Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిలియనీర్స్ బంకర్..! అణుయుద్ధం బూచిగా… ఇదో కమర్షియల్ స్కామ్..!!

October 14, 2025 by M S R

.
Ashok Kumar Vemulapalli …. బిలియనీర్స్ బంకర్… అప్పుడెప్పుడో వచ్చిన “ 2012” సినిమా చూసారు కదా .. యుగాంతం వచ్చేస్తుంటే ప్రపంచంలో డబ్బున్నోళ్లందరి కోసం ఒక పెద్ద షిప్ తయారు చేసుకుని అందులో జర్నీ చేస్తుంటారు ..

ఇక్కడ మిగిలిన ప్రపంచం ఎలా పోయినా పర్వాలేదు, మాలాంటి డబ్బున్నోళ్లు మాత్రమే బతికుండాలి .. మనం మన పిల్లలు అంటే రిచ్ కిడ్స్ మాత్రమే బతికుండాలి .. అంతే.. అది సినిమా స్టోరీనే కానీ రియల్ లైఫ్ లో కూడా .. ఎక్కడో ఇలాగే ప్రాణ భయంతో డబ్బున్నోళ్లు అంతా ఇలాంటి షిప్ లు కూడా తయారు చేయించుకునే ఉండొచ్చు ..

ఆ తర్వాత ఈ మధ్య వచ్చిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ చూసారు కదా .. అందులో .. అల్టిమేట్ బాటమ్ పాయింట్ ఏమంటే .. బాగా డబ్బున్నోళ్లకి ఆనందాన్ని మించిన ఆనందం కావాలి .. అంతకు మించి ఆనందం కావాలి .. డబ్బుతో .. అన్ని రకాల సుఖాలు అనుభవించేశారు ..

Ads

ఆఖరికి డ్రగ్స్ , సె- ఇవన్నీ బోర్ కొట్టేశాయి .. ఇంకా కిక్ కావాలి.. చాలా కిక్ కావాలి.. అందుకే .. ఈసారి కొత్త ఆనందాల కోసం పేదవాళ్ళు.. డబ్బుల కోసం ఒకరినొకరు తన్నుకు చచ్చేలా ఆట పెట్టాలి .. అక్కడి ఆటలు ఆడటానికి వచ్చినోళ్ళని ఆటలో ఓడిపోతే నిర్దాక్షిణ్యంగా అత్యంత క్రూరంగా కాల్చి చంపాలి .. అలా వాళ్ళు చస్తుంటే అది ప్రత్యక్షంగా .. చూస్తూ ఆనందించాలి ..

పేదవాళ్ల ఆర్తనాదాల్లోంచి, వారి రక్తపు బొట్లలోంచి .. డబ్బున్నోళ్ళు పైశాచికత్వాన్ని ఆస్వాదించాలి.. ఇందుకు ఎవరికీ తెలీని దీవిలోకి వాళ్ళందర్నీ తరలిస్తారు .. దానికి స్క్విడ్ గేమ్ అనే పేరు పెట్టి ధనవంతులంతా … ఎంజాయ్ చేస్తుంటారు .. ఇదంతా వెబ్ సిరిస్ స్టోరీ .. కానీ బహుశా ఈ పాటికే .. ఇలా ఎక్కడో జరుగుతూనే ఉండే ఉండొచ్చు ..

తాజాగా వచ్చింది ఈ “బిలియనీర్స్ బంకర్” వెబ్ సిరీస్ .. ప్రపంచ యుద్ధం వచ్చేసిందని ప్రాణాలు కాపాడుకోవడానికి బాగా డబ్బున్నోళ్ల కోసం భూమిలో కొన్ని వందల మీటర్ల లోతులో ఏర్పాటు చేసింది ఈ బిలియనీర్స్ బంకర్ ..

మనీ హీస్ట్ క్రియేటర్స్ ఆలెక్స్ పినా, ఎస్తర్ మార్టినెజ్ లోబాటో మళ్లీ తమ మ్యాజిక్ చేశారు – కానీ ఈసారి బ్యాంక్ రాబరీకి బదులు, బిలియనీర్ల మనసులను రాబ్ చేస్తున్నారు!  ఈ స్పానిష్ థ్రిల్లర్ 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది, ఇది ఒక డూమ్స్‌డే డ్రామా,

స్టోరీలో, వరల్డ్ వార్ III రాబోతుందని, న్యూక్లియర్ యుద్ధం జరగబోతుందని భయపెట్టి, ఒక గ్రూప్ బిలియనీర్లను లగ్జరీ బంకర్‌లోకి పంపేస్తారు. ఈ బంకర్ పేరు కిమెరా అండర్‌గ్రౌండ్ పార్క్ – బాస్కెట్‌బాల్ కోర్ట్, రెస్టారెంట్, జెన్ గార్డెన్, కాక్‌టెయిల్ బార్, సైకాలజిస్ట్ కౌచ్, జిమ్, స్పా – అన్నీ ఉన్నాయి!

బయట ప్రపంచం నాశనమవుతున్నట్టు స్క్రీన్ల మీద చూపిస్తూ, వీళ్ళు లోపల హాయిగా ఉంటారు.  కానీ ట్విస్ట్ ఏంటంటే, ఇదంతా ఒక గ్రాండ్ స్కామ్! మినర్వా అనే బ్లూ-కాలర్ వర్కర్, తన జీవితంలో సాధారణ డబ్బు సంపాదిస్తూ బోర్ కొట్టి, ఈ ప్లాన్ వేస్తుంది.

ఈ బిలియనీర్లు, తమ డబ్బుతో ప్రపంచాన్ని కొనేస్తామనుకునేవాళ్ళు, ఒక సాధారణ వర్కర్ చేత భయపెట్టబడి బంకర్‌లోకి పరిగెత్తుతారు. మినర్వా ఎలా సంపాదిస్తుందంటే? ముందుగా, డూమ్స్‌డే ఈవెంట్‌ను స్టేజ్ చేస్తుంది – ఫేక్ న్యూస్, ఫేక్ వార్నింగ్స్ తో జీవితం మీద భయం కలిగిస్తుంది.

ఆ తర్వాత, వీళ్ళను బంకర్‌లో లాక్ చేసి, AI-జెనరేటెడ్ వెర్షన్లతో వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బు సిఫన్ చేస్తుంది.  అంటే, బయట ప్రపంచం బాగానే ఉంది, కానీ వీళ్ళు లోపల భయంతో కూరుకుపోతున్నారు, మరియు వాళ్ళ డబ్బు మినర్వా పాకెట్‌లోకి వెళ్తుంది!

ఈ సిరీస్ ఎక్స్‌ట్రీమ్ వెల్త్ ఎలా మైండ్‌ను పొల్యూట్ చేస్తుందో చూపిస్తుంది – బిలియనీర్లు తమను తాము లాస్ట్ సర్వైవర్స్ అనుకుంటూ, లోపల ఫ్యామిలీ ఫ్యూడ్స్, సీక్రెట్స్ తో గొడవలు పడుతుంటారు.  కానీ నిజానికి, అదంతా ఒక ఆర్టిఫిషియల్ లైఫ్, డబ్బుతో బఫర్ చేసిన బుడగలు. వ్యంగ్యం ఏంటంటే, ఈ రిచ్ ఫోక్ భయంతో బంకర్ కొనుక్కుని, తమ డబ్బును మరిన్ని డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకు ఇస్తున్నారు – పర్ఫెక్ట్ క్యాపిటలిజం సెటైర్..!

బాగా డబ్బున్నోళ్లకి చావు భయం – ప్రాణం మీద తీపి పెంచి .. వాళ్ళని దోచుకోవడమే ఈ సిరీస్ సారాంశం .. చాలా బావుంది ..

యుగాంతం – స్క్విడ్ గేమ్- బిలియనీర్స్ బంకర్ .. మూడింట్లో సింగిల్ పాయింట్ డబ్బు .. డబ్బున్నోళ్లు ..
పారాసైట్ అనే కొరియన్ సినిమా ఉంటుంది .. ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది .. అందులోనూ పేదోడు – డబ్బున్నోడి మధ్య అంతరం చూపిస్తారు .. కారులో పేదోడి చెమట వాసనని కూడా భరించలేని డబ్బున్నోడిని అదే పేదోడు ఎలా హత్య చేసే పాయింట్ మీద పారాసైట్ మూవీ నడుస్తుంది ..

ఇప్పటికే సొసైటీలో డబ్బున్నోళ్ల కోసం .. ప్రీమియం సర్వీసులు , లగ్జరీ సర్వీసులు వచ్చేశాయి .. రిచ్ కిడ్స్ మాత్రమే ఉండేలా ప్రీమియం అపార్ట్మెంట్లు వచ్చేశాయి .. అంతెందుకు ఫ్లైట్ లో కూడా ఎకానమి, బిజినెస్ అని సెగ్రిగేట్ చేస్తారు ..

ఆఖరికి పబ్బుల్లోనూ డబ్బున్నోళ్ల కోసం ప్రత్యేకంగా ప్రీమియం పబ్బులు వచ్చేశాయి . కిక్ కావాలి .. మజా కావాలి .. ఆనందం కావాలి .. అవధుల్లేని సంతోషం కావాలి .. అన్నీ అనుభవించేసాం .. అన్ని సుఖాలు దాటేశాం.. ఇంకా ఏదో కొత్తగా కావాలి .. దానికోసం ఎంత ఖర్చయినా పెడతారు….. అశోక్ వేములపల్లి

( ఈ ఆర్టికల్- రివ్యూ డబ్బున్నోళ్లకి ఏమాత్రం వ్యతిరేకం కాదు .. వాళ్ళని చూసి మాలాంటి వారి చేతగానితనాన్ని తల్చుకుని ఏడ్చే ఏడ్పు అంతకన్నా కాదు .. ఇది కేవలం సమాజంలో జరుగుతున్న అంశాలపై విశ్లేషణ మాత్రమే ..)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తప్పుడు కేసులో 43 ఏళ్ల జైలు… ఎట్టకేలకు నిర్దోషి… కానీ మరో అన్యాయం..?
  • ఈ దర్శనం అమూల్యం… ఇది కళ్లకు తెలియని ఓ భక్తి పారవశ్యం…
  • ఆ స్వరం Gata rahe mera dil అంటూ గుండెల్లో మారుమోగుతూనే ఉంది…!
  • సానుభూతి వేరు… వోట్లేసే లెక్క వేరు… పాత ప్యాటర్న్ చెప్పేది ఇదే…
  • బిలియనీర్స్ బంకర్..! అణుయుద్ధం బూచిగా… ఇదో కమర్షియల్ స్కామ్..!!
  • విశ్వనాథుడి మరో సంగీత కెరటం… శృతిలయలు చక్కగా కుదిరిన కథ…
  • మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..!!
  • మీకు సుగర్ ఉందా..? వేడివేడిగా లాగించకండి…! బాగా చల్లారనివ్వండి..!!
  • చిదంబరం ‘తప్పుల ఒప్పుకోలు’ ప్రకటనలు… అసలు మర్మమేమిటో…
  • Good Classmates..! ఆ క్లాస్‌మేట్ ఆత్మ ఆనందపడి ఉంటుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions