.
పార్థసారథి పొట్లూరి…. మొదటి భాగం తరువాయి… పుతిన్, ట్రంప్ మధ్య చర్చల కోసం 7 గంటల సమయాన్ని కేటాయించారు కానీ అది రెండు గంటలలోపే ముగిసిపోయింది!
ఇంతకీ చర్చలతో ఏం సాధించారు?
శిఖరాగ్ర సమావేశం అనేది పేరుకే కానీ సాధించింది శూన్యం!
పుతిన్ ఆధిపత్యం స్పష్టంగా కనపడింది!
Ads
1. చర్చల కోసం వేదిక ఎక్కడ ఉండాలి అని పుతిన్ స్వయంగా నిర్ణయం తీసుకుంటే దానిని ట్రంప్ ఆమోదించాడు!
2. చర్చలు అంటూ జరిగితే అవి జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నాయకులు లేకుండా జరగాలి అని పుతిన్ మొదటి నుండి అంటున్నాడు అదే జరిగింది.
3. పుతిన్ అలస్కాలో ట్రంప్ తో సమావేశం అయ్యింది ఉక్రెయిన్ లో తన మిలిటరీ ఆపరేషన్ ఆపడానికి కాదు.
4. ట్రంప్ కి అర్కిటిక్ ఖనిజ సంపద ఆశ చూపి భారత్ మీద విధించిన 50% టారిఫ్స్ ని ఏకపక్షంగా తొలగించడానికే సమావేశమయ్యాడు!
- 5. మూడు లేదా నాలుగు వారాలలోపే ట్రంప్ భారత్ మీద విధించిన టారిఫ్స్ 5% శాతానికి తగ్గించడమో లేదా పూర్తిగా ఎత్తి వేయడమో జరుగుతుంది!
6. ప్రోటోకాల్ ప్రకారం ఆతిధ్య దేశ అధ్యక్షుడు చర్చల అనంతరం మీడియాతో సమావేశం అయ్యి విలేఖర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు, కానీ అలస్కాలో ముందు పుతిన్ విలేఖరులతో మాట్లాడిన తరువాత ట్రంప్ మాట్లాడాడు! ఇది ప్రోటోకాల్ కి విరుద్ధంగా జరిగింది అంటే పుతిన్ ఎంతలా ఆ సమావేశం డామినేట్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు.
వెస్ట్రన్ మీడియాలో ఇదే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి, అంటే ట్రంప్ ఎందుకు అలా పుతిన్ ముందు మోకరిల్లాడు అంటూ… బహుశా జెఫ్రీ ఇప్స్టీన్ ఫైల్స్ విషయంలో ట్రంప్ మెడ మీద కత్తి వేలాడుతున్నది అని పుతిన్ కి తెలుసు. ఒకవేళ అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మానేజ్ చేసినా పుతిన్ దగ్గర ట్రంప్ దోషి అని నిర్ధారించగలిగిన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ కి తెలుసు!
7. పుతిన్ ఒక విజయవంతమైన గూఢచారిగా పనిచేసి తరువాత KGB లో అత్యున్నత స్థానానికి ఎదిగి, ఆపై రష్యా అధ్యక్షుడు అయ్యాడు. పుతిన్ రాజకీయవేత్తగా మారిన గూఢచారి! ట్రంప్ సినిమా నటుడు, వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయాలలోకి ప్రవేశించిన సగం రాజకీయ నాయకుడు…
8. తన విలేఖరుల సమావేశాన్ని క్లుప్తంగా ముగిస్తూ ట్రంప్ వైపు చూస్తూ పుతిన్ అన్న ఆఖరి మాట ఇది… we will meet in moscow soon. మనం త్వరలో మాస్కోలో కలుద్దాం అంటూ ట్రంప్ వైపు చూస్తూ అన్నాడు! అంటే తరువాతి సమావేశం కూడా ఎక్కడ జరగాలో తానే నిర్ణయం చేసి అదే విషయాన్ని విలేఖరుల ముందు ట్రంప్ కి చెప్పేశాడు పుతిన్!
పుతిన్ ఎందుకిలా చేశాడు?
జస్ట్! భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొంటూ పరోక్షంగా ఉక్రెయిన్ లో పుతిన్ మారణ హోమం సృష్టించడానికి సహకరిస్తున్నది అని ట్రంప్ తోపాటు యూరోపియన్ నాయకులు భారత్ పైన నిందలు వేయకుండా ఆపడానికే!
మీకంతగా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపడం మీద శ్రద్ధ ఉంటే మాస్కో రండి చర్చలు జరిపి పరిష్కరించుకుందాం అంటూ సవాల్ విసిరాడు ఇంటర్నేషనల్ మీడియా ముందు!
What next?
అటు యూరోపియన్ యూనియన్ నాయకులు కానీ ఇటు ట్రంప్ కానీ భారత్ రష్యా నుండి ఆయిల్ కొంటున్నది కాబట్టే రష్యా ఆర్ధికంగా నిలదొక్కుకొని ఉక్రెయిన్ లో యుద్దాన్ని కొనసాగిస్తున్నది అనే విమర్శలు ఆపేసి నేరుగా మాస్కోకి ఎప్పుడు వెళుతున్నారు అని ట్రంప్ ని అడగడం మొదలు పెడతారు!
******************
నేను అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు! డోనాల్డ్ ట్రంప్ పశ్చాతాపం!
ప్రస్తుత ఉక్రెయిన్ సమస్య అనేది నా ముందరి ప్రభుత్వం ( డెమో- జో బిడెన్) వల్ల ఏర్పడింది. అదే నేను అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఇంతదాకా రానిచ్చేవాడిని కాదు అని అన్నాడు!
నిజమే! ట్రంప్ కి పుతిన్ కి ఉన్న సన్నిహిత సంబంధం డీప్ స్టేట్ కి తెలుసు కాబట్టే రిగ్గింగ్ చేసి ట్రంప్ ని ఓడించారు.
ట్రంప్ ని నాలుగేళ్లు దూరం పెట్టడం వల్లనే కదా.. అవుట్ డేట్ అయిపోయిన F-16, హిమార్స్ రాకెట్లు లాంటి వాటిని ఉక్రెయిన్ కి పంపించి వాటి స్థానంలో కొత్త మోడల్స్ ని యూరోపు దేశాల చేత కొనిపించే అవకాశం దొరికింది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ కి!
*****************
భారత్ కోసం అలస్కా వచ్చి టారిఫ్ లని తగ్గించే నిర్ణయం తీసుకునేట్లుగా చేసిన వ్లాదిమిర్ పుతిన్ కి భారతీయులు ధన్యవాదములు చెప్పాల్సిన అవసరం ఉంది!
ఇరాన్ సంక్షోభంలో ఉన్నా పుతిన్ మాస్కో కదిలి రాలేదు!
అదే భారత్ సంక్షోభంలో పడబోతున్నది అని తెలియగానే వెంటనే కదిలి వచ్చాడు, అంటే ప్రపంచంలో వేరే ఏ దేశానికి ఇవ్వని ప్రాధాన్యత భారత్ కి ఇచ్చాడు పుతిన్!
అలస్కా శిఖరాగ్ర సమావేశం అనేది భారత్ కోసమే!
థాంక్స్ Mr. పుతిన్!
Share this Article