.
ఈసారి ఆహా ఓటీటీ ఇండియన్ ఐడల్ తెలుగు మ్యూజిక్ షో ఎందుకు భ్రష్టుపట్టింది..? ఈ ప్రశ్న తెలుగు టీవీ, సినిమా రంగాల క్రియేటర్లు ఆత్మసమీక్ష చేసుకోవాల్సిన కీలక ప్రశ్న…
ప్రోగ్రాం వస్తున్నప్పుడు మధ్యమధ్యలో ఒక యాడ్ వచ్చేది, మొన్నటి సీజన్‌కు అది రెండు యాడ్స్‌కు పెరిగింది… ఇప్పుడు మూడు యాడ్స్… యాడ్స్ ఎవడు చూస్తాడులే అనుకున్నారేమో… అసలు ప్రోగ్రామ్‌లోనే యాడ్స్, బ్రాండ్స్ ప్రమోషన్, నానా చెత్తా…
Ads
సింగర్ శ్రీరామచంద్ర, అలియాస్ మేల్ శ్రీముఖిలా హైపిచ్‌లో గొంతుచించుకుని అరుస్తున్నాడు… తోడుగా సమీర భరద్వాజ… యాడ్ ఆన్ మోర్ అంటూ ఆమెను తీసుకొచ్చి పెట్టారు, అదనపు ఫాయిదా ఏమీ లేదు…
ఈసారి సినిమా సంగీతంలో సంబంధం ఉన్న ఒక్క గెస్టూ లేడు… అన్నీ సినిమా ప్రమోషన్లే… మరీ ఇది కూడా సుమ అడ్డా షోలాగా మారిపోయింది… ఫాఫం ఆహా ఓటీటీ…
ఓ ఎపిసోడ్‌లో అసలు థమన్ లేడు, మధ్యలోనే ఓజీ ప్రమోషన్స్ ఉన్నాయని పారిపోయాడు… మిగతా షో పేలవం… ఈసారి ఎపిసోడ్‌లో గీతా మాధురి మాయం.,. టెంపరరీయా..? తరిమేశారా తెలియదు… ఈ నిర్వాకాలకు తోడు సగటు జీతెలుగు పైత్యంలాగా సింగర్స్ పాడుతుంటే వేదిక మీద గ్రూపు డాన్సులు…
మొన్నటి ఎపిసోడ్ అయితే మరీ బీభత్సం… పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు థమన్ కదా కంపోజర్… ఇక చూసుకో నాసామిరంగా పవన్ కల్యాణ్ భజన, కీర్తన, ఆలాపనల్లో ఈ షో తరించిపోయింది… అక్కడ పెట్టిన పవన్ కల్యాణ్ చిన్న కటౌట్లు…
కంటెస్టెంట్ పాట పాడటానికి ముందు ఆ కటౌట్‌కు దండం పెట్టుకుని, దాంతో సెల్ఫీ తీసుకుని నానా పైత్యాలు… ఇదేం మ్యూజిక్ షోరా బాబూ… థమన్ కంపోజర్‌గా ఉంటే ఇక మొత్తం ఆ సినిమా ప్రమోషనేనా..?
నిజానికి జడ్జిలు కార్తీక్, గీతామాధురి, హోస్టులు శ్రీరామచంద్ర, సమీరా అందరూ గాయకులే… థమన్ సరేసరి… ఎంత అర్థవంతంగా, ఎంత రాగయుక్తంగా సాగాలి షో…? పూర్తి భిన్నంగా సాగుతోంది… చివరకు పాటల నడుమ కంటెస్టెంట్లను పిలిచే తంతులోనూ స్పాన్సర్ల బ్రాండ్ ప్రమోషన్లే… చిరాకుగా…
ఇక్కడ మళ్లీ ఈటీవీ పాడుతా తీయగా షోను ఓసారి మెచ్చుకోవాలి… ఈటీవీ రీచ్ మరీ దరిద్రంగా పడిపోయింది గానీ… ఎస్పీ చరణ్ ఈ షోను మరీ భ్రష్టుపట్టించలేదు… గత సీజన్ మొత్తం సీనియర్ సింగర్లను, అంటే ఆల్రెడీ ఫీల్డులో ఉన్నవాళ్లను తీసుకున్నారు… కొత్తవాళ్లు కాదు…
సరే… స్వరాగ్ విజేత… నిజానికి కార్తికేయ లేదా శ్రీలలిత కావల్సింది… అంతేలే, వర్ధమాన గాయని ప్రవస్తి ఆరోపించినట్టు సునీత రాగద్వేషాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి ఆ షోను… ఫాఫం ఎస్పీ చరణ్…!
ఆ షోకు బలం చంద్రబోస్… అతి అనిపించినా సరే, తనొక్కడే కాస్త తెలివిగా, భావయుక్తంగా కామెంట్స్ చేస్తుంటాడు… కీరవాణిని తెచ్చుకున్నారు కానీ తనేం చెబుతున్నాడో తనకే అర్థం కాదు… ఈసారి మళ్లీ కొత్త కంటెస్టెంట్లలో తదుపరి సీజన్ తీసుకురాబోతున్నారు… గుడ్… అదే కావల్సింది…
జీతెలుగు లిటిల్ చాంప్స్ మరో దరిద్రం… అసలు ఆ షోకు హోస్ట్ సుధీర్, తనే ఆకర్షణ… దీనికి ఎస్పీ శైలజ, అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, కొణిదెల నీహారిక జడ్జిలు… సరే, శైలజ, అనంత శ్రీరామ్ వరకూ వోకే… అనిల్ రావిపూడికి సినిమా సంగీతానికి సంబంధించి పెద్ద సీన్ లేదు, కాకపోతే అదొక అట్రాక్షన్, షోను పూర్తిగా ఓ ఫన్ షోగా మార్చేసే క్రమంలో తన ఎంపిక, ఇక నీహారిక అసలే సూట్ కాదు..!!
Share this Article