.
స్టార్ మాటీవీలో వచ్చే బిగ్‌బాస్ ఈ సీజన్‌ను చాలామంది చూడటం మానేశారు… చూసేవాళ్ల కోసం మాత్రమే ఈ కథనం…
గత రెండుమూడు సీజన్లు అడ్డంగా బోల్తాకొట్టాయని ఈసారి ఓ వెధవ తంతుకు తెరలేపింది బిగ్‌బాస్ క్రియేటివ్ టీం… సామాన్యులను (కామనర్స్ అట, అది సరైన పదమేనా..?) చాలామందిని హౌజులో ప్రవేశపెట్టడం… నిజానికి సెలబ్రిటీలు ఆడితేనే అదొక ఆకర్షణ…
Ads
సామాన్యులను ఎంత ఆడించినా దానికి సెలబ్రిటీ ఆకర్షణ రాదు… పైగా హౌజులోకి గతంలో తీసుకొచ్చిన కామనర్స్ ఎవరూ క్లిక్ కాలేదు, అలరించలేదు… చివరకు ఓ సీజన్‌లో పల్లవి ప్రశాంత్ గెలిచినా తను చివరకు ఎలా మారిపోయాడో, తన అసలు స్వరూపం ఏమిటో జనానికి తెలిసి చీదరించుకున్నారు…
ఇప్పుడిక ఏకంగా ఏడుగురిని ప్రవేశపెట్టారు… (పైగా దివ్య లేటరల్ ఎంట్రీ)… వీరిలో రెండో వారమే మర్యాద మనీష్ ఔట్… మూడో వారం ప్రియా శెట్టి ఔట్… ఇప్పుడు నాలుగో వారం హరిత హరీష్ ఔట్… వరుసగా వికెట్లు… హరీష్ కాకపోతే శ్రీజ ఔటయ్యేది…
హౌజులో ఉన్నవాళ్లలో డెమో పవన్, కల్యాణ్ కూడా విసిగిస్తున్నారు… అంటే అగ్నిపరీక్ష అనబడే ఓ పైత్యపు ఎంపికల ప్రక్రియలో మేటి ఆటగాళ్లు, తోపులు అని ఏరి కోరి హౌజులోకి పంపిన వారంతా హౌజుకు పనికిరాని వారే… అని వాళ్లకు పడుతున్న వోట్లు చెబుతున్నాయి…
అసలు వీకెండ్ షోలలో నాగార్జునతో ఎలా మాట్లాడాలో కూడా వాళ్లకు తెలియడం లేదు.., కూర్చునే పద్ధతీ తెలియదు… కెమెరాకు మేమెలా కనిపిస్తున్నామనే సోయి కూడా లేదు… వీళ్ల ఎంపికలకు జడ్జిలుగా వ్యవహరించిన అభిజిత్, బిందుమాధవి, నవదీప్… చివరకు శ్రీముఖి కూడా ఈ ఎంపికలకు, ఈ సీజన్ వైఫల్యానికి బాధ్యులు…
ఈరోజు ఎలిమినేటైన హరీష్ ఏదో మాస్క్ మ్యాన్‌లా వచ్చాడు… తొలి రోజు నుంచే తనే కెప్టెన్ అన్నంత బిల్డప్… ఎంటర్‌టైన్ చేయలేడు, ఎప్పుడూ ఏదో ఓ మూల కూర్చుంటాడు… పైగా నిరాహార దీక్షలు… అడ్డమైన జస్టిఫికేషన్లు… అసలు ఇన్ని రోజులు హౌజులో ఉండనివ్వడమే ఎక్కువ…
సెలబ్రిటీలలో ఫ్లోరా ఏదో కష్టపడుతోంది గానీ, మరీ సంజనకు అసిస్టెంటుగా మారిపోయింది… సంజన హడావుడిలో, ఆటలో, సందడిలో ఆకట్టుకుంటోంది… ఇమ్మూ బెటర్… రాము కూడా… సుమన్ శెట్టి, భరణి వోకే వోకే… అందరిలో బెటర్ తనూజ పుట్టస్వామి…
చివరగా రితూ చౌదరి… ఆమె ఎంత విసిగించినా సరే, ఒప్పందం మేరకు చాన్నాళ్లు కాపాడతుంది బిగ్‌బాస్ టీమ్… పవన్ కల్యాణ్‌తో ఏదో పులిహోర కలిపించి, షోకు కాస్త రొమాన్స్ అద్దాలని టీమ్ అనుకుంది గానీ… అదీ వర్కవుట్ కాలేదు… ఎదురుతన్ని ఏట్లో కలిసింది..!!
Share this Article