.
Subramanyam Dogiparthi
…… ఆర్తుల పాలిట బ్రహ్మాస్త్రం ఈ సినిమాలో లాయర్ సాగర్ . బలహీనుల కోసం బలవంతులతో ఢీ కొట్టే పాత్ర కృష్ణది ఈ సినిమాలో . ఆ క్రమంలోనే ఒక బలవంతుడి అహాన్ని దెబ్బతీస్తాడు హీరో కృష్ణ . దెబ్బతిన్న పులి లాగా వేచి చూసి హీరో గారి బావని ఓ మర్డర్ కేసులో ఇరికించేస్తాడు ఆ విలనుడు .
ఆ బావే తన పిచ్చి చెల్లెలిని చంపాడనే కచ్చతో రావు గోపాలరావు అతన్ని ఏసేయటానికి తిరుగుతుంటాడు . క్లైమాక్సులో ఆ దెబ్బతిన్న బలవంతుడే అసలు హంతకుడని రుజువు చేసి బావను రక్షించుకుంటాడు హీరో . విలన్ని చంపి తన పగ తీర్చుకుంటాడు రావు గోపాలరావు .
Ads
కృష్ణ లాయరుగా సెటిల్డ్ ఏక్షన్ని అందించాడు . ప్రేయసిగా , మంచి సహవాసిగా గ్లామర్ని ఆరబోస్తూ విజయశాంతి అందంగా నటించింది . సినిమాను మలుపు తిప్పే పాత్ర రావు గోపాలరావుది . రొటీన్ పాత్ర కాకుండా భిన్నంగా ఉంటుంది . నేనో హత్య చేయబోతున్నాను ; నన్ను మీరు ఆ కేసు నుండి కాపాడాలని లాయర్ కృష్ణ దగ్గరకొచ్చి అడిగే పాత్ర . ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది .
మరో మంచి పాత్ర లాయర్ జగ్గయ్యది . చిటికెన వేలుతో చేసేసినా సినిమాలో ప్రధాన పాత్రలో బ్రహ్మాండంగా నటించారు . మరో కీలక పాత్ర కన్నడ ప్రభాకర్ విలన్ పాత్ర . నాలుకతో కింది పెదాన్ని నాకుతూ ఉండే మేనరిజం కల పాత్ర .
- కోర్టులో ఆ మేనరిజం తోనే ఒక స్త్రీకి చేసిన అన్యాయాన్ని లాయర్ హీరో బయటపెడతాడు . ఈ సీన్ యధాతథంగా కన్నడంలో చాణక్య అనే సినిమా నుండి ఎత్తేసారు .
ఇతర ప్రధాన పాత్రల్లో వరలక్ష్మి , రామకృష్ణ , రాజేంద్రప్రసాద్ , సంయుక్త , సి యస్ రావు , శ్రీలక్ష్మి , నూతన్ ప్రసాద్ , కాంతారావు , సాయికుమార్ , శుభ , సుత్తి వేలు , సువర్ణ , సాక్షి రంగారావు , పద్మనాభం , ఓ కుక్క నటించారు .
వియత్నాం వీడు సుందరం నేసిన ఈ కధకు జి రామమోహనరావు దర్శకుడు . సినిమా బాగా ఆడటానికి సత్యానంద్ డైలాగ్స్ సాయపడ్డాయి . వేటూరి వారే పాటల్ని వ్రాసినా బయట పెద్దగా అన్నీ హిట్ కాలేదు . థియేటర్లో బాగానే ఉంటాయి . అనగనగా ఒక అమ్మాయి శ్రీమతి కావాలనుకుంది , ఆ దేవుడు నా తొలి ముద్దాయి పాటలు హైలైట్ , బాగుంటాయి . పాటల్ని రాజ సీతారాం , సుశీలమ్మలు పాడారు . చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు . జూడో రత్నం ఫైట్లను , సలీం నృత్యాలను కంపోజ్ చేసారు . ఫైట్లూ , డాన్సులూ బాగానే ఉంటాయి .
ఇది కృష్ణకు 234 వ చిత్రం . ఇప్పటి హీరోలు 23 , 34 కే అలసిపోతున్నారు . అప్పుడంటే యన్టీఆర్ , అక్కినేని , కృష్ణ , శోభన్ బాబు వంటి సీనియర్ హీరోలు షైలాకులు కాదు కాబట్టి అప్పటి నిర్మాతలు వాళ్ళతో అన్నన్ని వందల సినిమాలు తీయగలిగారు .
It’s a movie of sentiment , emotion , drama and action . సినిమా మొదట్లో యన్టీఆర్ లాయర్ విశ్వనాథ్ సినిమా గుర్తుకొస్తుంది . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడండి . చూడబులే . విజయశాంతే కాదు కృష్ణ కూడా అందంగా ఉంటాడు . సినిమా యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article