.
భారత ప్రభుత్వం ఇన్నేళ్లూ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన ఓ ప్రధాన రవాణా రంగంపై ఎట్టకేలకు దృష్టి పెట్టింది… మనం సరుకుల రవాణా కోసం విదేశీ నౌకలపై విపరీతంగా ఆధారపడుతున్నాం… మన ప్రభుత్వం ఈ సరుకు రవాణా విదేశీ నౌకలకు ఏటా 6 లక్షల కోట్లు చెల్లిస్తోంది… అందుకని..?
నిన్నటి కేంద్ర కేబినెట్ సమావేశంలో నౌకానిర్మాణ మరియు సముద్రయాన అభివృద్ధి (Shipbuilding and Maritime Development) కోసం దాదాపు ₹69,725 కోట్ల భారీ ప్యాకేజీకి ఆమోదం లభించింది… ఇది భారత నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడానికి, దేశాన్ని గ్లోబల్ మ్యారిటైమ్ పవర్‌గా మార్చడానికి ఉద్దేశించిన ఒక 10 సంవత్సరాల కార్యక్రమం…
Ads
ఈ ప్యాకేజీలోని ప్రధాన అంశాలు, విశేషాలు ఏమిటంటే…? (ఇండియా ఇంకా ఎన్నోరంగాలపై కాన్సంట్రేట్ చేయాల్సి ఉందని ఈ ఉదాహరణ తేటతెల్లం చేస్తోంది…)
(4-Pillar Strategy)
నౌకానిర్మాణం, దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడం (Shipbuilding and Domestic Capacity Enhancement):
-
- నౌకానిర్మాణ అభివృద్ధి పథకం (Shipbuilding Development Scheme) ద్వారా దేశీయ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని పెంచడానికి ఆర్థిక సహాయం అందించడం. దీనికి ప్రత్యేకంగా ₹19,989 కోట్ల కేటాయింపు ఉంది…
- ప్రస్తుతమున్న నౌకానిర్మాణ స్థావరాలను (Brownfield) విస్తరించడం, కొత్త గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ క్లస్టర్‌లను అభివృద్ధి చేయడం…
దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ (Long-term Financing):
-
- నౌకానిర్మాణం, అనుబంధ రంగాలకు దీర్ఘకాలిక, తక్కువ ఖర్చుతో కూడిన ఫైనాన్సింగ్‌ను సులభతరం చేయడానికి మ్యారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ (Maritime Development Fund) ఏర్పాటు చేయడం…
సాంకేతిక సామర్థ్యాలు, నైపుణ్యం అభివృద్ధి (Technical Capabilities and Skilling):
-
- ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం, ఉద్యోగుల నైపుణ్యాన్ని (Skilling) పెంచడంపై దృష్టి సారించడం…
చట్టపరమైన, విధానపరమైన సంస్కరణలు (Legal and Policy Reforms):
-
- రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పన్ను, చట్టపరమైన, విధానపరమైన సంస్కరణలను అమలు చేయడం.
ఈ ప్యాకేజీ యొక్క ముఖ్య లక్ష్యాలు
- గ్లోబల్ స్థానం: నౌకానిర్మాణం, నౌకాయాన రంగంలో ప్రపంచంలోని టాప్ 10 దేశాలలో భారతదేశాన్ని నిలబెట్టడం…
- ఉద్యోగ కల్పన: రాబోయే ఐదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించడం దీని ముఖ్య లక్ష్యం. (కొన్ని అంచనాల ప్రకారం 2 కోట్ల ఉద్యోగాలు)…
- విదేశీ నౌకలపై ఆధారపడటాన్ని తగ్గించడం: ప్రస్తుతం సరుకు రవాణా కోసం భారత ప్రభుత్వం విదేశీ షిప్పింగ్ కంపెనీలకు ఏటా సుమారు ₹6 లక్షల కోట్లు చెల్లిస్తోంది… ఈ ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ నౌకల ద్వారా రవాణా వాటాను పెంచడం…
- ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోత్సాహం: దేశీయ నౌకానిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారీ ఇంజనీరింగ్‌లో కీలకమైన ‘షిప్‌బిల్డింగ్’ను బలోపేతం చేయడం…
Share this Article