Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెగాస్టార్‌‌కు గృహహింస..! ‘దొంగమొగుడు వస్తే గానీ దొరకని విముక్తి..!

October 1, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. హీరోలిద్దరు భామలు ముగ్గురు … 2+3 సినిమా అన్న మాట . చిరంజీవి కోదండరామిరెడ్డి యండమూరిల కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఈ దొంగ మొగుడు .

భలే టైటిల్ . చాలా మంది మగాళ్ళకు , మొగుళ్ళకూ భలే నచ్చింది ఈ టైటిల్ . ఇప్పటికీ అనధికార ఎగస్ట్రా గాళ్ళను DM అని భామలు పిలుచుకుంటూ ఉంటారు .

Ads

యండమూరి విరచిత నల్లంచు తెల్ల చీరె నాకు గుర్తుండి ఆంధ్రజ్యోతి దిన పత్రికలో డైలీ సీరియలుగా వచ్చింది . ఆ కధకు సినిమాటిక్ కూర్పులు మార్పులు చేర్పులు చేసి ఈ దొంగ మొగుడిని తయారు చేసారు . ఒకే రూపంలో ఉన్న ఇద్దరు హీరోలు తమ స్థానాలను మార్చుకుంటారు . అక్కినేని ఇద్దరు మిత్రులు సినిమా ఫార్ములా .

ఈ సినిమా ఇద్దరు హీరోలలో ఒకరు మహిళల మనసులను దోచే చీరెలను డిజైన్ చేసే చీరెల వ్యాపారస్తుడు . మరొకరేమో జంతర్ మంతర్ చిల్లర నేరస్తుడు . మరో ముగ్గురు విలన్లు . వాళ్ళ చీరెల వ్యాపారానికి పెద్ద అడ్డంకు అవుతాడు ఒక హీరో . అతన్ని రక్షించి మిత్రుడు అవుతాడు ఆవారా గారు .

సాఫ్ట్ హీరోకి ఇంట్లో జోరీగ భార్య , ఆ భార్య తల్లి , ఓ బావమరిది . వ్యాపారంలో సక్సెస్ అయిన సాఫ్ట్ హీరో గృహ హింసకు గురవుతుంటాడు . సరిగ్గా ఆ టైంలో ఓ అందాల సుందరి స్టెనోగా చేరి హీరోని ఆకర్షిస్తుంది . 1+2 స్టార్టవుతుంది . హీరోలు ప్లేసులు మారుతారు . ఆవారా హీరో ఇంట్లో వాళ్ళకు , వ్యాపారంలో విలన్లకు బుద్ధి చెప్పడంతో సినిమా ముగుస్తుంది .

సాఫ్ట్ హీరో భార్యగా మాధవి , ఆవారా హీరో అల్లరి ప్రేయసిగా మరో జంతర్ మంతర్ భామ రాధిక , మూడో భామగా భానుప్రియ నటించారు . కోదండరామిరెడ్డి భానుప్రియను చాలా అందంగా చూపారు సినిమాలో . ఆమె పాత్రను బాగా కధకు బాగా కనెక్ట్ చేసారు కూడా . విలన్ల చేతిలో మోసగించబడిన కుటుంబంలోని వ్యక్తిగా , ఆవారా హీరో మేనకోడలుగా కనెక్ట్ చేయటం బాగుంటుంది .

క్లైమాక్సులో ఆవారా హీరో నాకన్నా గొప్ప మొగుడిని తెస్తావా ఏంటని అక్కతో అంటే చూడు వస్తున్నాడని గుర్రం మీద వచ్చే మూడో చిరంజీవిని చూపటం చిరంజీవి అభిమానులకు పట్టలేని ఆనందాన్ని కలిగించింది . కేరింతలు కొట్టారు థియేటర్లలో .

సాప్ట్ హీరో రవితేజ చీరెల డిజైనరుగా ఏ మహిళ ఏ డిజైన్ చీరె కట్టుకుంటే సన్నగా , నాజూగ్గా , పొడుగ్గా కనిపిస్తుందో వివరించడం అప్పట్లో ఆడవారికి బాగా నచ్చింది . ఆవారా జంటగా మరో చిరంజీవి , రాధికలు సినిమా అంతా అల్లరి అల్లరి చేస్తారు . దొంగ స్వామినిగా అమాయక భక్తులను మోసం చేస్తుంటే ఆవారా హీరో పట్టించటం బాగుంటుంది . ఆమెకు మల్లెలమూడి అమ్మ అని పేరు పెడతారు . జిల్లెలమూడి అమ్మ వారి మీద కోపం కోదండరామిరెడ్డిదా , యండమూరిదా తెలియదు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో కొసరాజు , సిరివెన్నెల సీతారామ శాస్త్రి , రాజశ్రీలు వ్రాసిన పాటలు వీర హిట్టయ్యాయి .అన్నింటిలో చాలా అందంగా చిత్రీకరించబడిన పాట చిరంజీవి , భానుప్రియల మీదదే . కోకమ్మ చెప్పమ్మా చెలి సోకు ఏపాటిదో ! స్పీడు స్పీడుగా ఉండే మరో డ్యూయెట్ చిరంజీవి , రాధికల మీదది . నల్లంచు తెల్ల చీరె తల్లోన మల్లెమాల .

చిరంజీవి , మాధవిల మీద డ్యూయెట్ ఈ చెంపకు శెలవీయకు ఈ పెదవిని వదిలేయకు బాగుంటుంది . చిరంజీవి , భానుప్రియల మీద మరో డ్యూయెట్ నీ కోకకింత కులుకెందుకు కూడా అందంగా ఉంటుంది . మొత్తానికి కోకల మీద మూడు పాటల్ని పెట్టారు . నల్లంచు తెల్ల చీరె కధా మూలం కదా ! కోకలకు న్యాయం చేసారు .

మాధవిని , రాజసులోచనని , గిరిబాబుని టీజ్ చేసే ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా సాంబారు కావాలా పాట టీజింగుతో పాటు చిరంజీవి , రాధికల మీద చాలా హాట్ హాటుగా కూడా ఉంటుంది . క్లైమాక్సులో ముగ్గురు భామలతో చిరంజీవి అద్దమరేయి మద్దెల దరువండి గోల గోల పాట బాగుంటుంది .

పెళ్లి జరిపించే అయ్యవారి మారు వేషంలో గోల అభిమానులకు బాగా నచ్చుతుంది . ఆరోజుల్లో హీరో , హీరోయిన్లు మారువేషాల్ని తెగ వేసేవారు కదా ! బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , శైలజలు పాటల్ని పాడారు . ఈ సినిమాకు వేటూరి పాటల్ని వ్రాయకపోవడం విశేషమే .

విలన్లుగా రావు గోపాలరావు , గొల్లపూడి మారుతీరావు , అల్లు రామలింగయ్యలు , వాళ్ళ ముగ్గురికి ఆయుధంగా చరణ్ రాజ్ బాగా నటించారు . చరణ్ రాజ్ అదుర్స్ డైలాగ్ కూడా అదుర్సయింది అప్పట్లో . ఇతర పాత్రల్లో జయంతి , రంగనాధ్ , సుత్తి వేలు , పి జె శర్మ , ప్రభృతులు నటించారు .

యస్ పి వెంకన్న బాబు నిర్మించిన ఈ సినిమాకు సత్యానంద్ డైలాగులు చాలా బాగుంటాయి . ముఖ్యంగా ఆవారా హీరో , చరణ్ రాజ్ డైలాగులు . 1987 సంక్రాంతి సీజనుకు రిలీజయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . టివిలో ఎన్ని సార్లు వేసారో !

చిరంజీవి , భానుప్రియ అభిమానులు ఇంతకుముందు చూసి ఉన్నా మళ్ళా చూడొచ్చు . A thing of beauty is a joy forever . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions