Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుట్టుక గుణాన్ని నిర్దేశిస్తుందా..? ఏమో… ఓ కథ మాత్రం చదవండి…

September 23, 2025 by M S R

.

జాజిశర్మ కీసర … వాల్ మీద కనిపించింది… బాగుంది… మన పుట్టుకను బట్టి మన గుణాలుంటాయి అని చెప్పే కథ… నిజమా, కాదా, ఈ విశ్లేషణ అబద్దం కదానే అభిప్రాయాల ఎలా ఉన్నా… కొందరిని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది…

ఇంతకీ ఆ పోస్టు ఏమిటంటే..?

Ads


ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.
రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.

కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.
అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.
రాజు చాలా ఆశ్చర్యపోయాడు.
అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు – “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.
దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.

రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.
రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.
అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.
అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.

కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు… అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..
రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.
అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.

రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.
ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు….
రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు.

కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.
ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.
రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.
రాజుకు చాలా కోపం వచ్చింది.
కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.

తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.
మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.
రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.

అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.
ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • QUAD … నాలుగు దేశాల కూటమి ఉన్నట్టా..? రద్దయిపోయినట్టేనా..?!
  • సౌదీ పాకిస్థాన్ రక్షణ ఒప్పందం- ఇండియాకు ఏమీ ఫరక్ పడదు…
  • పుట్టుక గుణాన్ని నిర్దేశిస్తుందా..? ఏమో… ఓ కథ మాత్రం చదవండి…
  • హెచ్1బీ వీసాలపై ఆంక్షలు ఎందుకు రావు..? ఈ చెత్తా పోకడలే కారణం..!!
  • సీఎం జేబులో కత్తెరతో తిరిగితే తప్పేంటి మిస్టర్ హరీష్‌రావూ..?
  • Bad Girl … ప్రయోగాత్మక సినిమాయే… కానీ అశ్లీల కోణంతో ఫ్లాప్…
  • అంతరిక్ష సమరానికీ ఇండియా సై..! ఇస్రో కొత్త ప్రాజెక్టు కథేమిటంటే…
  • ఒళ్లు గడ్డకట్టే చలిలో… ఇంటి అరుగుపై, ఆ మరణశయ్యపై ఓ పసిబిడ్డ…
  • ఈవీఎం హ్యాకింగ్‌ చేస్తున్నట్టు నిజంగానే ఈ బీజేపీ సీఎం అంగీకరించిందా..?!
  • OG ప్రిరిలీజ్..! థాంక్‌లెస్ టాలీవుడ్… రేవంత్‌రెడ్డికి అర్థమవుతోందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions