.
నన్ను ఆపేదెవరు!’… కాపర్-టి పిడికిట్లో పట్టుకుని మరీ పుట్టిన బ్రెజిల్ శిశువు!
బ్రెజిల్ : గర్భం రాకుండా తల్లి వాడిన కాపర్-టి (IUD) తన చిన్న పిడికిలిలో గట్టిగా పట్టుకుని ఓ మగ శిశువు జన్మించిన అద్భుత ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది… వైద్యరంగంలోనే ఇదొక అరుదైన, ఆశ్చర్యపరిచే సంఘటన…
Ads
గోయియాస్‌లోని నెరోపోలిస్‌లో గల హాస్పిటల్ సాగ్రాడో కొరాకావో డీ జీసస్ (Hospital Sagrado Coração de Jesus) లో మాథ్యూస్ గాబ్రియెల్ అనే ఈ మగబిడ్డ జన్మించాడు… శిశువు తల్లి, క్విడీ అరాఉజో డి ఒలివెరా, దాదాపు రెండేళ్లుగా అత్యంత ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతి అయిన కాపర్ కాయిల్ (Copper Coil) ను ఉపయోగిస్తున్నది…
సాధారణంగా, ఈ పరికరం 99 శాతం కంటే ఎక్కువ గర్భధారణను నిరోధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది… అయితే, ఒలివెరాకు ఈ కాయిల్ శరీరంలో ఉన్నప్పటికీ గర్భం వచ్చిందని సాధారణ చెకప్‌లో తెలిసింది… గర్భస్థ శిశువుకు ప్రమాదం కలగకుండా ఉండాలంటే కాపర్-టి తొలగించవద్దని డాక్టర్లు సలహా ఇవ్వడంతో, ఒలివెరా ప్రసవం వరకు దానిని అలాగే ఉంచేసింది…
బిడ్డ పుట్టిన వెంటనే, శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆ IUD కూడా బయటకు వచ్చింది… అక్కడే ఉన్న డాక్టర్ నటాలియా రోడ్రిగ్స్, ఈ అద్భుతాన్ని మరింత గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు… కాపర్-టి జాగ్రత్తగా తీసి, దాన్ని మాథ్యూస్ చిన్న చేతిలో పెట్టారు. ఆ సమయంలో తీసిన ఫొటో ఇప్పటికీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది…
“నన్ను ఆపలేని IUD… నా విజయానికి ట్రోఫీని పట్టుకున్నాను!” అనే శీర్షికతో డాక్టర్ రోడ్రిగ్స్ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు… ఈ ఫోటోను చూసిన వారంతా… “ప్రపంచంలోకి రావాలని ఆ బిడ్డ ఎంత గట్టిగా నిర్ణయించుకున్నాడో!” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు…
Share this Article