.
Psy Vishesh …. “డాక్టర్… మా అమ్మ చచ్చినందుకు నాకు చా…లా… సంతోషంగా ఉంది.”
ఆ మాట వినగానే ఏసీ గదిలో కూడా శరీరం గడ్డకట్టినట్లు అనిపించింది.
తల్లి గురించి కూతురు అలా మాట్లాడటం పిడుగు పడ్డట్టు అనిపించింది.
కానీ నా ముఖం ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఆమెని జడ్జ్ చేస్తే, నాపై ఆమెకున్న నమ్మకం ఒక్కసారిగా కూలిపోతుంది.
అందుకే, లోతుగా శ్వాస తీసుకుని, నిదానంగా అడిగాను:
“ఎందుకు మీకలా అనిపించింది?” అని.
Ads
నా ముందున్నది… కోట్లాదిమంది అభిమానించే ఒక నటి. ఆమె నటనంటే పడిచచ్చిపోయే వారు ఎంతమందో. ఆమెను చూడగానే ప్రేక్షకుల కళ్లలో వెలుగులు కనిపిస్తాయి. కానీ నా ఎదుట కూర్చున్న ఆమె కళ్లలో మాత్రం ఎండిపోయిన కన్నీటి గీతలు కనిపిస్తున్నాయి.
ఆమె కాసేపు మౌనంగా. చేతులు బిగబట్టి కూర్చుంది. తర్వాత ఒక్కసారిగా కళ్లలో అణచుకున్న దశాబ్దాల వేదన ఉప్పొంగింది.
‘‘మా అమ్మ నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు డాక్టర్’’ అంటూ వణుకుతున్న స్వరంతో చెప్పింది.
‘‘అదేంటీ? ఎందుకలా? కొంచెం వివరంగా చెప్పగలరా?’’ అని అడిగాను.
‘‘మా అమ్మ యాక్టర్ కావాలనుకుని కాలేకపోయింది. దాంతో నేను పుట్టినప్పుటినుంచీ నన్ను యాక్టర్ చేయాలని కలలు కంది. నా జీవితాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది.
చిన్నప్పటినుంచీ నేను తినే ప్రతీ మెతుకూ లెక్క కడుతుంది. 400 కేలరీలు దాటితే ఆరోజు ఇంట్లో యుద్ధమే.
నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి… అన్నిటిపై ఆమెదే పెత్తనం. నాదంటూ ఏమీ లేదు.
నా కెరీర్ నా కల కాదు. ఆమె ఫెయిల్యూర్డ్ కలలను తీర్చుకునే ప్రయత్నం.
‘‘నీ కోసం నా జీవితం మొత్తం త్యాగం చేశాను’’ అని నెలకో పదిసార్లు చెప్తుంది. ఆ మాట నా మనసులో బలంగా పాతుకుపోయింది. అమ్మకు రుణపడ్డాననే గిల్ట్ తో బ్రతికాను.
ఇన్నేళ్లూ నేను బ్రతికింది ఆమె సంతోషం కోసమే. ఆ క్రమంలో నేనెవరో నేనే మర్చిపోయాను.’’
ఆమె మాటల్లో దాగి ఉన్న నిస్సహాయత లోతుగా తాకింది.
‘‘మీ ఆవేదన అర్థమవుతోంది. కానీ… మీరు స్టార్ అయ్యారు కదా. అందరికీ మీ మీద అభిమానముంది. దానితో సంతోషం ఉండదా?” అని అడిగాను.
ఆమె కొద్దిసేపు ఊపిరి బిగపట్టి, చేదు నవ్వుతో చెప్పింది.
“లేదు సర్. ప్రేక్షకులకు నేను స్టార్. అందరూ నన్ను చూసి ఆనందిస్తారు.
కానీ తెరవెనుక… విపరీతమైన డైట్ కంట్రోల్. కొన్నిసార్లు ఆకలితో నిద్రపోతాను.
నువ్వు స్లిమ్ గా ఉండాలి, లేకపోతే ఛాన్సులు రావంటూ అమ్మ బెదిరిస్తూ ఉంటుంది.
ఒక్కోసారి నిర్మాత లేదా దర్శకుడు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అవన్నీ చూసీ చూడనట్లు పోవాలంటుంది.
సినిమా ఛాన్సులకోసం కొంత కాంప్రమైజ్ అయినా తప్పు లేదన్నది తన ఫిలాసఫీ. అది నాకు నచ్చదు.
ఆమెకు నేను ఒక ‘ప్రొడక్ట్’, ‘బ్రాండ్’, ‘మనీ మెషీన్’. అంతే.
కోట్లు సంపాదించినా ఓ పదివేలు స్వంతంగా ఖర్చుపెట్టుకోలేదు.
ప్రపంచం నన్ను సెలబ్రిటీ అంటుంది. కానీ, నాకు నేను ఒక మరబొమ్మను మాత్రమే.’’
‘‘ఐయామ్ సారీ.’’
ప్రేమ ముసుగులో జైలు
ఆమె కళ్లవెంట నీళ్లు కారుతున్నాయి. కానీ మాటలు ఆగడంలేదు. ఎన్నేళ్లుగానో దాచుకున్న ఆవేదనంతా మాటల రూపంలో ప్రవహిస్తోంది.
‘‘మా అమ్మ నన్ను ప్రేమించలేదు అనడంలేదు. ప్రేమించింది. ప్రేమ పేరుతో నా చుట్టూ బలమైన జైలు కట్టింది. అది ఎవ్వరికీ కనిపించని జైలు. నన్ను ప్రతీక్షణం బంధించిన సంకెళ్లు.
ఆమె చేతిలో నేనో పప్పెట్. ఆమె సంతోషం కోసం నా ఆనందాన్ని త్యజించాను. ఆమె ఆశల కోసం నా childhoodను కోల్పోయాను. ప్రేమ రూపంలో వచ్చిన ఈ imprisonment నా identityని నాశనం చేసింది.”
‘‘అందుకే డాక్టర్… అమ్మ చనిపోయిన రోజు నేను ఏడవలేదు’’ అని ఒక్కసారిగా లోతుగా శ్వాస తీసుకుంది.
‘‘ఆమె చావుతో నాకు విముక్తి లభించింది అనిపించింది. ఏళ్ల తరబడి నన్ను బాధించిన కంట్రోల్, మేనిప్యులేషన్, గిల్ట్ అన్నిటినుంచీ. నా మాటలు వింటే మీకు నేనో రాక్షసిలా కనిపిస్తున్నా కదా?’’
‘‘నో నో, మీరెంత క్షోభ అనుభవించారో నాకు అర్థమవుతోంది.’’
ఆమె కాసేపు మౌనంగా ఉండి, తర్వాత లోతుగా శ్వాస తీసుకుంది.
‘‘ఎస్ డాక్టర్. మా అమ్మ చనిపోయినరోజునే నేను మొదటిసారి ఊపిరి పీల్చుకున్నాను. మొదటిసారి ‘నేను ఎవరో’ తెలుసుకున్నాను. మొదటిసారి నాకు స్వేచ్ఛ వచ్చింది. ప్రపంచం నన్ను హార్ట్‌లెస్ అని అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం — అది నా first breath.”
మౌనంగా ఆమెను చూస్తూ కూర్చున్నాను. నా మనసులో ఒక ఒక పెద్ద సత్యం ప్రతిధ్వనించింది.
“ఇది ఆమె ఒక్కరి కథ కాదు. ఇది తల్లిదండ్రుల కలల్లో బందీలైన వేలాది పిల్లల కథ.”
ఇది జరిగి చాలాకాలమైంది. కానీ ఆ నటి మాటలు నా చెవుల్లో ఇంకా మ్రోగుతున్నాయి:
‘‘మా అమ్మ చచ్చినందుకు నాకు చా…లా… సంతోషంగా ఉంది.”
ఇది ఒక కూతురి క్రూరత్వం కాదు.
స్వేచ్ఛ కోసం ఒక కూతురి ఆరాటం.
పది సెషన్ల తర్వాత ఆమె మామూలు మనిషి కాగలిగింది.
ఆమె కథ వింటున్నప్పుడు, నాకు స్పష్టంగా మూడు themes కనబడాయి:
1. Toxic Love / Enmeshment
🔹boundaries లేకుండా, complete controlలో ఉన్న బంధం.
🔹తల్లిదండ్రుల ప్రేమ అంటే ‘ownership’ అనిపించడం.
2. Child as Product (Parentification + Exploitation)
🔸తల్లిదండ్రుల unmet dreamsని పిల్లల మీద రుద్దడం.
🔸పిల్లని commodityగా వాడటం.
3. Healing through Truth
▪️ నిజం చెప్పినప్పుడే హీలింగ్ మొదలవుతుంది
▪️ Forgiveness కంటే నిజం చెప్పడమే బలమైనది.
నిజానికి చాలామంది ఇళ్లలో ఇలాంటి కథే జరుగుతోంది.
• “డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి” అని పిల్లల మీద కలలు రుద్దడం.
• “మార్కులు వస్తేనే విలువ” అని continuous message.
• “నేను నీ కోసం త్యాగం చేశాను” అని guilt trip.
• “ప్రేమ = కంట్రోల్” అని పొరపాటు.
ఇవన్నీ మీ పిల్లలకు జైలులా కనిపిస్తాయి. ఏదో ఒకరోజు మీ బిడ్డ నుంచి కూడా ఇలాంటి వాక్యం వినిపించవచ్చు. Be careful…..
.
Parents,
Ask yourself tonight –
Is my love oxygen for my child? Or is it a prison?
What does healthy parenting mean to you?
సైకాలజిస్ట్ విశేష్….. 8019 000066 ….
Share this Article