.
ఇంతకుముందు చెప్పుకున్నదే… తెలుగు నిర్మాతలు అంతే… వాళ్లు మారరు… వాళ్లు తెలంగాణలో బతుకుతున్నా, ఇక్కడి మానవ వనరులు, వనరులను దోచేస్తున్నా సరే… ఆ గుండెలు కొట్టుకునేది ఆంధ్రాలోనే…
ఈ వ్యాఖ్య హార్ష్‌గా అనిపించినా అదే నిష్ఠురసత్యం… టాలీవుడ్ అడ్డా హైదరాబాద్ కదా… అక్కున చేర్చుకుని ఆదరించింది కదా… మనవాళ్లే అని ప్రేమించింది కదా… తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజుకు తీసుకుపోయింది ఇక్కడి నుంచే కదా…
Ads
నువ్వు ఆంధ్రా, నేను తెలంగాణ అని వివక్ష చూపించలేదు కదా… ఇప్పుడేం జరుగుతోంది..? తెలంగాణ ప్రభుత్వాన్ని ఖాతరు చేయని బలుపు గురించి కాదు… కార్మికులు సమ్మెకు సిద్ధమవుతుంటే… నిర్మాతలకు ఒక చిరంజీవి కావాలి మధ్యవర్తిత్వం కోసం… తనేమో అటూఇటూ కాని పెద్దరికం… ఏదీ సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయడు… చెప్పేది ఎవరికీ అర్థం కాదు…
ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేనికి ఫోన్ వెళ్లింది… ఈ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో కార్మిక సంఘాల నేతలతో మంత్రి కలిసే అవకాశం ఉందనీ వార్తలు… మరోవైపు..?
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని కలవనున్న 14 మంది తెలుగు సినిమా నిర్మాతలు… ఇప్పటికే విజయవాడ చేరుకున్న నిర్మాతలు… అని వార్తలు…
ఏం చేస్తాడు సదరు పవన్ కల్యాణ్ వీరాభిమాన మంత్రివర్యుడు…? హైదరాబాద్ ప్రాంత, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల్లో వేలు పెడతాడా..? పరిష్కారాలు చెబుతాడా..? అదే జరిగితే మంత్రి కోమటిరెడ్డి ఫాఫం అనుకోవాల్సిందే… శ్రీమాన్ దుర్గేష్ గారు, విషయాలన్నీ సావధానంగా విని, డిప్యూటీ సీఎం, సీఎంలకు చెబుతాడట…
సరే, దిల్ రాజును వదిలేయండి, పేరుకు ఫిలిమ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ అని ఏదో బాధ్యతలు ఇచ్చినా సరే, ఇప్పటికీ ఓ సిండికేట్ మెంబర్‌గానే తప్ప… తెలంగాణ కోణంలో వ్యవహరించిందీ లేదు, తనకు ఆ సోయీ లేదు…
మరోవైపు ఫిలిమ్ ఛాంబర్ సినిమాల షూటింగులను ఆపేసింది… బెదిరింపు టాక్టిక్స్… మరి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు…? వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖను చూస్తున్నట్టు వికీ చెబుతోంది ఫాఫం… మ ఈ గడ్డ మీద ఈరోజుకూ ఇంకా ఇంకా ఆంధ్రా నేతల పెత్తనాలేనా ప్రతి రంగంలోనూ..? ఏమండీ వివేక్ గారూ..!!
డిస్‌క్లెయిమర్…. యూనియన్ల పేరిట ఆ కార్మికనేతలు సాగించే అరాచకాల్ని ‘ముచ్చట’ సమర్థించడం లేదు..!! అదేసమయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ వ్యవహారాల్లో వేళ్లు కాళ్లు పెట్టడాన్ని కూడా సమర్థించడం లేదు..!!
Share this Article