.
నేను నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను… క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు… ఒక వ్యక్తి వచ్చి నాకు ట్యాక్సీ కావాలా అని అడిగాడు… అవును అనగానే, అతను డ్రైవర్‌కి కాల్ చేసి. వెహికల్‌ని అరైవల్స్ ఏరియాకి తీసుకురమ్మని చెప్పాడు…
అది 40 నిమిషాల ప్రయాణం, నేను తెల్లవారుజామున సుమారు 3:15 గంటలకు ఇంటికి చేరుకున్నాను. డ్రైవర్ వెళ్లిపోగానే, చెక్ చేసుకుంటే నా ఫోన్ కనిపించడం లేదని గ్రహించాను…
Ads
డ్రైవర్‌ను సంప్రదించడానికి నా దగ్గర తన నంబర్ లేదు—అతని మొదటి పేరు మాత్రమే తెలుసు. నేను కారు నంబర్‌ను నోట్ చేసుకోలేదు, నేను నగదు చెల్లించాను, ఇంకా యాప్ ద్వారా బుక్ చేయకుండా ఒక మామూలు క్యాబ్‌లో వెళ్ళాను. అన్నిటికన్నా దారుణం ఏమిటంటే, ఆ ఫోన్‌లో యూఎస్ సిమ్ కార్డ్ ఉంది, ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంది, ఇంకా బ్యాటరీ డెడ్ అయింది. కాబట్టి దానికి కాల్ చేయలేక పోయాను!
కొన్ని నిమిషాలు బాధపడ్డాను, కానీ డ్రైవర్‌ను వెతకడానికి మళ్లీ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ 40 నిమిషాల ప్రయాణం వెనక్కి, నా సోదరుడు మరొక క్యాబ్ బుక్ చేశాడు, మేము బయలుదేరాము.
అదృష్టవశాత్తూ, నేను డ్రైవర్‌తో అంతకుముందు మాట్లాడినప్పటి విషయాలు ఓసారి నెమరేసుకుంటున్నాను, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని..! మేము సినిమాల గురించి మాట్లాడుకున్నాము, నాకు అతని పేరు (వెంకీ), అతను ఏమి చదువుతున్నాడో (కామర్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్) గుర్తుండిపోయాయి, నేను అతని లైసెన్స్ ప్లేట్ కూడా చూశాను—అయితే నాకు అది సరిగ్గా గుర్తుకురాలేదు… (2977 బదులు 2799).
మేము తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు, నాకు కావల్సిన అతన్ని వెంటనే కనుగొనలేకపోయాను, కానీ నేను పరిస్థితిని ఇతర టాక్సీ డ్రైవర్లకు వివరించాను… వందలాది టాక్సీలు వస్తున్నాయి, పోతున్నాయి!!
అది గడ్డివాములో సూది వెతికినట్లుగా ఉంది… ఓ ప్రయత్నం చేయడమే…
5 నిమిషాల్లో, వారు ఏ క్యాబ్‌తో వెళ్లానో తెలుసుకుని, అతనికి కాల్ చేశారు (శ్రీనివాస్)… అతను వచ్చి, తన కొడుకు (డ్రైవర్ వెంకీ)కు నా ఫోన్ దొరికిందని, నాకు కాల్ చేయడానికి ప్రయత్నించాడని చెప్పాడు… ఆ ఫోన్ నుంచే కాల్ చేయడానికి దాన్ని ఛార్జ్ చేస్తున్నట్టు తనకు చెప్పాడన్నాడు…
తరువాత అతను నా ఫోన్‌ని తిరిగి ఇచ్చి, మళ్లీ రెండవసారి మమ్మల్ని ఇంటి దగ్గర దించాడు… ఒకవేళ తనను కలవలేకపోతే… తనే మా అపార్ట్‌మెంట్లకు వచ్చేవాడిని అన్నాడు… ఎలాగోలా నన్ను పట్టుకునేవాడినని కూడా చెప్పాడు…
నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, అతను మొదటిసారి నేను చెప్పిన దిశల ఆధారంగా, మ్యాప్స్ ఉపయోగించకుండా, ఆ చీకటి కాంక్రీట్ జంగిల్‌లో ఉన్న నా అపార్ట్‌మెంట్లను కచ్చితంగా గుర్తుంచుకున్నాడు…
నేర్చుకున్న పాఠాలు…: కారు దిగే ముందు ఎల్లప్పుడూ తనిఖీ చేసుకోండి… ప్రపంచం మనం అనుకున్నదానికంటే దయగలది, నిజాయితీ గలది… ఒక మంచి సంభాషణ చాలా మంచి ఫలితాలను ఇవ్వగలదు… …. Sreekumar Gomatham
Share this Article