.
సారీ, ఒక డిస్టర్బింగ్ వార్త ఇది… సెన్సిటివ్ రీడర్స్ ఇక్కడే ఆగిపొండి ప్లీజ్… ముందుగా ఈ వార్త ఏమిటో చదవండి…
జంతువులతో అసాధారణ సంభోగం కేసులు చూశాం… మనుషుల్లోనే అసహజ సంభోగాల గురించీ విన్నాం, చదివాం, తెలుసుకున్నాం… కానీ ఇది ఓ మృతదేహంతో సంభోగం…
Ads
అప్పుడప్పుడు ఈ పర్వర్షన్ కేసులూ వింటున్నాం… ప్రతిఘటన ఉండదు, కేసులు పెట్టదు, ఎలా సంభోగించినా సరే అనుకుంటారేమో… ఆ కామోన్మాదులు… ఇదీ అలాంటి కేసే…
మధ్యప్రదేశ్ లోని ఖక్నార్ సీహెచ్ సీ మార్చురీలో జరిగింది ఈ ఘటన… సీసీటీవీ ఫుటేజీతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… 2024 ఏప్రిల్ 18న స్ట్రెచర్ పై ఉన్నమహిళ మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్లి నీలేశ్ భిలాలా (25) అనే కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు…
ఈ ఫుటేజీ కూడా వైరలయింది కూడా… ఏడాదిన్నర తర్వాత బయటపడింది… వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యాధికారి డాక్టర్ ఆదియా దావర్ అక్టోబర్ 7న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది… నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చి, రిమాండ్ కోసం జైలుకు తరలించారు… ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడనేది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి
వెల్లడించారు…
ఇదీ ఆ వార్త… ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఏమిటంటే..? ఎప్పుడో ఏడాదిన్నర తరువాత సీసీటీవీ ఫుటేజీలో దొరికిపోవడం ఏమిటి..? ఇప్పుడు దేనికోసం ఆ ఫుటేజీ చెక్ చేశారు..? ఎవరు..? ఇంకేవో వివరాల కోసం ఓల్డ్ ఫుటేజీ రివ్యూ చేస్తుంటే అనుకోకుండా ఇది దొరికిందా..? కొన్ని వేల గంటల ఫుటేజీలో సరిగ్గా ఆ సమయం ఫుటేజీ ఎలా దొరకబట్టారు..?
ఆసుపత్రి వర్గాలు, పోలీసులు అనేదేమంటే..? పాత ఫుటేజీని సమీక్షిస్తున్న (reviewing old footage) సాంకేతిక బృందం (technical team) ఈ వీడియోను చూసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని..!
ఇన్‌ఛార్జ్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (BMO) డాక్టర్ ఆదియా దావర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె దానిని కలెక్టర్‌కు తెలియజేసింది… కలెక్టర్ విచారణ కమిటీని ఏర్పాటు చేసి, వారి నివేదిక ఆధారంగా అక్టోబర్ 7న పోలీసులకు ఫిర్యాదు చేశారని ఓ సమాచారం…
ఐతే లోకల్ మీడియా ఏమంటున్నదంటే..? ఈ ఘటన జరిగిన సమయంలోనే నర్సింగ్ సిబ్బందికి తెలిసిందని, వారు కలత చెందారని, కానీ ఆ సమయంలో విభాగాధికారులు ఈ విషయాన్ని నెలల తరబడి అణచివేశారని (suppressed)..!
ఆసుపత్రిలోని సాంకేతిక బృందం (Technical Team) పాత సీసీటీవీ ఫుటేజీని సమీక్షిస్తున్నప్పుడు లేదా పరిశీలిస్తున్నప్పుడు (reviewing old footage) ఈ వీడియోను యాదృచ్ఛికంగా చూసి ఉంటారా..? ఈ బృందం సాధారణంగా పరిపాలనా లేదా వైద్య సిబ్బంది నియంత్రణలో కాకుండా, సాంకేతిక నిర్వహణ కోసం ఫుటేజీని చూసి ఉంంటారా.,.?
ఘటన జరిగిన సమయంలో ఉన్న అధికారులు ఆ విషయాన్ని అణచివేసినప్పటికీ, ఆ తర్వాత ఆసుపత్రి విభాగాధిపతులు (BMO) లేదా ఉన్నతాధికారులు (కలెక్టర్) మారారా..? కొత్త అధికారులు వచ్చిన తర్వాత, ఆసుపత్రిలోని పాత ఫైళ్లు లేదా సీసీటీవీ ఫుటేజీల నిర్వహణపై దృష్టి సారించి ఉంటారా..?
ఆసుపత్రి నిర్వహణలో జవాబుదారీతనం (Accountability) పెంచే ప్రయత్నంలో భాగంగా, లేదా ఏదైనా ఇతర ఆడిట్/తనిఖీ సమయంలో పాత ఫుటేజీని పరిశీలించాల్సిన అవసరం వచ్చి ఉంటుందా..?
అప్పటి ఘటనను ఇప్పుడు స్టాఫ్ తమ ఉన్నతాధికారులకు లేదా బయటి వ్యక్తులకు తెలియజేసి ఉంటారా..? దాని ఫలితంగా, ఉన్నతాధికారులు సీసీటీవీని తనిఖీ చేయమని ఆదేశించి ఉంటారా..? ఒక వార్త చుట్టూ ఎన్ని ప్రశ్నలో చూడండి…
Share this Article