Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేంద్ర ప్రభుత్వం వదల్లేదు… రాత్రంతా ఇస్రో శోధిస్తూనే ఉంది… తరువాత..?!

August 22, 2025 by M S R

.

ఇస్రో ఎలా శుభాంశ్ శుక్లాను కాపాడిందో చెప్పుకున్నాం కదా ఇంతకుముందు…   ఇంకొన్ని వివరాలు కూడా చెప్పుకోవాలి ఓసారి…

1. ఇస్రో చైర్మన్ ఉస్మానియా యూనివర్శిటీ స్నాతకోత్సవానికి వచ్చి, అక్కడ ఈ వివరాలు వెల్లడించాడు… ఇంపార్టెన్స్ ఉంది… శుభాంశ్ శుక్లా రీసెంట్ హీరో మనకు… పైగా అంతరిక్ష వార్త…

Ads

కానీ ఒక్క తెలుగు మీడియా ఇస్రో చైర్మన్ స్వయంగా చెప్పిన ఈ పాయింట్ పట్టుకోలేకపోయింది… తను ట్వీట్ పెట్టాడు కూడా… అదీ గమనించలేదు… పైగా హైదరాబాద్ పీటీఐ రిపోర్టర్ దాన్ని సకాలంలోనే ఫైల్ చేశాడు… దాన్నీ ఏ మీడియా హౌజూ సరిగ్గా పట్టుకోలేదు… నిన్న సాయంత్రమే ఇంగ్లిష్ సైట్లు కవర్ చేశాయి, ఐనా మనవాళ్ల బుర్రలు వెలగలేదు… ఎంతసేపూ ఆ దిక్కుమాలిన పొలిటికల్ సుత్తి తప్ప మరేమీ పట్టడం లేదు…

వాడిని వీడు తిట్టాడు, వీడు వాడిని తిట్టాడు అనే సొల్లు వార్తలు తప్ప ప్రజెంట్ జనరేషన్‌కు ఆసక్తికరమైన అంశాలు ఏమిటో కూడా ప్రజెంట్ మీడియా పెద్దల బుర్రలకు అర్థమవుతున్నట్టు లేదు… నిజానికి ఇది ఫస్ట్ పేజీ వార్త…

2. రేపు రాకెట్ ప్రయోగిస్తారు అనగా, ముందు రోజు ఫ్యుయల్ లీక్ గమనించారు… స్పేస్‌ఎక్స్‌ను అలర్ట్ చేశారు మనవాళ్లు… వాళ్లు లైట్ తీసుకున్నారు… కానీ అదేమో ప్రైవేటు స్పేస్ ఏజెన్సీ… పైగా ఎలన్ మస్క్ అనే పెద్ద మనిషిది, అమెరికా రాజకీయాల్నే ప్రభావితం చేసేంత కెపాసిటీ, స్ట్రేచర్ తనది… ఇస్రో 14 ప్రశ్నలు వేస్తే ఒక్క దానికీ స్పేస్‌ఎక్స్ దగ్గర జవాబు లేదు… 40 ఏళ్ల సర్వీస్ ఇస్రో చైర్మన్ నారాయణన్‌ది, అందుకే ప్రమాదం ఏమిటో తెలుసు తనకు, వదల్లేదు…

సో, పీఎంవో దాకా ఇష్యూ పోయింది… భారత ప్రభుత్వం అంతా వాళ్లు చూసుకుంటారు అనుకుని వదిలేయలేదు… ఫాలోఅప్ చేసింది… దాంతో ఇస్రో నిపుణుల బృందం రంగంలోకి దిగింది… రాత్రంతా మేల్కొని థరోగా ఇన్వెస్టిగేట్ చేసింది… దాంతో ఓ పగులు దొరికింది, ఓ రోజు రాకెట్ ప్రయోగం వాయిదా వేసి, తరువాత ప్రయోగించారు…

ఇక్కడ స్పేస్‌ఎక్స్ పాజిటివ్‌గా తీసుకుంది… తమ కార్యకలాపాల్లో ఎంటర్ కావడానికి ఇస్రోను అలో చేసింది… ఇన్స్యూరెన్స్ ఏజెన్సీలు కూడా..! మొత్తానికి ప్రాజెక్టు సుఖాంతం…

3. ఇస్రో చరిత్ర సృష్టించబోతుంది: ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ …. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన ప్రాజెక్టులలో నావిక్ (NAVIC – Navigation with India Constellation) వ్యవస్థకు సంబంధించిన ఉపగ్రహం, N1 రాకెట్ ప్రయోగాలు ఉన్నాయనీ, అంతేకాకుండా, 6,500 కిలోల బరువున్న అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారతీయ రాకెట్లను ఉపయోగించి కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నారాయణన్ చెప్పాడు…

2035 నాటికి 52 టన్నుల బరువున్న అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతున్నామని, ప్రస్తుతం శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ పనులు జరుగుతున్నాయని నారాయణన్ పేర్కొన్నాడు… “ప్రస్తుతం మేము 75,000 కిలోల బరువును కక్ష్యలోకి పంపేందుకు ఒక రాకెట్‌ను రూపొందిస్తున్నాం… ఈ రాకెట్ 40 అంతస్తుల భవనం ఎత్తు ఉంటుంది…” అని వివరించాడు…

ప్రస్తుతం భారతదేశానికి చెందిన 55 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయని, మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో ఈ సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందన్నాడు… 75 వేల కిలోల బరువును ఓ 40 అంతస్థుల ఎత్తయిన భవనం వంటి రాకెట్‌ను ప్రయోగిస్తే ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో ఇస్రో ఓ రికార్డు క్రియేట్ చేస్తుంది…

ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి సంస్థ ఇస్రో.., ఆల్రెడీ ఆ రికార్డు ఉంది… మనం సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే… ఈ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా నారాయణన్‌కు గౌరవ డాక్టరేట్ (డాక్టరేట్ ఆఫ్ సైన్స్) ప్రదానం జరిగింది… (ఇన్‌పుట్స్ పీటీఐ సౌజన్యం)...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాదేదీ అనర్హం… ఆధ్యాత్మిక రంగంలోకీ నార్త్ పంతుళ్లు వస్తున్నారు…
  • నువ్వు కేరళ ముఖ్యమంత్రివా..? కర్నాటక ముఖ్యమంత్రివా..?!
  • మీకేం తక్కువైంది..? ఇంకా ఎందుకు సర్ ఈ ప్రయాస..? వదిలేయండి…
  • వోట్ చోర్… అంతా తూచ్… అన్నీ అబద్ధపు వివరాలేనట…
  • డియర్ మెగాస్టార్ శ్రీమాన్ చిరంజీవి గారికి రాయునది ఏమనగా..!!
  • శిశుస్నానం… ఓ కళ… ఓ పరంపరాగత వైద్యం… ఓ అమ్మతనపు కవచం…
  • కేంద్ర ప్రభుత్వం వదల్లేదు… రాత్రంతా ఇస్రో శోధిస్తూనే ఉంది… తరువాత..?!
  • కాళేశ్వరం కమిషన్ చట్టబద్ధ ఏర్పాటు… ఆ రిపోర్టే చెల్లదు అనొచ్చా..?!
  • అప్పట్లో చెన్నై అద్దె జీవితాలు అంటేనే ఓ టెర్రర్… తప్పలేదు మరి..!!
  • ఆ రాకెట్ పేలిపోయేది… శుభాంశ్ శుక్లా ప్రాణాలు కాపాడిన ఇస్రో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions