.
హరగోపాల్ ఏనాడో తన క్రెడిబులిటీని కోల్పోయాడు, ఈ మాట అనడానికి పెద్ద సంకోచం ఏమీ అక్కర్లేదు… అశాంతిని తగ్గించడానికి క్రియేట్ చేసేవాడు సమాజహితుడు… పెట్రోల్ పోసి మరింత మంట పెట్టేవాడు సోకాల్డ్ మేధావి…
ఎస్, మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం మీద సోకాల్డ్ మేధావుల తీరు మీదే అంటున్నది… మనమూ వలస పోతున్నాం, వాడూ వలస వస్తున్నాడు… కడుపు కోసం… అంతేతప్ప, వనరుల దోపిడీ కోసం కాదు, అధికారం కోసం కాదు… వాడి మీద ద్వేషం పెంచడం ఏమిటి..?
Ads
స్ట్రెయిట్ అవే హరగోపాల్‌కు ఓ ప్రశ్న… మార్వాడీల నోట్ల కోసం కక్కుర్తి పడుతున్నవాళ్లెవరు..? ప్రజల వోట్లను పణంగా పెడుతున్నది ఎవరు..?
ఎస్, మార్వాడీలు ఇప్పుడే కాదు, ఏనాటి నుంచో ఈ గడ్డకు తమ కడుపు నింపుకోవడం కోసం వస్తున్నారు… ఒక నిజాన్ని అంగీకరిద్దాం… స్థానిక వ్యాపారుల పొట్టగొట్టేవా విస్తరిస్తుంటే వ్యతిరేకిద్దాం.,. సర్దుబాట్లు చేద్దాం… ఆమనగల్లులో జరిగింది అదే…
కొన్నేళ్ల క్రితం ఓ ఒప్పందం కుదిరింది, మా పొట్టగొట్టేలా మీ దుకాణాలను విస్తరించొద్దు అని వర్తకసంఘాలు అడిగాయి, వాళ్లు అంగీకరించారు, కానీ ఉల్లంఘించారు… అదీ రీసెంట్ మార్వాడీ గోబ్యాక్ నినాదం వెనుక అసలు కారణం…
ఇంకేముంది..? ఎవరెవరో రంగప్రవేశం చేశారు, ఉసిగొల్పారు… అశాంతిని క్రియేట్ చేయడానికి మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ప్రయత్నాలు చేశారు… ఎస్, బండి సంజయ్ చెబుతున్నట్టు వాళ్లు రోహింగ్యాలు కాదు… బంగ్లా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు కాదు… అన్‌రెస్ట్ క్రియేట్ చేసే కేరక్టర్లు కారు…
ఈరోజు ఏ కులవృత్తి చూసినా ఆ కులేతరులు ఎంటర్ అవుతున్నారు… ఆమనగల్లు వర్తకసమాజం ఓ ఒప్పందం కుదుర్చుకుంది, సరైన దిశ… కానీ మార్వాడీలు ఉల్లంఘించారు, అది తప్పు, తప్పున్నర, ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినవాడు మన పొట్ట కొడుతుంటే ఎవడు ఊరుకుంటాడు..? ఆగ్రహం సహజం…
ఇదుగో ఇక్కడే మార్వాడీ సమాజం (రాజస్థాన్, గుజరాత్ ఏ రాష్ట్రమైనా సరే…) తన తప్పు తెలుసుకోవాలి… స్థానిక వ్యాపారులు, స్వర్ణకారులతో కలిసి బతకాలనే సోయి అవసరం… అసలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాలు వచ్చాక సగటు గ్రామీణ వర్తకుడే కాదు, పట్టణాల్లోని వర్తకుడే కిందామీదా పడుతున్నాడు…
తన కడుపు నింపుకోవడానికే కష్టమవుతోంది… ఈ స్థితిలో మార్వాడీలు కూడా పొట్టగొడితే అది అన్యాయం, దుర్మార్గమే… జీఎస్టీ ఎగవేస్తారు, నాసిరకం అంటగడతారు అనే ప్రచారాల్ని పట్టించుకోకపోతే… మార్వాడీలు అధికారం కోసమో, పెత్తనాల కోసమో అంగలార్చడం లేదు…
మేమిక్కడికి బతకడం కోసం వచ్చాం అనే సోయిని కలిగి ఉంటే పర్లేదు… భిన్నంగా వెళ్తే ఇదుగో ఇలాగే మంటలు పెట్టేవాళ్లు ఉంటారు… ఆమనగల్లులో ఏం జరిగింది…? బంద్ నేపథ్యంలో ప్రభుత్వం ఎంటరైంది.,..
ఈ ఆమనగల్లు బంద్ తెలంగాణ వ్యాప్తంగా అన్‌రెస్ట్ క్రియేట్ చేస్తుందనే భావనతో… పోలీసులను పంపించింది… సయోధ్య కుదరింది, బంద్ లేదు… అంతా ప్రశాంతం… మంటలు పెచ్చరిల్లాలని చూసిన అసాంఘిక శక్తులకు చుక్కెదురు…
ఇక్కడ ప్రధానంగా వైశ్య సంఘాలు (వర్తకసంఘాల్లో ఎక్కువ వాళ్లే కాబట్టి) సంయమనం పాటించాలి… అసాంఘిక శక్తులకు ఊతమిచ్చేలా వ్యవహరించకూడదు… ఈరోజు మార్వాడీ గోబ్యాక్ అని మీరంటే, రేప్పొద్దున మీరు ప్రోత్సహించే శక్తులే కోమటీ గోబ్యాక్ అనే ప్రమాదమూ ఉంటుంది… బహుపరాక్…
సమాజాన్ని చీల్చే కుట్రలు ఇవన్నీ… ఇప్పటిదాకా ఉన్న గొడవలు చాలవని, ఇంకా ఇంకా చాలామంది కొత్త ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు… బహుపరాక్..!! ఈ మార్వాడీ ఇష్యూను తెలంగాణ సొసైటీలో మరింత అశాంతి రేపడానికి ప్రయత్నించిన రాజకీయ, అసాంఘిక శక్తులకు తాత్కాలిక సెట్‌బ్యాక్… కానీ అవి ఊరుకోవు…!! జాగరూకతతో ఉండాల్సింది తెలంగాణ సమాజమే..!!
Share this Article