Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లడఖ్ మంచు కొండలకు మంటపెట్టిందెవరు..? పార్ట్-2 …

September 26, 2025 by M S R

.

పార్థసారథి పొట్లూరి…. నిన్నటి లడాక్ లో జరిగిన హింసని ప్రేరేపించింది సోనమ్ వాంగ్ చుక్! లడాక్ కి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లడాక్ యువకులని హింసకి ప్రేరేపించేలా రెచ్చకొట్టాడు.

ఇంతకీ లడాక్ కి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని వీధుల్లోకి వచ్చి హింసకి పాల్పడ్డది ఎవరు?
లడాక్ బౌద్ధ సంఘాలు, కార్గిల్ లోని ముస్లిమ్స్!

Ads

గత వారం రోజులుగా లడాక్ కి రాష్ట్ర హోదా ఇచ్చి ఎన్నికలు జరిపించాలని కోరుతూ సోనమ్ వాంగ్ చుక్ తో పాటు మరో 10 మంది నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇప్పటికే పలుసార్లు లడాక్ అపెక్స్ బాడీ ( LAB) సభ్యులు హోమ్ మంత్రి అమిత్ షాను కలవడం LAB డిమాండ్లని అమిత్ షా ఒప్పుకోకపోవడం జరుగుతూ వస్తున్నది.

బీజేపీ లడాక్ కి రాష్ట్ర హోదా ఇస్తానని ఎన్నికలలో వాగ్దానం చేసింది కానీ వాయిదా వేస్తూ వస్తున్నది.
అమిత్ షా ఎందుకు లడాక్ కి రాష్ట్ర హోదా ఇవ్వడానికి సందేహిస్తున్నారు?
కేజ్రీవాల్ తో ఢిల్లీలో ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు కదా?
లడాక్ లో మరో కేజ్రీవాల్ అయిన సోనమ్ వాంగ్ చుక్ కి అవకాశం ఇవ్వకూడదు అని.

leh

సోనమ్ వాంగ్ చుక్ ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా నటిస్తున్నాడు జస్ట్ కేజ్రీవాల్ లాగా.
లడాక్ లో యువకులకి ఉద్యోగాలు లేవు అంటాడు.
పరిశ్రమలు పెట్టి ఉద్యోగ కల్పన చేయాలని చూస్తే కాలుష్యం అని పెట్టడానికి వీలు లేదంటాడు.
రాష్ట్ర హోదా ఇస్తే సరిపోదట. రాజ్యాంగంలోని 6 వ షెడ్యూల్ లో లడాక్ ని చేర్చి ఆటానమస్ హోదా ఇవ్వాలిట! అంటే మరో మణిపూర్ మోడల్ తలనెప్పిని కొని తెచ్చుకున్నట్లే.

కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడతాడు! కానీ తను అడిగినవి ఇచ్చిన తరువాత కాంగ్రెస్, చైనా, పాకిస్తాన్ లతో అంట కాగుతాడు.
సోనమ్ వాంగ్ చుక్ తనంత తానుగా బయటపడే వరకూ వేచి చూసారు అమిత్ షా ! ఆ సమయం వచ్చింది సెప్టెంబర్ 24 న.

నిరాహార దీక్ష చేస్తున్నవారిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు వారిని హాస్పిటల్ లో జాయిన్ చేసేసరికి తన ప్లాన్ మధ్యలోనే విఫలం అవుతున్నదని అసహనంతో “ అరబ్ ఉద్యమంలాగా, నేపాల్ Gen Z లాగా తిరగబడండి” అంటూ నిరాహార దీక్ష విరమించాడు.

అప్పటికే యువకులు రోడ్ల మీద ఉండడంతో ప్రభుత్వ ఆఫీసులు, పోలీసు వాహనాల మీద దాడులు చేసి నిప్పు పెట్టడంతో పోలీసులు కాల్పులు జరుపగా నలుగురు మరణించారు. దాదాపుగా 50 మంది గాయపడ్డారు. లేహ్ లోని బీజేపీ ఆఫీస్ కి నిప్పుపెట్టారు.

జస్ట్ కేజ్రీవాల్ లాగా డ్రామా!
హింస చెలరేగడం మంచిది కాదు అంటూ కారులో తన ఊరికి వెళ్ళిపోయాడు కానీ హింసని ఆపే ప్రయత్నం చేయలేదు.
సోనమ్ వాంగ్ చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగానే లేహ్ కి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాన్ జిన్ సెపాంగ్ ( Phuntsog Stangin Tsepong) హింసకి నాయకత్వం వహించాడు. రాహుల్ తో స్టాన్ జింగ్ సెపోంగ్ దిగిన ఫోటోని వైరల్ చేశారు ఢిల్లీ బీజేపీ అభిమానులు.

leh

సిబిఐ రంగ ప్రవేశం!
గత ఫిబ్రవరిలో పర్యావరణం – పరిరక్షణ పేరుతో పాకిస్తాన్ కి చెందిన డాన్ ( Dawn) పత్రిక యాజమాన్యం ఒక సెమినార్ నిర్వహిస్తూ సోనమ్ వాంగ్ చుక్ ని ఆహ్వానించింది. మరి రామోన్ మెగసేసే అవార్డ్ గ్రహీత కదా!

ప్రభుత్వం వీసా ఇచ్చింది, పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. కానీ ఒక పోలిక గురుంచి ప్రస్తావించాలి, అదేమిటంటే హర్యానా నుండి పాకిస్తాన్ వెళ్లిన జ్యోతి మల్హోత్రా ఎలా అయితే సెల్ఫీ వీడియో తీస్తూ నేను పాకిస్తాన్ లో అడుగుపెట్టాను అని అన్నదో… సేమ్ అదే తరహాలో సోనమ్ వాంగ్ చుక్ కూడా సెల్ఫీ వీడియో ది,గి జ్యోతి మల్హోత్రా అన్నట్లే నేను పాకిస్తాన్ లో ఉన్నాను, పర్యావరణం మీద లెక్చర్ ఇవ్వడానికి అంటూ పోస్ట్ చేశాడు.

నిన్నటి హింస తరువాత సిబిఐ సోనమ్ వాంగ్ చుక్ ఇంట్లో సోదాలు జరిపింది. సోనమ్ వాంగ్ చుక్ కి చెందిన ఎన్ జీ ఓ అయిన Student’s Educational and Cultural Movement of Ladakh ( SECMOL) కి ఇచ్చిన FCRA ( Foreign Contribution Regulation Act) లైసెన్స్ ని రద్దు చేసింది వెంటనే ప్రభుత్వం..!

విదేశాల నుండి వాంగ్ చుక్ ngo కి వచ్చిన విరాళాలలో మనీ లాండరింగ్ ద్వారా వచ్చాయి అని ప్రాధమికంగా ఆధారాలు దొరకడంతో FCRA లైసెన్స్ రద్దు చేశారు. ED కూడా దర్యాప్తు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి…

So! ఖైబర్ ఫక్తున్క్వా లో పాకిస్తాన్ సైన్యం చేసిన దాడిలో సాధారణ పౌరులని ప్రభుత్వం హత్య చేసింది అని భారత్ UNO లో అన్న మూడు రోజులకే లేహ్ లో పోలీసుల కాల్పులలో భారత పౌరులు మరణించడానికి వాంగ్ చుక్ పాకిస్తాన్ కి సహాయ పడ్డాడు. … ఇవి ఇక్కడితో ఆగవు! డీప్ స్టేట్ అండతో వారానికో సర్ప్రైజ్ లు చూడబోతున్నాము!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions