.
చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్ కి ముందు రోజు రాత్రి అహ్మదాబాద్ కి ఫ్లైట్ లో వెళ్లి… నైట్ ఫ్రెండ్ ఇంట్లో పడుకొని.., మధ్యాహ్నం మ్యాచ్ కి వెళ్లి… వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓడిపోవడం గ్రౌండ్ లో చూసాక.. ఎందుకో క్రికెట్ అంటే ఇష్టం తగ్గటం మొదలయింది… వైరాగ్యం వచ్చినట్టయింది…
- గత రెండు సంవత్సరాలుగా ఓటమే అన్నది ఎరుగని టీం ఇండియా మళ్ళీ ఒక్కసారి టైం మెషిన్ లోకి వెళ్లి, ఆనాటి ఆ వరల్డ్ కప్ ఫైనల్ ఆడితే ఎంత బాగుండునో కదా అనిపిస్తుంది…
వెస్టిండీస్ లో ఫైనల్ గెలిచాక రోహిత్ శర్మ గ్రౌండ్లో బలంగా తన ఎమోషన్స్ కి నేలగుద్ది మరీ చెప్పడం కాస్త రిలీఫ్… కానీ ఇప్పటికి ఇన్ని విజయాలు సాధించినా ఆ రోజు ఓటమే ఇంకా పోవట్లేదు… బహుశా ఆ ఓటమి ప్రతీకారమేమో ఇన్ని విజయాలు…
Ads
ఆ ఓటమి తరవాత, ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్, ఇప్పుడు ఆసియా కప్… మొత్తము 31 మ్యాచుల్లో 30 విజయాలు అంటే (టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు ) దండయాత్ర… ఇది ఇండియా దండయాత్ర…
వైట్ బాల్ ICC tournament లలో మనం కొట్టని టీం లేదు, గెలవని కప్ లేదు, ప్రపంచంలోనే ఒక ధనిక స్పోర్ట్స్ బాడీ బీసీసీఐ ఆటగాళ్ల మీద పెట్టుబడి, సౌకర్యాల కల్పన, ప్రపంచ క్రికెట్ ని శాసించే తీరు వీటన్నిటికి మూలం IPL… ఎందరో మారుమూల పల్లెలు, పట్టణాల నుంచి వచ్చే యువ ఆటగాళ్ళకి తమ టాలెంట్ చూపించే ఓ వేదికయింది…
ఇది నాణేనికి ఒక వైపు, ఇదే ఐపీఎల్ వలన చాలా మంది యువ ఆటగాళ్లు క్రికెట్ అంటే t20 మాత్రమే అనే స్టేజ్ కి వచ్చి లాంగ్ ఫార్మాట్, అసలైన క్రికెట్ అయిన టెస్ట్ మ్యాచులని దూరం చేసుకోవడం ఆటకి మంచిది కాదు..,
క్రికెట్ అంటేనే ఇప్పటికీ ఒక ఐదు దేశాల ఆటగా ముద్ర పడింది… ఈ విజయాలు మన ఆటగాళ్లనీ తక్కువ చేసేవి ఏమీ కావు, కానీ ఒక ఫుట్ బాల్ లా, ఒక ఒలింపిక్స్ లా క్రికెట్ ని గ్లోబల్ గేమ్ గా మార్చి, దానిలో ఈ డామినేషన్ చూపిస్తే వచ్చే మజాయే వేరు…
ఆ రోజులూ రాబోతున్నాయి, చాలా దేశాలు క్రికెట్ ఆటలోకి వస్తున్నాయి… ఒలింపిక్స్‌లో కూడా క్రికెట్ చేరబోతోంది… ( గోపు విజయకుమార్ రెడ్డి
)
Share this Article