.
పదే పదే అదే వెకిలితనం, రోత… జబర్దస్త్ షో కేరక్టర్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, అది సరేసరి… కానీ పండుగల వేళ ప్రసారం చేసే స్పెషల్ షోలకూ అదే వెగటు ధోరణి అవసరమా..? కనీసం పండుగల వేళనైనా కాస్త తెలివిడి, విజ్ఞత ప్రదర్శిస్తే బాగుంటుంది…
ఎప్పటికప్పుడు ఈ ఆశను మృగ్యం చేస్తుంది ఈనాడు, అందులో దానికి తిరుగులేదు… ఓం గణేశా అని వచ్చే వినాయకచవితి కోసం ఓ స్పెషల్ షూట్ చేశారు, ప్రోమో రిలీజ్ చేశారు… అది చూశాక అసహ్యం కలిగింది…
Ads
పక్కా జబర్దస్త్ బాపతు ఓ స్కిట్… సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్, ఫైమా, మరో లేడీ గెటప్ శాంతి స్వరూప్… అక్రమ సంబంధం బాపతే… జబర్దస్త్‌కన్నా రోత… అఫ్‌కోర్స్, ఇలాంటి పాత్రల్ని సుధీర్ బాగానే చేస్తాడు, ఫైమా ఫైరే కదా… ఎటొచ్చీ కంటెంటే మరీ… వాయిక్… ఆ స్కిట్‌లో ఆ ఇద్దరు గృహిణులు చేసుకున్నట్టుగానే… సుధీర్, ఫైమా, శాంతి కాస్త చాటుకు వెళ్లొస్తారు, బయటికి రాగానే కడుపొచ్చిన వాంతులు… ఇది ఏం స్కిట్‌రా బాబూ..?
మరీ ఇప్పుడు జనసేన అన్నా, పవన్ కల్యాణ్ అన్నా, నాగబాబు అన్నా ఈటీవీకి మస్తు ప్రేమ పుట్టుకొచ్చింది కదా… మరి రాజకీయ బాంధవ్యాలు కదా ఇప్పుడు… ఇక చూసుకో నాగబాబు, మొన్నామధ్య ఓ స్పెషల్ షోలో నాగబాబు భజన, చివరకు ఈ వినాయక చవితి స్పెషల్‌లోనూ భజనే… పైగా హైపర్ ఆది ఉండనే ఉన్నాడు, ఉంటాడు…
30 ఇయర్స్ సెలబ్రేషన్లకు అతిరథ మహారథులెందరు వచ్చినా చిరంజీవితోనే కేక్ కటింగ్, ప్రత్యేక స్వాగతం, అమిత ప్రాధాన్యం, మెగా గ్రేస్ పేరిట స్కిట్స్, స్వీయ డాన్స్ ఎట్సెట్రా… ఈటీవీ ఇప్పుడు మెగా టీవీ..! సరే, అది వాళ్లిష్టం గానీ… ఈ పండుగ స్పెషల్‌కు వద్దాం…
సుధీర్ 12 ఏళ్ల జబర్దస్త్ వేడుకకు ఎందుకు రాలేదో పదే పదే హైపర్ ఆది ఈటీవీ షోలలో అడుగుతూనే ఉన్నాడు, ఏదో కామెంట్ చేస్తూనే ఉన్నాడు… ఈ షోలోనూ అదే… సుధీర్‌ను వద్దనుకున్నది మల్లెమాల… జబర్దస్త్ నిర్మాతలు మల్లెమాల… తను రావద్దు అనుకున్నాడు, తన ఇష్టం కదా… ఈటీవీని వద్దనుకోలేదు సుధీర్, జ్ఞాపిక వాళ్ల ప్రొడక్ట్స్‌లో చేస్తూనే ఉన్నాడు… పదే పదే దాన్ని హైపర్ ఆది గోకడం, దాని మీద ఓ సెటైర్ దేనికి..?
పైగా ఏ షో తీసుకున్నా సరే, రష్మి, సుధీర్ తెర ప్రేమ యవ్వారం గురించి ప్రస్తావన ఉండాల్సిందేనా..? ఆమె షో వేరు, సుధీర్ షో వేరు అనే ప్రస్తావన శుద్ధ అసందర్భం, అనవసరం… ఎవరి అవసరాలు వాళ్లవి… కానీ రష్మితో జబర్దస్త్ యాంకరింగ్ చేస్తున్నాను అని టీవీ నటుడు, హోస్ట్ మానస్ చెబుతుంటే… నువ్వు కేవలం యాంకరింగ్, నేనయితే అని పాజ్ ఇస్తాడు సుధీర్… ఆమె పట్ల సినిమా ఫంక్షన్లలో, టీవీ షోలలో గౌరవాన్ని చూపిస్తూనే, ఏ వెకిలి కామెంటూ చేయకుండా, తన ఎదుగుదలలో తన సహకారం ఉందని చెప్పు సుధీర్ నోటి వెంట ఏమిటీ డైలాగ్..?
Share this Article