Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్ వాయిస్‌పై కుట్ర… *నమస్తే సర్వర్లపై సైబర్ అటాక్..!

August 24, 2025 by M S R

.

హెడింగ్ చదివేసి… మరీ యూట్యూబ్ థంబ్ నెయిళ్లు అర్థం చేసుకునే తరహాలో… ఏ మోడీయే ఏ కొత్త పెగాసస్ మాల్వేర్‌నో ప్రయోగించి, కుట్ర పన్నాడా..? లేక రేవంత్ రెడ్డి ఏమైనా కుట్ర చేసి సైబర్ అటాక్  చేశాడా..? వద్దు, వాళ్లకేమీ సంబంధం లేదు…

డబుల్ ఇంజన్, ట్రబుల్ ఇంజన్ అని మోడీ మీద అక్షరాలా దుమ్మెత్తి పోస్తోంది కదా, ఇది బీజేపీ కుట్ర కావచ్చా… నో, నో, ఆగర్భశత్రువు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మీద రాజకీయ దురుద్దేశాలతో అక్షరదాడులు చేస్తోంది కదా ఇది తన కుట్ర కావచ్చా…

Ads

ఇక యుగాంతమే అన్నట్టుగా వికారాబాద్ నేవీ రాడార్ గురించిన ఉద్యమం, పోరాటం మొదలుకొని… అనేక అంశాల మీద పాకిస్థానీ క్షిపణుల్లాగా ఎన్ని ప్రాపగాండా పేజీలు ప్రయోగించినా పేలడం లేదు… అందుకని ఎవరైనా కుట్ర పన్నారా..? ఇలా అనుకోవడానికి ఏమీ లేదు…

ఫాఫం, కేసీయార్ క్యాంపు కూడా ఆ ఆరోపణలేమీ చేయడం లేదులెండి… రకరకాల రూపాల్లో కేసీయార్ సోషల్ మీడియా ప్రాపగాండా టీమ్స్ బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి మీద దాడులు యథేచ్ఛగా చేస్తూనే ఉన్నాయి కదా… మరి ఈ కేసీయార్ వాయిస్ మీద ఈ సైబర్ అటాక్ ఏమిటి..? ఈ కుట్ర ఏమిటి..? అంటారా..?

అరె, వెయిట్,వెయిట్… రుకో, జెర సబర్ కరో… కాస్త నిమ్మళంగా చెప్పుకుందాం… బహుశా నెల అయ్యిందేమో… నమస్తే తెలంగాణ సర్వర్లు స్థంభించిపోయాయి హఠాత్తుగా… టీన్యూస్ వ్యవస్థ వేరు కాబట్టి అది బాగానే ఉంది… బహుశా తెలంగాణ టుడే కూడా ఆగిపోయి ఉంటుంది… నమస్తే వ్యవస్థకు అనుబంధం కాబట్టి… సోషల్ ప్రాపగాండా నెట‌్‌వర్క్ కూడా వేరే…

ఏమైందయ్యా అంటే..? ఎవరో ప్రొఫెషనల్ హ్యాకర్ నమస్తే తెలంగాణ ఫైర్ వాల్స్ బ్రేక్ చేసి మరీ హ్యాక్ చేశాడు… వారం రోజుల్లో కంటాక్టులోకి రండి అని హెచ్చరిక కూడా పంపించాడు… అంటే దందా… బ్లాక్ మెయిలింగ్… చాలా సంస్థలకు ఎదురయ్యే అటాక్సే ఇవి…

హ్యాకర్లు ఎప్పుడూ గాలిస్తూ ఉంటారు… వీక్ సిస్టమ్స్ కోసం… దొరకగానే హ్యాక్ చేసి, దందా షురూ చేస్తారు… అందుకని కొత్త కొత్త పవర్ ఫుల్ మాల్వేర్స్ రాకుండా, ఎవడి హ్యాకింగుకూ దొరకకుండా ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫైర్‌వాల్ సిస్టమ్స్ సమకూర్చుకుంటాయి అన్ని పెద్ద సంస్థల ఐటీ విభాగాలు… నమస్తేలో ఎక్కడో తేడా కొట్టి, హ్యాకర్‌కు దొరికిపోయింది…

ఇంటర్నల్‌గా చెక్ చేశారు, సైబర్ టీమ్స్ కూడా వచ్చి వెళ్లాయి, కేటీయార్ సొంత టీమ్స్ చూసి వెళ్లాయి… తీరా చూస్తే ఎవరో రష్యా నుంచి హ్యాక్ చేసినట్టు ప్రాథమికంగా అంచనా… ఏమో, హ్యాకర్ అదీ సరిగ్గా తెలియనివ్వడు కదా… ఇక తప్పనిసరై అప్పటికప్పుడు టెంపరరీగా ఆల్టర్నేట్ అరేంజ్‌మెంట్స్ చేసుకుని బండి నడిపిస్తూ ఉన్నారు…

కానీ సొల్యూషన్..? పాత సర్వర్లు మార్చుకోవల్సిందే… కొత్త సర్వర్లు తీసుకోవాలి, ఎప్పటి నుంచో కొత్తవి కావాలని ఐటీ టీమ్ అడుగుతోందట కానీ కోట్ల ఖర్చు… కేసీయార్ వోకే అనడం లేదు… తన ఆరోగ్యం బాగుండటం లేదు… యాక్టివ్‌గా లేడు…

సీఎండీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు… ఈలోపు అధికారమూ పోయింది… ఏదీ సెట్ రైట్ కావడం లేదు… అప్పట్లో ఎడాపెడా సర్క్యులేషన్ చూపించి, అడ్డగోలు యాడ్స్ ఇచ్చారు, నడిచింది… ఇప్పుడదీ లేదు…  ప్చ్, పార్టీ బాధ్యతలను మెల్లిగా తన చేతుల్లోకి తెచ్చుకుంటున్న కేటీయారే దీన్ని కూడా సీరియస్‌గా పట్టించుకుంటే గానీ… నమస్తే సిస్టం ఓ గాడిన పడదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… కేటీయార్ ప్రేమించిన కంచె ఐలయ్య కాంగ్రెస్ సలహాదారా..?!
  • వాట్సప్‌లో పెళ్లిపత్రిక వచ్చిందా..? వెంటనే క్లిక్ చేయకండి, ఆరిపోతారు..!!
  • ఆహా… సబ్‌స్క్రయిబ్ చేయాలంటేనే ‘అల్లాడిస్తున్నారుగా’…
  • కేసీయార్‌కు కుదుటపడని ఆరోగ్యం… తరచూ ఏవో సమస్యలు..!?
  • ‘సోషల్ పొల్యూషన్’… కంట్రోల్ చేయలేమా..? మనల్ని కాపాడుకోలేమా..?
  • కేసీయార్ వాయిస్‌పై కుట్ర… *నమస్తే సర్వర్లపై సైబర్ అటాక్..!
  • నొటోరియస్ పొలిటిషియన్… బీహార్ అరాచకీయాల్లో మరవలేని పేరు…
  • ఓ అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు కూడా…
  • ఈమె కూడా ఓ గంధర్వగాయని..! కానీ ఆ ఇద్దరికే దక్కిన తెలుగు అభిమానం..!
  • రేవంత్ తెలివైన ఎత్తుగడ… ఇద్దరు ప్రత్యర్థులపైనా పైచేయికి చాన్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions