.
సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ ప్రీమియర్ షోల తాలూకు ప్రేక్షకుల దోపిడీ ఆటలకు హైకోర్ట్ బ్రేక్ వేసింది… ఈమేరకు ప్రభుత్వం జారీ చేసిన మెమోను కొట్టేసింది… రిలీజుకు ముందురోజు ఏకంగా 800 రూపాయలు అట, తరువాత 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్లలో 100, మల్టీప్లెక్సుల్లో 150 చొప్పున దండుకోవడానికి ఇచ్చిన మెమో అది…
అవును, అసలు ఈ ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపు విధాన నిర్ణయాల వెనుక ప్రాతిపదికలు ఏమిటో కూడా కోర్టు నిగ్గదీసి అడిగితే అది ప్రేక్షకుడికి ఊరట… (ఈ ఉత్తర్వుల కోసం నిర్మతలు ఏమైనా లెక్కలు చూపిస్తున్నారా..? వాటికి ఉన్న చట్టబద్దత ఏమిటి..? ఐటీ వాళ్లకూ అవే ఇస్తున్నారా..? అటు ఉత్తర అమెరికాలో ఎదురుదెబ్బ… ఇటు ఈ తీర్పు… మేమాడిందే ఆట అనుకునే ధోరణికి ఎడాపెడా బ్రేకులు… ఫుల్లు నెగెటివిటీ అలుముకుంటోంది ఓజీ అనే సినిమా చుట్టూ…
Ads
మొన్న ప్రిరిలీజ్ ఫంక్షన్ ఏదో చేశారు కదా ఎల్బీ స్టేడియంలో..! ఫుల్లు వర్షం… డిస్టర్బ్ అయిపోయింది, సమయానికి ట్రెయిలర్ కూడా రిలీజ్ చేయలేకపోయారు… నెగెటివిటీ బాపతు మరో రెండు అంశాలు ఇవి… మరోవైపు హౌజ్ ఫుల్ షోలతో నడుస్తున్న హిట్ సినిమా మిరయ్ నిర్మాత మీద ఒత్తిడి తెచ్చి, కొన్ని థియేటర్లను ఓజీ కోసం ఇచ్చారట… ప్రీమియర్ షో టికెట్లను బ్లాకులో అమ్ముతున్నారనే ఆరోపణలు మరోవైపు… ఒకటీరెండు చోట్ల వేలం కూడా..! ఓ ఉపముఖ్యమంత్రి కటానా పట్టుకుని సినిమా వేదిక మీదకు ఎంట్రీ ఇవ్వడం..! ఓరకమైన అనార్కీ నడుస్తోంది…
అవునూ, ప్రిరిలీజ్ అంటే గుర్తొచ్చింది… అసలు ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య పేరు ఎక్కడైనా వినవచ్చిందా ఫాఫం అని ఆరా తీస్తే, అసలు ఆ ఫంక్షన్‌లో ఉన్నాడా అని చెక్ చేస్తే… వచ్చాడనే తెలిసింది…
ఇవి నిర్మాతలు మాట్లాడే రోజులు కావు కదా… అన్నీ హీరోలే మాట్లాడతారు… ఈ హీరో కూడా ఈ సినిమాకు ఫుల్లు ప్లస్ దర్శకుడు సుజీత్ ప్లస్ థమన్ అని తేల్చిపారేశాడు వేదిక మీద… సమయానికి దానయ్య మొహం ఆ ప్రత్యక్ష ప్రసారంలో ఎవరూ చూపలేదు.. అన్యాయం… (కోపంతో ఓ మీడియా ఫోటోగ్రాఫర్ మీదో, వీడియో గ్రాఫర్ మీదో చేయో, నోరో పారేసుకున్నాడనీ అన్నారు)…
సుజీత్ తన వీరాభిమాని అట, నెలరోజులు జానీ మార్క్ హెడ్ బ్యాండ్ ధరించి తిరిగాడట, అదే ఓజీ దర్శకత్వానికి అర్హత అన్నట్టు చెప్పాడు పవన్ కల్యాణ్… సరే, నందమూరి థమన్ కాస్తా ఎలాగూ థమన్ కల్యాణ్ అయ్యాడు, అది వేరే కథ…
మరి డబ్బులు పెట్టి, రిస్క్ తీసుకుని, నానా ప్రయాస పడిన నిర్మాత పేరే వినిపించకూడదా ఫాఫం..! మరీ తనను ఓ దారినపోయే దానయ్యను చేసేశారు ఏమిటి..? హతవిధీ… దానయ్య దురదృష్టం ఏమో గానీ… ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత… రాజమౌళి తనను మరీ పురుగులో ఈగను తీసేసినట్టు తీసేశాడు… చివరకు సినిమా పది అంశాల్లో ఆస్కార్ కోసం లాబీయింగు చేసినప్పుడు, ఓ పాటకు ఆస్కార్ వచ్చి హడావుడి క్రియేట్ అయినప్పుడు కూడా నిర్మాత పేరు ఎక్కడా వినిపించలేదు…
నిజంగా, దానయ్యను మెచ్చుకోవాలి… ఇంత జరుగుతున్నా ఎప్పుడూ బరస్ట్ కాలేదు… అదే దిల్ రాజు వంటి నిర్మాత అయితే కథ వేరే ఉండేది… తను 1992 నుంచీ ఫీల్డులో ఉన్నాడు… బాలయ్య, నాగార్జున, బన్నీ, రవితేజ, పవన్ కల్యాణ్, రాంచరణ్, నాని, మహేశ్ బాబు, జూనియర్… దాదాాపు ప్రతి అగ్ర హీరోతో హిట్ సినిమాలు తీశాడు… డబ్బు పెట్టీ ఒక నిర్మాత ఎందుకిలా తులం ప్రాధాన్యం కూడా పొందలేని దురవస్థ ఏమిటిలా..?!
Share this Article