Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉడికీఉడకని ఇడ్లీ… ధనుష్ నటుడిగా డిస్టింక్షన్… దర్శకుడిగా జస్ట్ పాస్…

October 1, 2025 by M S R

.

ధనుష్ మంచి నటుడు… ఏ పాత్ర అయినా సరే మనసు పెట్టి అందులో లీనమవుతాడు… తన బెస్ట్ ఇస్తాడు… సోకాల్డ్ కమర్షియల్ సరుకులే కాదు, మన చుట్టూ కనిపించే కథలనూ ఎంచుకుంటాడు, అంగీకరిస్తాడు…

మానవాతీత శక్తులు కలిగిన స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్ల పాత్రల్లో ఇతర హీరోలు ప్రేక్షకుల తలలు తింటుంటే… ధనుష్ మాత్రం మన కథల్ని, డౌన్ టు ఎర్త్ కథల్ని, పాత్రల్ని పట్టుకుంటాడు… ఇక్కడి వరకూ గ్రేట్…

Ads

కానీ ఓ రచయితగా, ఓ దర్శకుడిగా మాత్రం సోసో… అందుకే ధనుష్, ఎవరి పని వాళ్లు చేయాలి… నువ్వు నటించు, దర్శకత్వం, గానం, రచన వేరేవాళ్లకు అప్పగించు… అది నీ కెరీర్‌కే మంచిది… అప్పుడు జనాల్ని మరింత మెప్పిస్తావు, గ్యారంటీ… ఉదాహరణ, ఈరోజు విడుదలైన నీ సినిమా ఇడ్లీ కొట్టు… ఆమధ్య వచ్చిన రాయన్ కూడా…

నిత్యామేనన్… సేమ్, మంచి నటి… కానీ ఆమె బరువు ఆమెకు కాస్త మైనసే… ఇదే అంటే, నా బరువు నా ఇష్టం, నువ్వేమైనా మోస్తున్నావా, నా నిర్మాతలకు లేని నొప్పి నీకేమిటి అంటుంది ఆమె… అపర్ణ బాలమురళీ అంతే… మొన్నటి సార్ మేడమ్ సినిమా పాత్రలోనూ, ఇప్పుడు ఈ ఇడ్లీ కొట్టు అనే సినిమా పాత్రలోనూ బాగా చేసింది… అంటే అన్నామంటుంది గానీ, ధనుష్ పర్సనాలిటీ పక్కన ఆడ్‌గా కనిపించింది…

ఎందుకు ధనుష్ రచయితగా, దర్శకుడిగా జస్ట్ పాస్ అంటున్నానంటే… ఈ సినిమాలో తన తండ్రి ఆత్మ గజ్జెలు కట్టుకుని వచ్చి నిద్రలేపడం… కాంతారా గుర్తుకొస్తుంది… ఎస్, కాంతారా చాప్టర్1 నీ ఇడ్లీకొట్టుకు పోటీ వస్తుందని తెలిసి సేమ్ ఆ పాత్రను ఈ సినిమాలో పెట్టావా ధనుష్..? ఆత్మలు గజ్జెలు కట్టుకుని తిరుగుతాయని ఎవరు చెప్పారు నీకు..?

వోకే, తండ్రి చెప్పినట్టుగా… ఒక ఇడ్లీ కొట్టుకు నువ్వు పరిమితం కాలేవు, ఫ్రాంచైజీ పెట్టి విస్తరించడానికి తండ్రి ఒప్పుకోడు… అదేమంటే, ఎవడో వండి ఇడ్లీలను నా పేరుతో అమ్ముకోవాలా అంటాడు తండ్రి… అంత బాగోలేదు ఈ పాయింట్…

సరే, తరువాత హీరో విదేశాలకు వెళ్తాడు, అక్కడా ఓ హోటల్ చెయిన్‌లో పని, ఓనర్ బిడ్డతో ప్రణయం, ఈలోపు తండ్రి మరణవార్తలో స్వదేశానికి వాపస్… తండ్రి చనిపోయాక తను అనుకున్నట్టు ఫ్రాంచైజీలతో తన వ్యాపారాన్ని విస్తరించొచ్చు కదా…

అదే రుబ్బురోలుకు ఫిక్సయిపోయి, అదే ఆదర్శం అని ఫిక్సయిపోతాడు, హేమిటో… ఊరు వదలక అదే చిన్న ఇడ్లీ కొట్టే ప్రపంచం అనుకోవడమే తండ్రి మార్క్ గాంధీయిజం… వారసత్వంగా తనూ అదే ఫిక్సయిపోతాడు ధనుష్… పెద్దగా తెలుగు ప్రేక్షకులకు కనెక్టవుతుందని అనుకోలేం…

కానీ కొన్ని మెచ్చుకోవాలి… ఇదే స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్ల ఫైట్లు, ఐటమ్ సాంగ్స్, స్టెప్పుల సోకాల్డ్ వెగటు సినిమా మాత్రం కాదు… మన చుట్టూ, మన ఇంట్లో, మన ఊళ్లో కనిపించే కథ, అవే పాత్రలు… అశ్లీలం లేదు, అసభ్యత లేదు, బూతుల్లేవు… నీట్‌గా ఉంది, కాకపోతే ఈతరం సినిమాల్లో ఉండాల్సిన ట్విస్టులు, హైలు లేకుండా ప్లెయిన్‌గా, ఫ్లాట్‌గా ఉంది… అందుకే సినిమా బాగా స్లో…

కొన్నిచోట్ల ఎమోషన్ల సీన్స్ బాగున్నాయి… ఎటొచ్చీ సంగీతం మైనస్, ఆ పాటలు ఎవరికీ ఎక్కవు, బీజీఎం జస్ట్ వోకే… శాలినీ పాండే, అరుణ్ విజయ్, సముద్రఖని, సత్యరాజ్ కూడా ఉన్నారు సినిమాలో… ధనుష్ ఎవరికైనా ఔట్ సోర్సింగ్ ఇచ్చి కాస్త డెప్త్ ఉండేలా కథను రాసుకుని, దాన్నే ప్రజెంట్ చేస్తే ఇడ్లీ మెత్తగా, తెల్లగా బాగా ఉడికెేదేమో…! ప్చ్, బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ డియర్ ధనుష్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈతరం తప్పక చదవాల్సిన శాస్త్రి డెత్ మిస్టరీ… ఎవరు చంపారు..?!
  • ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!
  • 75 weds 35 … పెళ్లిరోజు రాత్రే కుప్పకూలాడు… ఏం జరిగి ఉంటుందబ్బా…
  • బాహుబలితో స్టార్ట్… పదేళ్లలో ఏడు సౌత్ సినిమాలదే హవా..!!
  • యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను బుక్ చేయడమే… ఖాకీ బుక్..!!
  • వేటూరి వీక్, పరుచూరి వీక్… కథ వీక్, కథనమూ వీక్… కృష్ణ సినిమా వీక్…
  • కాంతార చాప్టర్-1… రిషబ్ శెట్టి మళ్లీ కొట్టాడు… అవే పూనకాలు..!!
  • ఉడికీఉడకని ఇడ్లీ… ధనుష్ నటుడిగా డిస్టింక్షన్… దర్శకుడిగా జస్ట్ పాస్…
  • పోలీసులకు ఐ-బొమ్మ హెచ్చరిక వైరల్… కానీ కంటెంటు పాతదే…
  • ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అమ్మకమే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions