఆయుర్వేదం, ఇతర దేశీయ వైద్యాలు కూడా పనిలోపనిగా ప్రాచుర్యం పొందుతున్నాయి… భారత వైద్య పర్యాటక రంగం (వీళ్లను పర్యాటకులు అందామా..?) వృద్ధి చెందుతోంది… 2025లో తొలి నాలుగు నెలల్లోనే (జనవరి నుంచి ఏప్రిల్ వరకు) 1.31 లక్షల మంది విదేశీ పర్యాటకులు వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఈ సంఖ్య ఆ నాలుగు నెలల్లో వచ్చిన మొత్తం విదేశీ పర్యాటకులలో సుమారు 4 % కావడం గమనార్హం… ఈ వృద్ధికి ప్రధాన కారణాలు…
అధునాతన వైద్య సేవలు…: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆసుపత్రులు, నిష్ణాతులైన వైద్య నిపుణులు భారతదేశంలో అందుబాటులో ఉన్నారు…
తక్కువ ఖర్చు: ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశంలో నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో లభిస్తున్నాయి. ఇది విదేశీయులను బాగా ఆకర్షిస్తోంది…
ప్రభుత్వ ప్రోత్సాహం: “హీల్ ఇన్ ఇండియా” వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం వంటి చర్యలు కూడా ఈ రంగానికి ఊతమిస్తున్నాయి…
ఇంకా వీసాల ప్రాసెసింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, అకామిడేషన్ స్ట్రీమ్‌లైన్ చేస్తే, సాధారణ పర్యాటక ప్రాంతాలతో అనుసంధానిస్తే మరింత డెవలప్‌మెంట్ కనిపిస్తుందని ఈరంగంలోని నిపుణుల అభిప్రాయం…
ఐతే అన్ని దేశాల నుంచి కాదు… బంగ్లాదేశ్, ఇరాక్, సోమాలియా, ఒమన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల నుంచి ఎక్కువ మంది వైద్య పర్యాటకులు భారత్‌కు వస్తున్నారు… ఆయా దేశాల్లో వైద్యరంగం పెద్దగా డెవలప్ గాకపోవడంతో… ఖర్చు భరించగలిగిన రోగులు ఇక్కడికి వస్తున్నారు… మరీ కార్డియాలజీ, అంకాలజీ, ఆర్థోపెడిక్స్ రోగులు ఎక్కువగా…
Delhi, Mumbai, Bangalore, Chennai, Hyderabad, Kolkata వంటి కేంద్రాల్లో హాస్పిటళ్లు ఎక్కువగా రోగులను ఆకర్షిస్తున్నాయి… ష్… ఎక్కడెక్కడో స్థిరపడిన మనవాళ్లు కూడా ఏదైనా సర్జరీయో, కాస్త ఖరీదైన చికిత్సో అయితే… లీవులు పెట్టి, స్వదేశం వచ్చి… వైద్యం చేయించుకుని వెళ్తున్నారు… ప్రత్యేకించి సోకాల్డ్ డెవలప్డ్ దేశాల్లో వైద్య ఖర్చులు భరించలేక..!!
Share this Article