.
ఓ కరడుగట్టిన టెర్రరిస్ట్ నేతకు సాక్షాత్తూ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ధన్యవాదాలు చెప్పాడా..? పాకిస్థాన్‌తో శాంతి చర్చల పేరిట నొటోరియస్ టెర్రరిస్టు నేతలతో సంప్రదింపులకు ఇండియన్ గూఢచార వర్గాలు ప్రయత్నించాయా..?
యావజ్జీవం అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) ఉగ్రవాద నేత యాసిన్ మాలిక్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి… 2006లో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా లష్కరే తోయబా స్థాపకుడు, 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ను తను కలిసిన తరువాత, అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తనను వ్యక్తిగతంగా అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు అని మాలిక్ ఓ అఫిడవిట్‌లో పేర్కొన్నారు…
Ads
ఇంటెలిజెన్స్ బ్యూరో పాత్రపై ఆరోపణలు
2025 ఆగస్టు 25న ఢిల్లీ హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో మాలిక్ ఈ విషయాలు పేర్కొన్నాడు… తన వెర్షన్ ఏమిటంటే..? 2005లో కాశ్మీర్‌లో సంభవించిన పెద్ద భూకంపం తరువాత… పాకిస్తాన్ పర్యటించి, పాకిస్తాన్ రాజకీయ నేతలతో పాటు ఉగ్రవాద సంస్థల నేతలను కూడా కలవాలని, అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) స్పెషల్ డైరెక్టర్ వి.కె. జోషి తనను కోరాడు…
వారితో చర్చలు జరిపితేనే శాంతి ప్రక్రియకు ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించింది… అందుకే నేను హఫీజ్ సయీద్ సహా యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ నేతలను కలిశాను…
హఫీజ్ సయీద్‌తో భేటీ – శాంతి సందేశం
పాకిస్తాన్ పర్యటనలో హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాను.., “శాంతిని ఆమోదించండి” అని భారత ప్రభుత్వం తరఫున ఉగ్రవాదులకు శాంతి సందేశం ఇచ్చాను… “మీకు శాంతికి అవకాశం వస్తే, ఆ శాంతిని అంగీకరించండి” అనే మతబోధను కూడా చెప్పాను…
మన్మోహన్ సింగ్‌ను కలిసిన అనంతరం
భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, మొదట IB ప్రత్యేక డైరెక్టర్ జోషికి వివరాలన్నీ చెప్పాను, ఆయన వెంటనే నన్ను ప్రధానిని కలవాలని చెప్పాడు… వెళ్లాను… ఆ భేటీకి అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్ కూడా హాజరయ్యాడు…
ఈ సమావేశంలో, ప్రధాని మన్మోహన్ సింగ్ తన కృషికి అభినందనలు తెలుపుతూ, “మీరు శాంతియుత కాశ్మీర్ ఉద్యమానికి పిత” అనే వ్యాఖ్యతో ధన్యావాదాలు చెప్పాడు…
ఇతర రాజకీయ ప్రముఖులతో సంబంధాలు
తన రాజకీయ ప్రస్థానం గురించి వివరించుకుంటూ, వి.పి. సింగ్ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఆరుగురు ప్రధానమంత్రుల పాలనలో కీలకంగా వ్యవహరించే అవకాశాలు (కశ్మీర్ అంశంలో) పొందాను, దేశీయ, అంతర్జాతీయ వేదికలపై నన్ను తరచూ ప్రోత్సహించారు…
రాజకీయ ప్రభావం – పెద్ద దుమారం?
ఈ ఆరోపణలు నిజమైతే… ఇది రాజకీయ దుమారమే.., ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్‌పై ఉగ్రవాద, పాకిస్థాన్ మద్దతుదారు అనే ముద్ర వేస్తోంది… 2006లో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌తో శాంతి ప్రయత్నాల క్రమంలో ఉగ్రవాద సంస్థలతో చర్చలు జరిపేందుకు మాలిక్‌లాంటి ఉగ్రవాదులను ఎలా ఉపయోగించిందనేది దుమారం రేపే అవకాశాలున్నాయి… ముఖ్యంగా హఫీజ్ సయీద్‌ను కలిసిన తరువాత ఒక ప్రధాని తనను వ్యక్తిగతంగా అభినందించాడనే మాలిక్ వెల్లడించిన అంశం…
యాసిన్ మాలిక్‌పై ఉన్న ఆరోపణలు
గమనించాల్సిన విషయమేమిటీ అంటే… మాలిక్‌పై 1990లో శ్రీనగర్‌లో నలుగురు భారత వైమానిక దళ అధికారుల హత్య, అలాగే అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్ అపహరణ కేసు ఉన్నాయి, తనే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు… కాశ్మీరీ పండితుల ఊచకోత, అక్కడి నుంచి వెళ్లగొట్టడం వెనుక ఉన్నది తనే…
ఆల్రెడీ బీజేపీ నేతలు ఈ అఫిడవిట్ అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు స్టార్ట్ చేశారు కూడా… కాంగ్రెస్ నేతల నుంచి కౌంటర్లు ఇంకా స్టార్ట్ కాలేదు…! శాంతి చర్చలు తప్పు కాదు, కానీ టెర్రరిస్టులతో సంప్రదింపులూ తప్పుకాదు…
కానీ యాసిన్ మాలిక్ పాకిస్థానీ ఉగ్రవాదుల ప్రతినిధి అని ఈ అఫిడవిట్‌తో స్పష్టమైంది… పైగా నేరుగా దేశ ప్రధానే ఈ ప్రక్రియలో పాలుపంచుకోవడం, ఓ టెర్రరిస్టు నేతను, హిందూ పండిట్ల ఊచకోతలకు కారకుడిని అభినందించి, కీర్తించడం మాత్రం కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టినట్టే..!!
Share this Article