.
ఆధునిక తెలుగు అక్షరమాలలో వాడుక తగ్గిపోయి, తొలగించిన లేదా చాలా అరుదుగా ఉపయోగించే కొన్ని అక్షరాలు ఉన్నాయి… మనం ఱ (బండి ‘ర’) దాదాపుగా తీసేశాం… ఇంకా వాడుకలో లేనివి లేదా చాలా అరుదుగా ఉపయోగించే ఇతర అక్షరాలు ఇక్కడ చూడవచ్చు…
- అచ్చులు (Vowels):
- ౠ (దీర్ఘ ఋ): ఇది సంస్కృత పదాలలో ఉండేది.
- ఌ (ల్రు): సంస్కృత పదాలలో ఉండేది.
- ౡ (దీర్ఘ ల్రు): ఇది కూడా సంస్కృత పదాలలో ఉండేది.
ఈ నాలుగు అచ్చులు – ఋ, ౠ, ఌ, ౡ – మొదట్లో సంస్కృతం నుండి వచ్చిన పదాల కోసం అక్షరమాలలో ఉన్నప్పటికీ, నేటి వాడుకలో ౠ, ఌ, ౡ దాదాపుగా లేవు. ఋ కూడా ఎక్కువగా వాడుకలో లేదు, కానీ అప్పుడప్పుడు కనిపిస్తుంది…
- హల్లులు (Consonants):
- ౘ (దంత్య ‘చ’)
- ౙ (దంత్య ‘జ’)
ఈ అక్షరాలు చ (తాళవ్య ‘చ’), జ (తాళవ్య ‘జ’) కంటే కొంచెం భిన్నమైన ఉచ్చారణను కలిగి ఉండేవి. ప్రస్తుతం, వాటి ఉచ్చారణ చ, జ లలో కలిసిపోయింది లేదా చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు…
- ఇతర గుర్తులు (Other Symbols):
- అర్థానుస్వారం (ఁ) లేదా అరసున్న: పూర్వకాలంలో ఇది చాలా ముఖ్యమైనది. నేటి ఆధునిక తెలుగు వాడుకలో దీనికి బదులుగా ఎక్కువగా పూర్ణానుస్వారం (ం) లేదా ‘న’కారం ఉపయోగిస్తున్నారు…
ముఖ్యంగా, అచ్చులలో ౠ, ఌ, ౡ, హల్లులలో ఱ, ౘ, ౙ లు వాడుకలో లేని అక్షరాలుగా పరిగణించబడతాయి…
Ads
.
సో, ఇప్పుడు తెలుగు అక్షరమాలలో మిగిలినవెన్ని..? ప్రవాసాంధ్రుల పిల్లలకే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన పిల్లలకు, వాళ్ల పిల్లలకు తెలుగు రాదు.., చదవడం రాదు, రాయడం రాదు, కొందరికి అర్థమే కాదు… కొందరు మహా అయితే వాళ్ల ఇళ్లల్లో మాట్లాడుకోవడం తప్ప..!
ఈ స్థితిలో తెలుగు భాష, అక్షరమాలను సంస్కరించి బాగా సరళం చేయాలనే అభిప్రాయాలు చాలా ఉన్నాయి… దాన్ని వ్యతిరేకించేవాళ్లూ ఉన్నారు…
ఓ భిన్నమైన అభిప్రాయం ఓసారి చదవండి…
తెలుగు లిపి సంస్కరణతో మన పిల్లలు తెలుగు చదవడము, రాయడానికి కుతూహలము చూపిస్తారు.
తేట తెలుగు లిపి, యూనికోడు (కంప్యూటర్) లో రాసే పద్దతి.
తేటతెలుగు లిపిలో మహప్రాణాలు (ఖఘఛఝ…) స్తానంలో అల్పప్రాణాలు (కగచజ..) వత్తులతో సహ రాయబడును. దయచేసి అందరు తేటతెలుగు లిపిలో రాసి తెలుగు లిపి (బాషను) సులబం చేయండి.
తేట తెలుగు లిపిలో 37 అక్షరాలు…
అచ్చులు (12):
అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఎ,ఏ,ఐ,ఒ,ఓ,ఔ.
హల్లులు (24):
క,గ,చ,జ,ట,డ,ణ,త,ద,న,ప,ఫ,బ,మ,య,ర,ల,వ,శ,ష,స,హ,ళ,ం.
రుత్వం (1):
ృ.
తీసివేసిన అక్షరాలు (17)
ఋ,ఋూ,ఖ,ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,భ,ఱ,ః, ఞ, ఇన్య, లులు,లులూ.
కల్పవలసిన అక్షరాలు (3)
క్ష,(0c3a), ద్విపొల్లు(0c4e), ఏకపొల్లు(0c11).
0c3a, 0c4e, 0c11 unicodes. తెలుగు పదాలను sort చేసినపుడు అక్షర క్రమంలో రావాలంటె, ఆ మూడు అక్షరాలను ఆ స్తానాలలో దృవీకరించాలి.
ృ ఉంచడానికి కారణం అరువు తెచ్చుకున్న సంస్కృత పదాలలో ృ వాడకము ఎక్కువగా ఉంటది.
మృగం రెండు విదాలుగ రాయవచ్చు.
1. మృగం 2. మ్రుగం.
1. మ+ృ+గ+ం- మృగం (4 కీ స్ట్రోకులు).
2. మ+్+ర+ు+గ+ం- మ్రుగం (6 కీ స్ట్రోకులు). ృ రెండు కీ స్ట్రోకులు తగ్గిస్తది..
(+ క్రమాన్ని సూచిస్తది, కీ స్ట్రోకు కాదు).
గుణితం రూలు:
క+ా=కా, క+ి=కి, క+ీ=కీ,
క+ు=కు, క+ూ=కూ,
క+ె=కె, క+ే=కే, క+ై=కై,
క+ొ=కొ, క+ో=కో, క+ౌ=కౌ,
క+ం=కం, క+ృ=కృ
వత్తుల రూలు:
పొల్లు (్) తరవాత ఏ హల్లు రాస్తె, అది వత్తుగా మారగలదు.
ద+్+య= ద్య
ద+్+య+ా=ద్యా
గ+్+న+ి= గ్ని
స+్+త+్+ర+ీ= స్త్రీ
అ+క+్+క= అక్క
కొత్త అక్షరాలు:
1. క్ష రాయాలంటె క+్+ష=క్ష (3 కీ స్ట్రోకులు). క్ష ను అక్షరముగా గుర్తిస్తె 1 కీ స్ట్రోకు గా రాసుకోవచ్చు. క్ష ను హిందిలో ఒక అక్షరముగా గుర్తించరు.
2. ద్విపొల్లు- కొత్త అక్షరముగా గుర్తిస్తె ఒక కీస్ట్రోకు తగ్గుతది. ముప్పై శాతం తెలుగు పదాలలో ద్విపొల్లు వాడబడును.
అ+క+్+క= అక్క (4 కీ స్ట్రోకులు.
అ+క+^= అక్క (3 కీ స్ట్రోకులు- “^” ద్విపొల్లు గుర్తు గా చూపించబడ్డది).
అ+మ+^=అమ్మ
మ+ు+ద+్+ద+ు= ముద్దు (6 కీ స్ట్రోకులు).
మ+ు+ద+^+ు=ముద్దు (5 కీ స్ట్రోకులు- ద్విపొల్లు వాడడము వలన)
3. ఏకపొల్లు- కొత్త అక్షరము. కొన్ని సాంకేతిక, శాస్త్రీయ పదాలలో ఏకపొల్లు తరువాత వచ్చిన హల్లును వత్తుగా మార్చదు. ఉదా. Expect పదాన్ని ఇప్పటి తెలుగులో రాస్తె ఎక్స్పెక్టు మారుతది, చదవడము కష్టము. ఏకపొల్లు వాడి ఇలా రాయవచ్చు ఎక్స్.పెక్టు -ఇక్కడ “.” ను ఏకపొల్లుగా చూపించబడింది కాని కనిపించదు, స్పేస్ ఉండదు.
గమనిక1: ఒకటి రెండు పేజీలకు ఎక్కువగా రాసేవారు ఈ కీ స్ట్రోకుల తగ్గింపును హర్షించ గలరు.
ఎవరైన సలహాలు ఇవ్వదలచు కుంటె mkreddy1@yahoo. com కు పంపగలరు.
గమనిక2: మహాప్రానాలు తప్పక రాయాలి అంటె మరొక ఆలోచన. ఈ విదానములో మహప్రానాల వత్తుల స్తానములో అల్పప్రానాల వత్తులు మాత్రమే వాడబడును.
భయం ను బఃయం (ః ను హత్తుగా రాయవచ్చు).
ముఖ్యమంత్రి – ముక్యఃమంత్రి.
ఘంటసాల- గఃంటసాల.
ఛందస్సు- చఃందస్సు.
ఝాన్సి – జాఃన్సి.
పాఠశాల-పాటశాల లేక పాటఃశాల.
ఢంక- డఃంక.
థాంక్యు-తాఃంక్యు
ధనస్సు-దఃనస్సు.
వీటితొ కొన్ని చిన్నచిన్న సమస్యలు రావచ్చు….
మదు కె. రెడ్డి
Founder & First President of TDF (Telangana Development Forum, USA.
Venice, FL
mkreddy1@yahoo.com
(ఇది రచయిత అభిప్రాయం... అందరూ ఏకీభవించాలని ఏమీ లేదు, కరెక్ట్ కాదు అనే వాదనలు నిర్దిష్టంగా, సరైన విధంగా ఉంటే అవీ ఆహ్వానిద్దాం... చర్చ మంచిదే)
Share this Article