.
తమిళం గానీ, మలయాళం గానీ… దర్శకులు ప్రయోగాలకు సాహసిస్తారు… వివాదాలకు జంకరు… సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు… న్యూ జనరేషన్ ఫిలిమ్స్ ఆలోచిస్తారు… తెలుగులో, కన్నడంలో పెద్దగా ప్రయోగాలు కనిపించవు, మూస కథలు… దిక్కుమాలిన హీరోయిజం తప్ప మరొకటి కానరాదు…
తమిళంలో బ్యాడ్ గరల్ అని ఓ మూవీ… ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలు… వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టరుగా చేసిన వర్షా భరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది… సినిమాలో ప్రధాన పాత్ర అంజలి శివరామన్ పోషించింది…
Ads
ట్రెయిలర్ రిలీజ్ కాగానే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి… ప్రత్యేకించి ఒక సెక్షన్‌ను తప్పుగా పోట్రే చేశారంటూ దేశవ్యాప్తంగా అభ్యంతరాలు… పైగా కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి… మద్రాస్ హైకోర్టు కూడా ఆ ట్రెయిలర్‌ను యూట్యూబ్ నుంచి తీసేయాలని ఆదేశించింది…
కానీ పలు ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో చిత్రానికి ప్రశంసలు వచ్చాయి… నిర్మాత, దర్శకులకు ధైర్యం వచ్చింది… సెన్సార్ బోర్డుకు వెళ్లారు… బోర్డు కూడా కొన్ని కట్స్ చెప్పింది… అవి తీసేసి విడుదల చేశారు… సరే, నిజంగా ఇక్కడి ప్రేక్షకుల తెలుసుకుందామని దర్శకురాలు కుటుంబసభ్యులతో థియేటర్ వెళ్లింది… వ్యతిరేకత ఏమీ కనిపించలేదు…
ఊపిరి పీల్చుకుంది… కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు సినిమా… ఇది ఒక యువతి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆమె ఎదుగుదల గురించి చెప్పే ఒక డ్రామా… ఇది ఒక ‘కమింగ్-ఆఫ్-ఏజ్’ చిత్రం.., ఇందులో ప్రధాన పాత్ర అయిన రమ్య (అంజలి శివరామన్) తన టీనేజ్ నుండి యువతిగా మారే ప్రయాణాన్ని చూపిస్తారు…
అంజలి శివరామన్ నటన దీనికి హైలైట్… ఈమె కేరళైట్… ఒకటీరెండు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌తో పాపులరైంది… తను సింగర్ కూడా… కథాంశం కంటే, ఒక యువతి ఆలోచనలు, ఆమె జీవితంలో జరిగే సంఘటనలను చిన్న చిన్న దృశ్యాల (vignettes) రూపంలో చూపించడం ఈ సినిమా ప్రత్యేకత…
Share this Article