Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పటి హీరోలు ఎక్కువ సినిమాలు చేసేవాళ్లు, ఇండస్ట్రీ పచ్చగా ఉండేది…

September 21, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. 1+ 2 సినిమా అని చెప్పేదేముంది . ఇంత చక్కగా అందంగా ముగ్గురూ కనిపిస్తుంటే .

కృష్ణ , చిరంజీవి వంటి ఏక్షన్ హీరోల ఫేమిలీ- సెంట్రిక్ సినిమాలు హిట్ కావాలంటే కధ , కధనం , దర్శకత్వం చాలా బిర్రుగా ఉండాలి . 1986 డిసెంబర్లో వచ్చిన ఈ శాంతినివాసం సినిమాలో కధనం బలహీనంగా ఉండటం వలన సినిమా బలహీనంగానే ఆడినట్లు ఉంది . ఎబౌ ఏవరేజ్ సినిమా అని గుర్తు నాకు .

Ads

ఓ బుధ్ధిమంతుడైన సిన్సియర్ డాక్టర్ . ఆయనకో డాక్టర్ ప్రేయసి . హీరో గారికి తల్లిదండ్రులు వంటి అన్నావదినలు , వాళ్ళకో అల్లరి పాప . అన్న గారు ఊళ్ళో ఓ ధనవంతుడి మనమరాలిని తమ్ముడికి చేసుకోవటానికి అంగీకరిస్తాడు .

అన్నాతమ్ముళ్ళకు చిన్న గొడవ అవుతుంది కూడా . చివరకు అన్న ఒప్పుకుంటాడు . ఈలోపు విలన్ కుర్రాడు ప్రేయసిని మానభంగం చేయబోతే ఆమె నీళ్ళల్లో దూకేస్తుంది . పోలీసులు నీళ్ళల్లో గాలిస్తే హీరో గారిచ్చిన కానుక గొలుసు దొరుకుతుంది .

ఆమె చనిపోయిందని నిర్ధారణకు వచ్చి అన్న ఒప్పుకున్న ధనవంతురాలి మనమరాలిని పెళ్లి చేసుకుంటాడు హీరో . అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో అన్న కూతురు హఠాత్తుగా చనిపోతుంది . భార్య నిర్లక్ష్యం వలనే ఆ పాప చనిపోయిందని హీరో దేవదాసు అవుతాడు .

అప్పుడు పాత ప్రేయసి రంగప్రవేశం చేసి హీరో గారిని రిపేర్ చేసి మరలా జనజీవన స్రవంతి లోకి తెస్తుంది . తాను పేదలకు సేవచేయటానికి నిష్క్రమిస్తుంది . శుభం కార్డ్ పడుతుంది .

హీరో కృష్ణ , హీరోయిన్లు రాధిక, సుహాసిని అందంగా నటించారు . అన్నావదినలుగా సత్యనారాయణ , జయంతి , వాళ్ళ బిడ్డగా బేబీ సీత , ఇతర పాత్రల్లో కాంతారావు , గుమ్మడి , కోట శ్రీనివాసరావు , నూతన్ ప్రసాద్ , శ్రీలక్ష్మి , విలన్ కుర్రాడిగా బెనర్జీ , మిక్కిలినేని  ప్రభృతులు నటించారు .

సినిమా ఆ మాత్రం ఆడటానికి కారణం చక్రవర్తి సంగీత దర్శకత్వంలో శ్రావ్యమైన పాటలు , వాటి చిత్రీకరణ . పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ , పువ్వులా జీవితం నవ్వనీ ఈ క్షణం డ్యూయెట్లు బాగుంటాయి . సుహాసిని , కృష్ణ గ్రూప్ డాన్స్ చిత్రీకరణ ఇంకా బాగుంటుంది .

అనూరాధ క్లబ్ డాన్స్ తుమ్మెదా వాలరా హుషారుగా ఉంటుంది . సుహాసిని శ్రీమంతం పాట చిలకమ్మ శ్రీమంతం గోరింక ఆనందం చిత్రీకరణ కూడా సంసారపక్షంగా బాగుంటుంది . కృష్ణకు బాలసుబ్రమణ్యం ఇంకా పాడటం మొదలు కాలేదు . జేసుదాస్ , రాజ్ సీతారాం , సుశీలమ్మ , శైలజ , రమణ , సునందలు పాడారు .

  • కృష్ణ 242 వ సినిమా ఇది . మహానుభావులు యన్టీఆర్ , అక్కినేని , కృష్ణ , శోభన్ బాబు , చంద్రమోహన్ , కాంతారావులు . వందల సినిమాల్లో నటించి ఎంతో మంది చిన్నాచితకా ఆర్టిస్టులకు జీవనోపాధి కలిగించారు . ఇప్పుడు హీరోలందరూ రెండేళ్ళకో మూడేళ్ళకో ఓ సినిమా నటించి కోట్లు కోట్లు ఒక్కరే లోపల వేసుకుంటున్నారు . కేపిటలిస్ట్ కాలం కదా !

సినిమాలో సత్యానంద్ డైలాగ్స్ బాగుంటాయి . భీశెట్టి లక్ష్మణరావు కధను సమకూర్చగా జి రామమోహనరావు స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించారు . అంగర సత్యం నిర్మాత . సినిమా యూట్యూబులో ఉంది . It’s a neat feel good family movie . కృష్ణ అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . ఇతరులకూ చూడబులే .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?
  • అవునూ.., హీరో మెటీరియల్ ఏంటి తల్లీ..? ఈ చెత్తా ప్రశ్నలే జర్నలిజమా..?!
  • రిషబ్‌ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
  • చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
  • “యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
  • మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…
  • బ్లేమ్ గేమ్… బీసీ రిజర్వేషన్లపై పార్టీల పరస్పర నిందాపర్వం…
  • కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…
  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions