Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినారె గీత ‘ళ’కారం… ఆ సినిమాలో ఓ చిన్న ప్రయోగం భళ్లే భళ్లే …

September 25, 2025 by M S R

.

ఇప్పుడు ప్రధానంగా కుర్చీ మడత పెట్టే పాటలే ఎక్కువ… మెలొడీ, భావగర్భితమైన పాటలు చాలా తక్కువ… అఫ్‌కోర్స్, గతంలో కూడా గ్గుగ్గూ గ్గుగ్గూ గుడిసుంది వంటి పాటలూ బోలెడు…

కాకపోతే అప్పట్లో ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, సినారె… సాహితీ విలువలున్న ప్రయోగాలు కొన్ని చేసేవాళ్లు… అలాగే పదసౌందర్యం ప్రధానమైన ప్రయోగాలూ చేసేవాళ్లు… అలాంటివి బోలెడు…

Ads

ప్రాసలు, పదప్రయోగాల్లో వేటూరి ప్ర-సిద్ధహస్తుడు… అనుకోకుండా యూట్యూబ్‌లో జైలుపక్షి సినిమాలోని ఓ పాట కనిపించింది…

ఇదీ ఆ పాట లింక్

సుహాసిని, శోభన్‌బాబు డ్యూయెట్… సినారె ఓ చిన్న ప్రయోగం… పల్లవి, చరణాల్లో కూడా ప్రతి వాక్యం చివర ‘ళ’ వచ్చేలా రాశాడు… చేయి తిరిగిన రచయితకు అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు… కానీ ఓ మంచి ట్యూన్‌లో కేవీ మహదేవన్ ఆ పాటను పొదిగాడు… ఆసక్తికరంగా ఉంటుంది పాట…

సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ హైదరాబాదు అప్పటి దర్శనీయ స్థలాల్ని, అంటే మహేశ్వరి, పరమేశ్వరి థియేటర్లు, బిర్లా టెంపుల్ గట్రా చూపిస్తూ సరదాగా చిత్రీకరించాడు…

ఇదీ ఆ పాట… ప్రేమ కళ, చంద్ర కళ, ఆది కళ, పెళ్లి కళ, మౌన కళ, గాన కళ , నాట్య కళ, కావ్య కళ, చిలిపి కళ, మదన కళ , జీవ కళ, యోగ కళ… అంటూ చివరకు ‘‘ఒకరిలో ఒకరు ఒదిగితే.. అది యోగ కళ.. సంయోగ కళ’’ అని ముగిస్తాడు…



మనసంతా ప్రేమ కళా… తనువంతా చంద్ర కళా
ఇన్నాళ్లు కాపురమున్నా.. ఇంకా ఉంది పెళ్ళి కళ
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..

అనురాగం ఆలూమగలకు.. అన్నిటి కన్నా ఆది కళ

మనసులు గుసగుసలాడితే.. అది మౌన కళ
తలపులు స్వరములు పాడితే.. అది గాన కళ
మనసులు గుసగుసలాడితే.. అది మౌన కళ
తలపులు స్వరములు పాడితే.. అది గాన కళ

నడుములో మెరుపులాడితే.. అది నాట్య కళ

కళ్ళలో కవితలల్లితే.. అది కావ్య కళ

చంపను చిటుకున మీటితే… అది చిలిపి కళ
పెదవిని పెదవికి అద్దితే.. అది మదన కళ
చంపను చిటుకున మీటితే… అది చిలిపి కళ
పెదవిని పెదవికి అద్దితే.. అది మదన కళ

నిదురలో నవ్వులొలికితే.. అది జీవ కళ
ఒకరిలో ఒకరు ఒదిగితే.. అది యోగ కళ.. సంయోగ కళ



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions