.
మాస్ మీడియా… నాటకాలు, బుర్రకథ, హరికథ, ఒగ్గుకథ… ఇలా రకరకాల కళారూపాలు… ఒకప్పుడు సినిమా… కానీ ఇప్పుడు సినిమా ఖరీదైన, అవాంఛనీయ వినోదంగా మారిపోయాక… టీవీయే ప్రధాన వినోదసాధనం…
వోకే, అడ్డమైన సీరియళ్లు… అత్యంత నాసిరకం కళాప్రదర్శన… ఆ చర్చ వేరు… జబర్దస్త్ వంటి బూతు, అశ్లీల, డర్టీ షోలు, ఆ చర్చ కూడా వేరు… కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో క్రియేటివ్ టీమ్స్ కూడా సున్నితమైన విషయాల్లో అదుపు తప్పి, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి… అదీ విషాదం…
Ads
తెలుగు వినోద చానెళ్లలో మరీ మూడో స్థానానికి చేరుకున్నా సరే… ఈటీవీ పోకడలు మాత్రం మారడం లేదు… మథనం లేదు, దిద్దుబాటు లేదు… కనీసం సొసైటీ పట్ల కాస్త బాధ్యత చూపాలన్న సోయి కూడా లేదు…
ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ స్కిట్ చేశారు… అదేమిటీ అంటే… ఓ కుటుంబం, భార్యాభర్తలకు క్షణం పడదు… గొడవలు… పిల్లలు భయపడిపోతుంటారు… అమ్మా, అయ్యా, అలా కొట్టుకోకండి, మాకు భయమేస్తుంది అని చెప్పినా ఫలితం లేదు…
విడాకులు తీసుకుంటారు… బిడ్డ తండ్రికి, కొడుకు తల్లికి… విడిపోయి ఉండటం ఇష్టం లేక ఆ పిల్లలు ఓ లేఖ రాసి, శివలింగం ఎదుట సూసైడ్ చేసుకుంటారు… ఆ ఇద్దరూ స్కూలింగ్ పిల్లలే… తరువాత ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు… ఇదీ స్కిట్…
ఎస్, విడాకులు పిల్లలను డిస్ట్రబ్ చేస్తాయి… విడదీస్తాయి… ఆ ప్రభావం వాళ్లపై మానసికంగా జీవితాంతం ఉంటుంది… నిజమే… కానీ విడాకులు ఇవ్వాళారేపు కామన్… ఒకరికొకరు పడకుండా, అలాగే జీవితాంతం కీచులాడుకుంటూనే గడపడంకన్నా విడిపోవడమే కరెక్ట్…
పంచాయితీలతోనే లైఫ్ అలా గడుపుతుంటే… ఆ ప్రభావం పిల్లలపై మరింత ఎక్కువగా ఉంటుంది… పైగా కాలం మారుతోంది… గతంలోలాగా భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి భరించే గుణం లేకుండా పోయింది… అహాలు కుటుంబాలను దెబ్బతీస్తున్నాయి… అంతెందుకు.,.? అక్రమ సంబంధాలతో ప్రియులతో కలిసి భర్తలను, పిల్లలను కడతేరుస్తున్న కసాయిల కాలమిది…
సో, ఈ నేపథ్యంలో… విడాకులు తీసుకున్నవారి పిల్లలు విడిగా ఉండలేక సూసైడ్ చేసుకున్నట్టు చూపడం ఇన్‌సెన్సిటివ్.., సెన్సిబుల్ కూడా కాదు… అసలే చదువుల ఒత్తిడి భరించలేక పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు… ఇంకా ఇలాంటి ఆలోచనల్ని కూడా కొత్తగా రేకెత్తిస్తారా పిల్లల మనస్సుల్లో… దారుణం…
పైగా ఓ డిస్‌క్లెయిమర్… ఇది విజ్ఞానం కోసం మాత్రమే తప్ప బలవన్మరణాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు అని… ఆ సోయి ఉంటే, ఆ బుద్దే ఉంటే అసలు ఆ స్కిట్ చేసేవాళ్లే కాదు కదా… ఈ డిస్‌క్లెయిమర్లు మీరు లీగల్‌గా తప్పించుకోవడం కోసమే తప్ప నైతికంగా మాత్రం కాదు… పైగా ఇందులో విజ్ఞానం ఏముందిర భయ్..?
సీరియస్ స్కిట్లు చేయాలనే సంకల్పం మంచిదే… అది ఆ షో కేరక్టర్‌కు సూటవుతుందో లేదో… కానీ కాస్త పర్యవసానాలు ఆలోచించాలి… పైగా ఈ స్కిట్‌లో ఏవో పాత పాటలు రెండు పెట్టి, పిల్లలతో స్టెప్పులు వేయించి… ఛ, నాసిరకం ప్రజెంటేషన్… అఫ్‌కోర్స్, ఆ ఇద్దరు పిల్లలు బాగా నటించారు…!!
Share this Article