.
నిన్న ఈటీవీ ప్లస్‌లో రాత్రి చాలా బాగుంది అనే సినిమా వస్తోంది… వడ్డే నవీన్, శ్రీకాంత్ నటించారు… మాళవిక హీరోయిన్… ఈవీవీ సినిమా… పెద్దగా కథ అంతగా ఆకట్టుకునేలా లేకపోయినా… సినిమాలో ఎల్బీ శ్రీరాం పోషించిన గంటస్తంభం వెంకటేశ్వరరావు అనే ఒక విలక్షణమైన పాత్ర హైలైట్… ఆ పాత్ర సంభాషణలు కూడా చాలా డిఫరెంట్..!
వడ్డే నవీన్‌ను చూస్తుంటే అనిపించింది… మాంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే… అది ఎంట్రీ వరకే తప్ప నిలదొక్కుకోవడానికి పనికిరాదు కదా అని..! తండ్రి వడ్డే రమేష్ నిర్మాత… 1996 నుంచీ నవీన్ ఫీల్డులో ఉన్నాడు… కిందామీదా పడీపడీ 2006 దాకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు గానీ సక్సెస్ తన దరిదాపుల్లోకి కూడా రాలేదు…
Ads
పెళ్లి అనే ఒక్క సినిమా మాత్రం కాస్త పర్లేదు అనుకుంటా..! అదీ సుజాత, పృథ్విరాజ్ పోషించిన పాత్రలు, ఆ కథ, కొంతవరకూ కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ వల్లే..! 2006 తరువాత ఒకటీరెండు చిన్న చిన్న పాత్రలు వేశాడు… ఒకటోరెండో సినిమాల్ని తనే నిర్మించాడు…
2016లో ఎటాక్ అనే సినిమా… అంతే ఇక… తను పూర్తిగా తెరమరుగే అనుకున్నారందరూ… తాజాగా మళ్లీ తను హీరోగా, తనే ఓ సినిమా నిర్మిస్తున్నాడని వార్తలు వచ్చాయి…
చాలామంది కొత్తవాళ్లు, యువ హీరోలు వస్తున్నారు… సినిమా నవీన్‌ను దాటేసి చాలా ముందుకు పోయింది… ఫస్ట్ ఇన్నింగ్సే ఒడిదొడుకులు… ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో జనం యాక్సెప్టెన్స్ ఏమేరకు లభిస్తుందో చూడాల్సిందే…
ఎందుకంటే..? తన ఫేస్ కట్ మారిపోయింది… మరీ ఇప్పటి హీరోల టైపు మాస్ పాత్రలు, రొటీన్ కథలు గాకుండా, తనకు సూటయ్యే ఏదైనా లీడ్ రోల్ చేస్తే బెటర్… అబ్బే, 60, 70 లు దాటినా సరే, అంతటి సీనియర్లు కుర్రవేషాలు వేస్తే చూడటం లేదా అంటారా..?
వాళ్లు వేరు… వాళ్ల ఇమేజ్ వేరు… ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు… వాళ్ల సినిమా కెరీర్‌లో గ్యాప్ లేదు… కంటిన్యూటీ ఉంది… కానీ వడ్డే నవీన్ ఎవరో ఈ తరానికి అసలు తెలియదు… అంత గ్యాప్ వచ్చింది, దాాదాపు పదేళ్లు… అందుకే ఆడియెన్స్ యాక్సెప్టెన్సీ డౌట్‌ఫుల్…
అన్నట్టు… నవీన్ నందమూరి ఇంటల్లుడు… ఎన్టీయార్ కొడుకు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు… తరువాత శృతి కుదరలేదు, విడాకులు తీసుకున్నారు… ఆ విడాకుల తరువాతే ఇండస్ట్రీలో తనను పట్టించుకునేవాళ్లు లేక, అవకాశాల్లేక తెరమరుగు అయ్యాడంటారు మరి..!
Share this Article