.
ప్రధాని మోడీ తన పంద్రాగస్టు ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన, ప్రశంస తీసుకొచ్చాడు… అబ్బే, కాంగ్రెస్‌కు ఓ చరిత్ర ఉంది, ఆర్ఎస్ఎస్‌కు ఏముంది అని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎద్దేవా చేశాడు… కాంగ్రెస్ ధోరణికి తగినట్టే ఆ కామెంట్… సరే…
కానీ, ఆర్సీబీ విజయోత్సవాల్లో తను స్వయంగా పాల్గొని, జనం ఇంకా గుమిగూడటానికి, తొక్కిసలాటకు తనూ ఓ కారకుడయ్యాడని కర్నాటక బీజేపీ విమర్శించింది అసెంబ్లీలో… నిన్న తొక్కిసలాట విషయంపై చర్చ జరిగినప్పుడు…
Ads
వెంటనే… డీకే నమస్తే సదా వత్సలే అంటూ ఆర్ఎస్ఎస్ అధికారిక గీతాన్ని అందుకున్నాడు… పాడాడు… బీజేపీ సభ్యులు బల్లలు చరిచారు… కాంగ్రెస్ సభ్యులంతా సైలెంట్… వెంటనే నెట్‌లో రకరకాల ఊహాగానాలు… ఇంకేముంది..? కాంగ్రెస్ హైకమాండ్‌కు తను ఓ సంకేతం పంపించాడు అని… ఏమిటది..?
ఆల్రెడీ సీఎం పోస్టు కోరుకుంటున్నాడు కదా… సిద్ధరామయ్యను దింపేసి, నన్ను సీఎంను చేయకపోతే మరో షిండే అవుతాను అని పరోక్షంగా చెబుతున్నాడట… నో, నో, నాకు ఆర్ఎస్ఎస్ రాజకీయాలు తెలుసు, నేను కాంగ్రెస్‌లోనే పుట్టాను, పెరిగాను, ఇక్కడే ఉంటాను అని ఖండించాడు డీకే… బాగా గట్టిగా ఖండిస్తున్నాడంటే… ఏమో, ఏదో ఉంది…
ఎందుకంటే..? మాట్లాడితే మనువాదం, ఆర్ఎస్ఎస్ భావజాలం అంటూ వెక్కిరించడం, విమర్శించడం కాంగ్రెస్, దాని మిత్రపక్షాల స్టయిల్ ఇప్పుడు… అందుకే సందేహాలు… డీకే స్థాయి నాయకుడు ఏదో ఫ్లోలో ఆర్ఎస్ఎస్ గీతం అనాలోచితంగా ఆలపించడు… కానీ…
అహ్మద్ పటేల్ మరణించిన తరువాత కాంగ్రెస్‌లో ఆ పాత్ర పోషిస్తున్న డీకే శివకుమారే… తను అంత త్వరగా కాంగ్రెస్ పార్టీని వదిలేస్తాడని ఊహించలేం… తను పేరుకే డిప్యూటీ కానీ కర్నాటకలో చాలా వ్యవహారాలు తన చెప్పుచేతల్లోనే నడుస్తున్నాయి…
ఐతే ఇదే కర్నాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మరో వివాదం… వయనాడు నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం… ఎందుకు.,?
గత ఏడాది జూలైలో కొండచరియలు విరిగిపడి చాలామంది మరణించారు ఆ నియోజకవర్గంలో… అక్కడి ఎంపీ కదా, ప్రియాంక వాద్రా ఆదేశించింది… బాధితుల కోసం కర్నాటక ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది… కేరళలో ఓ ప్రభుత్వం ఉంది, బాధితుల గురించి అది చూసుకుంటుంది కదా… కర్నాటక ప్రభుత్వం ఎందుకు ఆ రాష్ట్ర వ్యవహారాల్లో వేలుపెట్టడం..?
ఒకరకంగా అక్కడి సీపీఎం ప్రభుత్వాన్ని కించపరచడం ఇది… సేమ్, అప్పట్లో కేసీయార్ వెళ్లి వేరే రాష్ట్రాల్లో రైతులకు పరిహారాలు గట్రా ఇచ్చి వచ్చాడు… ఇవి ప్రియాంక వాద్రా సొంత డబ్బు కాదు, కేసీయార్ సొంత డబ్బు కాదు… అవి కర్నాటక ప్రజల సొమ్ము, ఇవి తెలంగాణ ప్రజల సొమ్ము… ఐనా ఖర్చు చేస్తూనే ఉంటారు…
నువ్వు కర్నాటక ముఖ్యమంత్రివా, కేరళ ముఖ్యమంత్రివా అని కర్నాటక బీజేపీ సిద్ధరామయ్యను ఎద్దేవా చేసింది… కాంగ్రెస్ కదా, సహజంగానే దులిపేసుకుంది… అదంతే…!! అవునూ, డీకే మీద బీజేపీకి ఏమైనా ఆశలున్నాయా అమిత్ షా గారూ..?!
Share this Article